అమలతో రామ్ చరణ్ ‘చిలుకా క్షేమమా..’

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 19:42 [IST]
చిరంజీవి-శోభన జంటగా నటించిన ‘రౌడీ అల్లుడు’ చిత్రంలోని ‘చిలుకా క్షేమమా...’ అనే పాట ఎంత ఫేమసో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ రొమాంటిక్ మెలోడియస్ సాంగంటే ఇప్పటికీ సంగీత అభిమానులు చెవి కోసుకుంటారు. తాజాగా ఈ పాటను రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ను ఇప్పటికే హీరోయిన్ గా ఎంపిక చేయగా, ఇటీవల అమలపాల్‌ను సెకండ్ హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు.

ఈచిత్రంలో రామ్ చరణ్-అమలపై ‘చిలుకా క్షేమమా..’ అనే పాటను ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మగధీర సినిమాలో ‘బంగారు కోడి పెట్ట’ పాటను రిమీక్స్ చేసి సక్సెస్ అయిన చెర్రీ. రచ్చ సినిమాలో వాన వాన వెల్లువాయే పాటలో కూడా కనిపించబోతున్నాడు.

సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘రచ్చ’ సినిమాను మార్చి 29న గానీ ఏప్రిల్ 5న గానీ విడుదల చేసే యోచనలో ఉన్నారు. మెగా సూపర్ గుడ్ బ్యానర్‌పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
English summary
Ram Charan is doing 'Chiluka Kshemama' remix his upcoming flick with V.V. Vinayak along Amala Paul.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST