Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Virushka: కూతురి విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న కోహ్లీ.. అప్పటి వరకు చూపించం అంటూ..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ టాప్ మోస్ట్ సెలబ్రెటీలని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రేమలో పూర్తిగా మునిగి తేలిన తరువాతే పెళ్లితో మరింత దగ్గరయ్యారు. ఇక విరాట్, అనుష్క ఈ ఏడాది జనవరిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు వారి కూతురి రూపాన్ని ఇంతవరకు చూపించలేదు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వీడియో అడుగగా కోహ్లీ ఎవరు ఊహించని సమాధానం ఇచ్చాడు.
మూడు ముళ్ళు వేసిన తరువాత
వరల్డ్ టాప్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఆటలో ఎంత బిజీగా ఉన్నా కూడా తన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ ను ను మాత్రం పెద్దగా మిస్సవ్వడు. చాలా వరకు తన భార్య అనుష్క శర్మతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. పెళ్లికి ముందు ఎన్నో పార్టీలకు వెళ్లిన విరాట్ మూడు ముళ్ళు వేసిన తరువాత అలాంటి లైఫ్ ను చాలా వరకు దూరం పెట్టేశాడు.
సినిమాలను దూరం పెట్టేసి..
ఇక అనుష్క శర్మ కూడా సినిమాలను చాలా వరకు తగ్గించేసింది. కేవలం తనకు నచ్చిన ముఖ్యమైన పాత్రలను మాత్రమే చేస్తోంది. షారుక్ ఖాన్ తో చివరగా జీరో సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత హీరోయిన్ పాత్రలు వచ్చినా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఎక్కువగా నిర్మాతగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది.
కూతురి వీడియో అడగడంతో..
ఇక అప్పుడప్పుడు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విరాట్ కోహ్లీ ఇటీవల కూడా అనేక రకాల ప్రశ్నలపై స్పందించాడు. అయితే ఒక నెటిజన్ కూతురికి సంబంధించిన చిన్న వీడియో బైట్ ఏదైనా రిలీజ్ చేయవచ్చు కదా అని అడిగాడు. అందుకు విరాట్ కోహ్లీ చాలా సున్నితంగా సమాధానం ఇచ్చాడు.
కుదరదు అంటూ..
అది కుదరదు. మేమిద్దరం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే.. మా కూతురికి సోషల్ మీడియా అంటే ఏమిటో అర్థం చేసుకోలేని వయసులో తనను సోషల్ మీడియాలో బహిర్గతం చేయాలని అనుకోవడం లేదు. తనకు తెలిసినప్పుడు తన ఇష్టం ఉంటేనే సోషల్ మిడియాలోకి వస్తుందని విరాట్ క్లియర్ గా వివరణ ఇచ్చాడు.
Recommended Video
వమికా అనే పేరుకు అర్థం ఇదే..
ఇక వమికా అనే పేరుకు అర్థం ఏమిటో తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ లో గట్టిగానే సెర్చ్ చేస్తున్నారు. ఇక ఆ పేరు అర్థమేమిటి అని అడుగగా కోహ్లీ మొదటిసారి ఆన్సర్ ఇచ్చాడు. వమికా అంటే 'దేవత దుర్గ' అంటూ కూల్ గా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో అందరూ ఇంటిపట్టునే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని కూడా విరాట్ తెలియజేశాడు.