సునీల్ నెక్ట్స్ చిత్రం ఖరారు..డిటేల్స్

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 10:26 [IST]
రీసెంట్ గా పూల రంగడుతో హిట్ కొట్టిన సునీల్ తన తదుపరి చిత్రం కు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే అదీ పూలరంగడు టైప్ లోనే రీమేక్ కావటం విశేషం. గతంలో ఆడుతూ పాడుతూ,లీలా మహల్ సెంటర్, బ్లేడ్ బాబ్డీ వంటి హిట్ చిత్రాలు డైరక్ట్ చేసిన దేవి ప్రసాద్ దర్సకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పైన ఆర్.బి.చౌదరి నిర్మించే ఈ చిత్రం ఈ నెల 26న ప్రారంభం కానుంది. హిందీ సూపర్ హిట్ చిత్రం తను వెడ్స్ మను రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా ఈ చిత్రంలో మార్పులు చేసి స్క్రిప్టు తిరగరాసారని తెలుస్తోంది.

ఇక హిందీలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మాధవన్, కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన ఈ హిందీ చిత్రం తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఇక దేవిప్రసాద్ ..అల్లరి నరేష్ తో చేసిన బ్లేడ్ బాబ్జీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రం కమిటయ్యారు. ఈ చిత్రం ఆనంతరం ఆయన అల్లరి నరేష్ తో మరో చిత్రం చేయనున్నారు. కులుమనాలి నిర్మించిన నిర్మాతలు ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.
English summary
Sunil has given his nod to another new flick to be produced by renowned banner Mega Supergood films.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST