twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maa Electionsలో రిగ్గింగ్ కలకలం.. ఊగిపోతూ ఆ నటుడిని చంపేస్తానని మోహన్ బాబు వార్నింగ్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసాభాసాగా మారాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అనుకున్నట్లుగానే ఎనిమిది గంటలకు పోలింగ్ మొదలైంది కానీ ఇప్పుడు రిగ్గింగ్ ఆరోపణలతో పోలింగ్ నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. అసలు ఏమైంది అనే వివరాల్లోకి వెళితే

    అధ్యక్ష పదవికి పోటీ

    అధ్యక్ష పదవికి పోటీ

    మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కూడా తమకు మద్దతుగా నిలబడే వ్యక్తులు అందరినీ కలుపుకొని కూడా తమ తమ ప్యానెల్స్ కూడా ప్రకటించారు. ముందు నుంచి కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వ్యక్తిగతంగా కూడా దాడి చేసుకునే వరకు వెళ్లారు. ఇక ఈరోజు ఉదయం మొదలైన పోలింగ్ లో కూడా అనేక విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

     బెనర్జీని చంపేస్తానని వార్నింగ్

    బెనర్జీని చంపేస్తానని వార్నింగ్

    పోలింగ్ బూతులో నటుడు బెనర్జీ మీద మోహన్ బాబు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లో ఆవేశంతో ఊగిపోయిన మోహన్ బాబు బెనర్జీని చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. అలాగే నటి హేమ శివ బాలాజీ మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోపక్క శివబాలాజీ నటుడు సమీర్ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ విషయంలో సమీర్ మీద ఎన్నికల అధికారికి శివబాలాజీ ఫిర్యాదు చేశారు. మరోపక్క ప్రకాష్ రాజ్ ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

    రిగ్గింగ్

    రిగ్గింగ్

    ఏదో ఒక వ్యక్తి రిగ్గింగ్ చేస్తున్నాడని మంచు విష్ణు బృందం ఆరోపించడంతో ఓటింగ్ కాసేపు నుంచి నిలిచిపోయింది. ఇక ఆ వ్యక్తిని పట్టుకున్న పోలింగ్ సిబ్బంది అతనిని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరి మద్దతుదారులను పిలిపించుకున్న ఎన్నికల అధికారి రెండు బృందాలతో చర్చలు జరుపుతున్నారు.. రిగ్గింగ్ చేసినట్లు గనుక తేలితే ఫలితాల ప్రకటన చేయను అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం మీద కోర్టుకు కూడా వెళ్తాను అని ఆయన హెచ్చరించారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

    మాస్ వేసుకుని

    మాస్ వేసుకుని

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కాని వ్యక్తి లోపలికి వచ్చాడు అని విష్ణు బృందం ఆలోచిస్తూ ఉండగా, ఆ వ్యక్తి లోపలికి రావడం మీద నరేష్ అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ వ్యక్తి మాస్క్ వేసుకుని లోపలికి వచ్చాడని దీంతో అందరూ అతన్ని వెంబడించారు అని, కానీ విష్ణు వదిలేయమని చెప్పడంతో వదిలేశారని విష్ణు మద్దతిస్తున్న ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఎన్నికల నిర్వహణ సిబ్బంది అతన్నీ అదుపులోకి తీసుకున్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    సమావేశం అయ్యాకే

    సమావేశం అయ్యాకే

    ఇక ప్రస్తుతం రెండు బృందాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధికారి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశం జరిగిన తర్వాత మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఇప్పటికే ఓటింగ్ కు రామ్ చరణ్ చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వంటి బడా హీరోలు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    English summary
    Maa Polling on hold due to rigging allegations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X