twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krithi Shetty ఆ సమయంలో నాగార్జున ఫుల్ మాస్.. నేను ఫన్ పటాకా.. బంగార్రాజుపై కృతిశెట్టి ఫిదా

    |

    ఉప్పెన సినిమాలో బేబమ్మగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న కృతిశెట్టి.. నాగలక్ష్మీగా బంగార్రాజులో ఓ విలేజ్ గర్ల్ పాత్రను పోషించారు. బేబమ్మ పాత్రను నాగలక్ష్మీ రిప్లేస్ చేస్తుందా అనే ప్రశ్నకు ప్రేక్షకులే సమాధానం చెప్పాలి అంటూ కృతిశెట్టి చెప్పారు. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ చిత్రం గురించి కృతి శెట్టి చాలా విషయాలు చెప్పి తన అనుభావాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్‌తో కృతిశెట్టి మాట్లాడుతూ..

    సర్పంచ్ నాగలక్ష్మీగా కృతిశెట్టి

    సర్పంచ్ నాగలక్ష్మీగా కృతిశెట్టి

    దర్శకుడు కల్యాణ్ కృష్ణ బంగార్రాజు కథ చెప్పినప్పుడు ఇంత కాన్ఫిడెన్స్‌గా ఉంటారా? అనే ఫీలింగ్ కలిగింది. క్యారెక్టర్ గురించి చెబుతున్నప్పుడే నేను బాగా నవ్వాను. స్క్రీన్ మీద చూస్తే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో నేను నాగలక్ష్మీ పాత్రను అంగీకరించాను. బంగార్రాజు పాత్ర పూర్తిగా ఫన్ పటాకాలా ఉంటుంది. ఈ సినిమాలో నేను సర్పంచ్‌ రోల్ ప్లే చేస్తాను. సర్పంచ్ అంటే స్వచ్ఛమైన తెలుగులో స్పీచ్ ఇవ్వాలి. ఈ సినిమా వరకు నాకు భాష కొత్త పదాలు నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. డైలాగ్ పేపర్ ఇచ్చినప్పుడు నాకు పదాల మీనింగ్ తెలుస్తుంది. కానీ బంగార్రాజు సినిమా డైలాగ్ పేపర్ ఇచ్చిన తర్వాత పదాలు చూస్తే అనేక డౌట్లు వచ్చాయి. ఆ పదాలు గురించి అడిగి తెలుసుకొన్నాను అని కృతిశెట్టి అన్నారు.

    నాగ్‌తో నటించడానికి భయపడ్డా

    నాగ్‌తో నటించడానికి భయపడ్డా

    బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగచైతన్యతో నటించే అవకాశం వచ్చినప్పుడు కాస్త భయపడ్డాను. సెట్లో కలిసిన తర్వాత వారిద్దరూ జెంటిల్మన్‌లా బిహేవ్ చేశారు. నేను చాలా ఫ్రీగా ఫీలవ్వడానికి కంఫర్ట్‌నెస్‌ను కల్పించారు. వారిని కలిసి తర్వాత చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ప్రతీ ఆర్టిస్టుకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. జూనియర్ అని కాకుండా టీమ్ మెంబర్‌గా ట్రీట్ చేయడం చాలా సంతోషం కలిగించింది అని కృతిశెట్టి చెప్పారు.

    ఆ క్రెడిట్ ప్రేక్షకులకే చెందుతుంది

    ఆ క్రెడిట్ ప్రేక్షకులకే చెందుతుంది

    ఉప్పెన తర్వాత నాకు పెద్ద హీరోలు, మంచి ప్రొడక్షన్స్‌తో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ ఈ రేంజ్‌లో ఉండటానికి ప్రధాన కారణం ఉప్పెన. ఆ సినిమాను ఆదరించి బేబమ్మగా తమ మనసులో స్థానం కల్పించిన ప్రేక్షకులకు ఆ క్రెడిట్ చెందుతుంది. బంగార్రాజు సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. దర్శకుడు కల్యాణ్ కృష్ణకు ఏమైనా ఒత్తిడి ఉండొచ్చు. కానీ ఆ ప్రెజర్‌ను ఎప్పుడూ చూపించలేదు అని కృతిశెట్టి తెలిపారు.

