twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Natyam movie Review.. ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా.. సంధ్యారాజు వన్ ఉమెన్ షో!

    |

    రేటింగ్: 2.5/5

    నటీనటులు: సంధ్యా రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ తదితరులు
    కథ, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, దర్వకత్వం: రేవంత్ కోరుకొండ
    మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
    బ్యానర్: నిశ్రింకళ ఫిల్మ్స్
    రిలీజ్ డేట్: 2021-10-22

    నాట్యం కథ ఏమిటంటే?

    నాట్యం కథ ఏమిటంటే?

    భారతీయ కళలకు, సంస్క‌తికి పుట్టినిల్లు లాంటి నాట్యం అనే గ్రామంలో సితార (సంధ్యా రాజు (సత్యం రామలింగ రాజు కోడలు)) గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో రంగ ప్రవేశం చేయాలని కోరుకొంటుంది. గురువు (ఆదిత్య మీనన్), ఆయన కుమారుడు హరి (కమల్ కామరాజ్) పర్యవేక్షణలో నృత్యంలో ప్రావీణ్యం సంపాదిస్తుంది. తన చిన్న నాటి కలగా మిగిలిని కాదంబరి కథను నృత్య రూపకంలో చెప్పాలని కలలు కంటుంది. అయితే గ్రామ పెద్ద (శుభలేఖ సుధాకర్) కుట్ర వల్ల ఆ గ్రామం నుంచి హైదరాబాద్‌కు రోహిత్ ( రోహిత్ బెహల్) సహాయంతో పారిపోతుంది.

    నాట్యం కథలో ట్విస్టులు

    నాట్యం కథలో ట్విస్టులు

    కాదంబరి నృత్యరూపకాన్ని ప్రదర్శించాలనే కోరికకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. నాట్యం గ్రామానికి వచ్చిన రోహిత్‌తో కలిసి సితార ఎందుకు పారిపోయింది. తన గురువ కుమారుడు హరి తనపై ఎందుకు పగను పెంచుకొన్నాడు. తన చిన్ననాటి కలకు అడ్డు పడిన గ్రామ పెద్దను ఎలా ఎదురించింది. కాదంబరి కథను అమెరికాలో ఎందుకు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకొన్నది. చివరకు సొంత ఊరిలో గురువు ఆశీస్సులతో రంగ ప్రవేశం చేసిందా అనే ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే నాట్యం సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    బ్రిటీష్ కాలంలో నాట్యం అనే గ్రామంలో సంప్రదాయ భారతీయ నృత్యంపై ఎలాంటి ఆంక్షలు విధించారనే అంశాలతో ఆసక్తిగా సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ప్రస్తుత కాలంలో నృత్యకారిణిగా ఎదుగాలనే సితార ఆశలు, ఆశయాలతో మధ్య కథ అటు ఇటు ఊగిసలాడుతుంది. ఆదిత్య మీనన్ లాంటి ఎమోషనల్ పాత్రతో అక్కడక్కడ ఫీల్‌గుడ్ కనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకొన్నారు, సినిమా కథను ఇంత నిధానంగా చెబుతున్నారనే అనే ఫీలింగ్ వచ్చే సరికి ఓ మంచి ట్విస్ట్‌తో ఫస్టాఫ్ ముగించడమే కాకుండా సెకాండఫ్‌పై ఆసక్తిని పెంచేలా చేస్తుంది.

    సెకండాఫ్ ఇలా సాగింది..

    సెకండాఫ్ ఇలా సాగింది..

    ఇక సెకండాఫ్‌లో సాగే కథ, కథనాలు కాస్త అసలు కథకు డిటాచ్ అయ్యారని అనిపిస్తుంది. కథ డిమాండ్ మేరకు సాగదీశారమే అనే సర్ధిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ముగింపు వరకు కథ, కథనాల్లో మంచి హైప్ కనిపిస్తుంది. ఎమోషనల్ డ్రామా రక్తి కట్టడం కథలో లీనం అవ్వడానికి దోహదపడుతుంది. చివరి 20 నిమిషాలు ఈ సినిమాకు హైలెట్‌గా మారుతుంది.

