twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Half Lion: ఆహా స్టూడియోస్ బిగ్ ప్రాజెక్ట్.. ఈసారి ఏకంగా పాన్ ఇండియా వెబ్ సీరీస్

    |

    కరోనా ప్రభావం కారణంగా ఒక్కసారిగా ఓటీటీ సామ్రాజ్యంకు వందల కోట్ల స్థాయిలో మార్కెట్ ఏర్పడింది. థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలు కూడా ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ సంస్థలు ఆవహించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక భవిష్యత్తులో సినిమా థియేటర్స్ పై ఓటీటీ సంస్థలు తీవ్ర ప్రభావం చూపుతాయి అనే ఆరోపణలు కూడా చాలానే వస్తున్నాయి. అయితే ఆ విషయంలో కొంతమంది ముందు జాగ్రత్తగా వారికి ఒక ప్రత్యేకమైన ఫ్లాట్ ఫార్మ్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికీ ఆ రూట్లో ఇప్పటికే ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పాటు చేసి మంచి విజయాన్ని అందుకుంటున్నారు. ఆహా ఓటీటీ యాప్ కు రోజురోజుకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

    మంచి కంటెంట్ అందించడంలో నిర్మాత అల్లు అరవింద్ తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగిస్తున్నారు అనే చెప్పాలి. మంచి వెబ్ సిరీస్ లతో మాత్రమే కాకుండా స్టార్ హీరోలతో మంచి టాక్ షోలను లను కూడా నిర్వహిస్తూ పాజిటివ్ గా క్రేజ్ అందుకుంటూ ఆహా స్థాయిని పెంచుతున్నారు. అయితే ఇటీవల ఆహా స్టూడియోస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో అల్లు అరవింద్ ఓటీటీ సంస్థను మరింత విస్తరింప చేయాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హడావుడి ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అదే ఫార్మాట్లో పాన్ ఇండియా వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని అనుకుంటున్నారు.

     Allu aravind pan india web series in aha studio

    కేవలం ఆహా యాప్ తెలుగుకే పరిమితం కాకుండా మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యత పెరిగేలా చేయాలని అనుకుంటున్నారు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో పాటు ఆహా ప్రత్యేకమైన టాక్‌ షోలతో ప్రేక్షకులను పెంచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన పాన్ ఇండియా వెబ్ సీరీస్ కు శ్రీకారం చుట్టారు. ఇటీవల నిర్వహించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో అల్లు అరవింద్ ఆహా స్టూడియోస్ ను లాంఛ్ చేస్తూ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి బయోపిక్ పాన్ ఇండియా వెబ్ సీరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

    1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా పనిచేసిన తెలుగు వ్యక్తి పి.వి.నరసింహారావు జీవితం అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అయితే ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు కూడా సాధారణ జనాల నుంచి ఉన్నత స్థాయి సెలబ్రిటీల వరకు ప్రేరణ చెందేలా ఉంటాయని అన్నారు. ఇక అందుకే ఆ మహోన్నత వ్యక్తి జీవితాన్ని డిజిటల్ రూపంలో వెబ్ సీరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలియజేశారు. 2023లోనే ఆ ప్రాజెక్ట్ ను తెలుగు తమిళ్ హిందీ తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఈ వెబ్ సిరీస్ ను ఆహా స్టూడియోస్ తో పాటు అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలియజేశారు. ఇక రానున్న రోజుల్లో ఆహా యాప్ నుంచి మరిన్ని డిఫరెంట్ వెబ్ సీరీస్ లు రాబోతున్నట్లు అర్థమవుతోంది.

    English summary
    Allu aravind pan india web series in aha studio
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X