    నాగలక్ష్మీ పాత్ర కోసం కసరత్తు ఎలా అంటే..

    నాగలక్ష్మీ పాత్ర కోసం కసరత్తు ఎలా అంటే..

    బంగార్రాజు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత షూటింగ్‌కు చాలా సమయం చిక్కింది. కథ చెప్పినప్పుడే నేను ఓ ఫైల్ తయారు చేసుకొంటాను. హెయిర్ స్టైయిల్, మేకప్, క్యాస్టూమ్ ఎలా ఉండాలనేది డిజైన్ చేసుకొంటాను. స్క్రిప్ట్ విన్న తర్వాత నేను పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నించాను. ప్రతీ పాత్రకు ఒక్కో విధంగా సమయం పడుతుంది. ఈ సినిమాకు కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నాను అని కృతిశెట్టి చెప్పారు.

    నాగార్జున పొగరుగా.. అలా ఒదిగిపోయి

    నాగార్జున పొగరుగా.. అలా ఒదిగిపోయి


    సైకాలజీ స్టూడెంట్‌గా నేను గ్రహించిన ప్రకారం.. నాగార్జున సార్ షాట్ లేనప్పుడు.. క్లాస్‌గా కనిపిస్తారు. షాట్‌లోకి వెళ్లగానే ఫుల్ మాస్‌గా మారిపోతారు. అలా ట్రాన్స్‌ఫార్మ్ కావడం నాకు బాగా ఆకట్టుకొన్నది. ఒక సెకన్‌లో పంచకట్టు పాత్రలోకి దూరిపోవడం.. ఒకరకమైన పొగరును ఎలివేట్ చేయడం అందరికి సాధ్యం కాదు అంటూ నాగార్జున గురించి కృతిశెట్టి తెలిపారు.

    బేబమ్మ వేరు.. నాగలక్ష్మీ వేరు..

    బేబమ్మ వేరు.. నాగలక్ష్మీ వేరు..

    బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మీ క్యారెక్టర్‌కు సంబంధించిన కామెడీ టైమింగ్, ఆ పాత్ర కాన్ఫిడెన్స్ చూస్తే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఈ సీన్లు చేసేటప్పుడే మేము చాలా ఎంజాయ్ చేశాం. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇంకా ఎంజాయ్ చేశాం. నా మూడు సినిమాల్లో పాత్రలు వేర్వేరు. ఆ పాత్రల కోసం చాలా ఎఫర్ట్ పెట్టాను. ఉప్పెన సినిమాలో గ్రామీణ యువతి పాత్రను పోషించినప్పటికీ.. బంగార్రాజు సినిమాలో పాత్ర డిఫరెంట్ అని కృతిశెట్టి అన్నారు.

    సైకాలజీ చదివిన తర్వాత

    సైకాలజీ చదివిన తర్వాత

    సైకాలజీ సబ్జెక్ట్ అంటే ఎదుటి మనిషిలోని విషయాలు గ్రహించడం కాదు. వ్యక్తిగా ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలి. పరిస్థితులను ఎలా బేరిజు వేసుకోవాలి. సైకాలజీ అంటే ఆస్ట్రాలజీ కాదు. కానీ నేను చదువుకొన్న సైకాలజీ ద్వారా నా పాత్రల తీరుతెన్నుల గురించి తెలుసుకోవడం, నా క్యారెక్టర్‌ను డెవలప్ చేయడం ఎలా అనే విషయాలను నేర్చుకొంటాను అని కృతిశెట్టి చెప్పారు.

    English summary
    Actress Krithi Shetty is zooming up with her career at high note after Uppena. Shayam Singha Roy gives milleage for her success ride. She shared her experience about Bangarraju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X