twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR గ్లింప్స్‌ సరికొత్త రికార్డులు.. విజువల్స్ కు మహేష్ బాబు ఫిదా..

    |

    టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని బాహుబలి సినిమాతో అమాంతంగా బాలీవుడ్ దగ్గరకు చేర్చాడు. ఇక RRR సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచడమే కాకుండా తెలుగు హీరోల స్థాయిని కూడా దేశవ్యాప్తంగా బాలీవుడ్ స్టార్స్ తో సమానంగా నిలిచేలా చేయబోతున్నాడు అని చాలా ఈజీగా అర్థమవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ , జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొదటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద నెవర్ బిఫోర్ అనేలా రికార్డులను బ్లాస్ చేస్తుందని మరో క్లారిటీ వచ్చేసింది.

    సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ కూడా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అలాగే ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై అంచనాల స్థాయిని ఆకాశంలోకి తీసుకువెళ్లాయి. ఇక ఇప్పుడు వచ్చిన RRR గ్లింప్స్‌ అంతకు మించి అనేలా ఉంది. సినిమా రిజల్ట్ పై మరోసారి దర్శకుడు రాజమౌళి చాలా క్లారిటీగా చూపించేశాడు. సక్సెస్ అవ్వడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక కేవలం బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు బద్దలు చేస్తుంది అనేది లెక్కలు వేసుకోవాలి. సినిమా మాత్రం తప్పకుండా సక్సెస్ అని అర్ధమయ్యింది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ యూట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూస్ అందుకుంటూ మునుపెన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలోనే భారీగా లైక్స్ కూడా అందుకుంటోంది. RRR గ్లింప్స్‌ యూట్యూబ్ లో విడుదలైన 5 గంటల్లోనే 1.6 మిలియన్స్ విమ్ అందుకుంది.

    Mahesh babu positive comments on RRR movie first glimpse

    ఇప్పటివరకు వచ్చిన టీజర్స్ లో ఏది కూడా ఈ స్థాయిలో ట్రెండ్ అవ్వలేదు. ఇక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేశాడు.

    ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి తన వివరణ ఇచ్చాడు.. అద్భుతమైన విజువల్స్ చూసి ఆశ్చర్యపోయాను! జస్ట్ వావ్.. స్టన్నింగ్!! #RRR సినిమా చూడటానికి వేచి ఉండలేను.. అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్టును రాజమౌళి తో చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న ఈ సూపర్ స్టార్ త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. రాజమౌళితో ఒక ప్రాజెక్ట్ అయితే సెట్ అయ్యింది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాల్సి ఉంది. తప్పకుండా సినిమా కూడా పాన్ ఇండియా మార్కెట్ కి తగ్గట్టుగానే ఉంటుంది అని మహేష్ ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు.

    English summary
    Mahesh babu positive comments on RRR movie first glimpse
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X