మా బేబీకి పేరు దొరికింది: అభిషేక్

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 12:03 [IST]
ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ ముద్దుల పాపాయి ‘బిటి బి’ పేరుపై గత కొంత కాలంగా మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు పేరు ఎప్పుడు పెడతారో? ఆమె ఫోటోలు బయటి ప్రపంచానికి ఎప్పుడు చూపిస్తారో? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కూడా. అయితే ఎట్టకేలకు దీనిపై ఉన్న సందిగ్ధం వీడే సమయం ఆసన్నమైంది. ‘‘మా బేబీకి ఒక మంచి పేరు దొరికిందని, త్వరలోనే దాన్ని వెల్లడిస్తామని’’ అభిషేక్ బచ్చన్ వెల్లడించారు.

‘బేటి బి’ విషయంలో ఇప్పటి వరకు అనేక రూమర్లు ఉన్నాయి. ఆమె పేరు, తొలి చూపు....ఓఫ్రా విన్ ఫ్రే నిర్వహించే కొత్త టాక్ ద్వారా ప్రపంచానికి తెలియనున్నాయని ప్రచారం జరిగింది. ఐశ్వర్య, అభిషేక్ ఇద్దరి పేర్లలోని రెండు అక్షరాలు వచ్చేలా ‘అలియా’ అనే పేరును పరిశీలిస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి.

అయితే ఈ రూమర్లన్నింటినీ అభిషేక్ కొట్టి పారేశారు. అదే విధంగా ఓ కార్యక్రమం ద్వారా బేటి బి ఫోటోను, పేరు వెల్లడిస్తారనే ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు. త్వరలో నేనే వెల్లడిస్తా అని స్పష్టం చేశారు. బాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్ తిరిగి ఇంటికి చేరాక బేటిబి ఫోటోలు, పేరు బయటకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
English summary
The wait is finally over. New parents, actors Aishwarya Rai and Abhishek Bachchan have finally decided on a name for their baby girl. And daddy Abhishek has assured that the name will be revealed soon.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST