twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: ఆ ఒక్క స్టెప్పు కోసం ఎన్ని టేక్స్ తీసుకున్నామంటే? నాటు నాటు సాంగ్ మేకింగ్ పై తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్

    |

    జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సక్సెస్ తర్వాత తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు రోజు రోజుకు మరింత ఎక్కువ అవుతున్నాయి.. తప్పకుండా ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిని మరో లెవెల్ తీసుకు వెళుతుందని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించగా అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.

    సంగీతం విషయంలో కూడా

    సంగీతం విషయంలో కూడా

    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అంచనాలు స్థాయిని ఒక్కసారిగా పెంచేశాయి. టీజర్స్ అయితే అన్ని భాషల్లోనూ క్లిక్ అయ్యాయి. ఇక పాటలు కూడా ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. రాజమౌళి తన ప్రతి సినిమాలో కూడా యాక్షన్ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ మాత్రమే కాకుండా పాటల విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటాడు.

    అభిమానులందరికీ కనెక్ట్ అయ్యే విధంగా

    అభిమానులందరికీ కనెక్ట్ అయ్యే విధంగా

    అంతేకాకుండా ప్రతి ఒక్క పాటకు సంబంధించిన కొరియోగ్రఫీ విషయంలో కూడా ఆయన పాత్ర ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అభిమానులందరికీ కనెక్ట్ అయ్యే విధంగా కంపోజ్ చేయిస్తూ ఉంటారు. కొరియోగ్రాఫర్స్ కు తగినంత సమయం ఇవ్వడమే కాకుండా పూర్తి స్వేచ్ఛను కూడా ఇస్తూ ఉంటారు. అదే తరహాలో తన మార్కు ఏమాత్రం మిస్ అవ్వకుండా సలహాలు కూడా ఇస్తారు. అందుకే రాజమౌళితో వర్క్ చేయడానికి చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

    నాటు నాటు పాటకు భారీ క్రేజ్

    ఇక RRR సినిమాలో ప్రస్తుతం అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటున్న సాంగ్ నాటు నాటు పాట అనే చెప్పాలి. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మరొకసారి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నారు. కేవలం క్లాస్ పాటలతోనే కాకుండా ఊర మాస్ సంగీతంతో కూడా మెప్పించగలడు అని మళ్ళీ రుజువు చేశారు. నాటు నాటు సాంగ్ కోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఒకే తరహా టైమింగ్ తో స్టెప్పులు వేసే విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

    Recommended Video

    Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
    ఎన్ని టేక్స్ తీసుకున్నాము అంటే..

    ఎన్ని టేక్స్ తీసుకున్నాము అంటే..

    ఇక తెరవెనుక జరిగిన ప్లానింగ్ గురించి అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక క్లారిటీ ఇచ్చాడు. నాటు నాటు సాంగ్ లో నేను చరణ్ కలిసి చేసిన స్టెప్ కోసం చాలా టేక్స్ తీసుకున్నాం. పాటలో కాళ్ళు ఎడమవైపు కుడివైపు ముందుకు వెనక్కు కదుపుతూ ఉండాలి. కాబట్టి 15 నుంచి 18 టేక్స్ వరకు చేయాల్సి వచ్చింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరి స్టెప్పులు కూడా సరిగ్గా వచ్చేవరకు వదిలిపెట్టలేదు. ఇద్దరం సమానం గా స్టెప్పులు వేయడం పై అందరూ పొగుడుతూ ఉన్నారు.

    ఆ విషయంలో రాజమౌళి ఆడియన్స్ పల్స్ ను చాల పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు అని అర్థమవుతుంది. ఆడియన్స్ కు ఏం కావాలో ఆయనకు చాలా బాగా అర్థమవుతుంది. అందుకే అయినా ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు అని జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు.

    English summary
    Jr ntr about RRR movie natu natu song makinig
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X