    డైరెక్టర్ రేవంత్ గురించి

    డైరెక్టర్ రేవంత్ గురించి

    డైరెక్టర్ రేవంత్ విషయానికి వస్తే.. తాను ఎంచుకొన్న బేసిక్ పాయింట్ బాగుంది. బ్రిటిష్ కాలం అంశాలను లేటస్టే కథకు జోడించడం ఆకట్టుకొనేలా ఉంది. కానీ కథను ఎమోషనల్‌గా మార్చడంలో కాస్త తడబాటు కనిపించింది. స్క్రీన్ ప్లే కూడా కాస్త ఫాస్ట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చెప్పి ఉంటే నాట్యం సినిమా డెఫినెట్‌గా ఆనందబైరవి, స్వర్ణకమలం సినిమాల మాదిరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి ఉండేది అనిపిస్తుంది. చివరి 20 నిమిషాలను డీల్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.

    సంధ్యా రాజు ప్రతిభ గురించి

    సంధ్యా రాజు ప్రతిభ గురించి

    నాట్యం సినిమాకు సంధ్యా రాజు వన్ ఉమెన్ షో అని చెప్పవచ్చు. యాక్టింగ్ పరంగా, డ్యాన్సుల పరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకొంటుంది. కీలక సన్నివేశాల్లో ఆమె హావభావాలు ఆకట్టుకొంటాయి. ఇక నటిగానే కాకుండా క్యాస్డూమ్ డిజైనర్‌గా, ప్రొడక్షన్ బాధ్యతలను కూడా సంధ్యా రాజు చాలా ప్రొఫెషనల్‌గా నిర్వర్తించారని చెప్పవచ్చు. సితారగా మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్‌ను తెరపైన చూపించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్ల కంటే మెరుగ్గా ప్రతిభను చాటుకొన్నారని చెప్పవచ్చు.

    మిగితా పాత్రలు ఎలా ఉన్నాయంటే...

    మిగితా పాత్రలు ఎలా ఉన్నాయంటే...

    మిగితా పాత్రల విషయానికి వస్తే.. కమల్ కమరాజ్ మరోసారి ఓ రొటీన్ పాత్రకే పరిమితమయ్యారు. కాకపోతే డ్యాన్సర్‌గా ఆయనను కొత్త కోణంలో చూడటానికి అవకాశం ఏర్పడింది. నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. రోహిత్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాడు. డ్యాన్సింగ్ పరంగా, నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకొన్నారు. ఈ సినిమాకు ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ ప్రత్యేక ఆకర్షణ. కథను డ్రైవ్ చేయడంలో ఈ రెండు పాత్రలు తమ పరిధి మేరకు కీలక పాత్రను పోషించాయి. భానుప్రియ లాంటి సీనియర్ నటి, న్యాట్యంలో ప్రవేశం ఉన్న ఆమెను పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మిగితా పాత్రలు ఒకే అనిపిస్తాయి.

    టెక్నికల్ విభాగం పనితీరు

    టెక్నికల్ విభాగం పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. అలగే రేవంత్ కోరుకొండ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. అద్బుతమైన లోకేషన్లు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌గా మారాయి. ఎడిటింగ్ పరంగా రేవంత్ మరింత దృష్టి పెట్టాల్సి ఉండాల్సింది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. లోకేషన్లు, సెట్స్ హైలెట్‌గా అనిపిస్తాయి. అలాగే సినిమాకు క్యాస్ట్యూమ్స్ మరింత రిచ్‌ను, శోభను తెచ్చిపెట్టాయి. అందుకు సంధ్యా రాజున అభినందించాల్సిందే.

    Recommended Video

    Natyam Movie Review By Nandamuri Balakrishna
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా, కళలు, నృత్యం, సంప్రదాయాలను మేలవించిన చిత్రం నాట్యం. కమర్షియల్ వ్యాల్యూస్‌కు దూరంగా చక్కటి ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌తో అందించిన చిత్రంగా చెప్పవచ్చు. కాకపోతే కథ, కథనాలు మైనస్ కావడంతో ఈ సినిమా క్లాసిక్‌కు దూరంగా నిలిచిపోయిందనే అభిప్రాయం కలుగుతుంది. నృత్య ప్రధానంగా సాగే ఎంటర్‌టైనర్లను ఇష్టపడే ప్రేక్షకులకు నాట్యం తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి డౌట్స్ లేకుండా థియేటర్‌లో చూడవచ్చు. ఎలాంటి అంచనాల లేకుండా వెళ్తే మీరు పెట్టిన సొమ్ముకు న్యాయం అందిస్తుంది.

    English summary
    Natyam is romantic drama film written, directed, filmed and edited by Revanth Korukonda. It is produced by Sandhya Raju under the banners of Nishrinkala Films, and features Sandhya Raju in the lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X