బన్నీ-శృతి హాసన్ జంటగా సెల్వరాఘవన్ సినిమా

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 11:35 [IST]
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ చిత్రంలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందించి విడుదల చేయాలనే ఆలోచనలో సెల్వరాఘవన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు చిత్రాల ద్వారా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సెల్వరాఘవన్ తాజాగా అల్లు అర్జున్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉండటంతో చర్చనీయాంశం అయింది.

బన్నీ కూడా సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినిమా చేయడంపై చాలా ఇంట్రెస్టుగా ఉన్నాడు. పైగా ఆ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందించే ప్రయత్నాలు జరుగనుండటంతో తమిళంలోనూ తన మార్కెట్ పెంచుకోవచ్చనే ఆలోచనలో ఉన్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సెల్వరాఘవన్ ప్రస్తుతం ఆర్య-అనుష్క జంటగా ‘ఇరండమ్ ఉలగమ’ అనే తమిళ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
English summary
Director Selvaraghavan is planning for yet another Telugu/Tamil bilingual film with Stylish Star Allu Arjun and multifaceted beauty Shruti Hassan as the leads.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST