'దమ్ము'ఆడియో రైట్స్ వారికే...

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 11:31 [IST]
జూ ఎన్టీఆర్,త్రిష కాంబినేషన్ లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న దమ్ము చిత్రం ఆడియో ఉగాది రోజున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోని ఫ్యాన్సీ రేటు ఇచ్చి వేల్ రికార్డులు వారు తీసుకున్నారు. కీరవాణి స్వంత సంస్ధ అయిన వేల్ రికార్డు వారు తీసుకోవటంతో ఈ చిత్రం ఆడియోపై మరితం అంచనాలు పెరిగాయి. ఇక ఈ ఆడియో పంక్షన్ ని విభిన్నంగా చేయాలని నిర్మాత అలగ్జాండర్ వల్లభ ప్లాన్ చేస్తున్నారు. మల్టి సిటీ ఆడియో ఫంక్షన్ గా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. అంటే మూడు సిటీల్లో ఒకే సారి అభిమానుల మధ్య ఈ ఆడియో పంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది. దాంతో ఆ ప్రాంతాల్లో ఉన్న ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు. అంతేగాక ఆడియోకు అదనపు పబ్లిసిటీ వస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. జూనియర్ సరసన త్రిష కార్తీక నటిస్తున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా... పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు. బోయపాటి శ్రీను దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
English summary
Vel Records has bagged the music rights of Dammu for an undisclosed amoun
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST