Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English ગુજરાતી हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

రామ్ చరణ్ ‘నాయక్’లో మూడో హీరోయిన్

Posted by:
Published: Tuesday, September 18, 2012, 10:10 [IST]

Shruti Hassan Nayak
 

రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ‘నాయక్ ' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ది లీడర్ అనేది ట్యాగ్ లైన్ . ఈచిత్రానికి సంబంధించిన విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రంలో మూడో హీరోయిన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. తాజాగ గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ను కూడా స్పెషల్ సాంగు కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరో కావడంతో శృతి హాసన్ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు, ఫుల్ మాస్ మూవీగా తీర్చిదిద్దడంలో భాగంగా మరో మాస్ మసాలా స్పెషల్ సాంగును ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్‌ చేయనున్నారు. ''మాస్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్‌ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్‌' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్‌ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్‌ చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదకు వస్తుంది. సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు.

రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు' చిత్రంలో, బాలీవుడ్లో ‘జంజీర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనే కసి రామ్ చరణ్‌లో కనిపిస్తోంది.

English summary
According to latest buzz, Vinayak struggle to decide hot beauty for a special song in Nayak has finally belived to be ended. Vinayak seems to be a bit relaxed person as hot beaty has believed to accept to shake her legs with Ram charan. It's Shruti Hassan who is going to share the screen presence with Ram Charan in the song.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu
Subscribe Newsletter
Qualifier 1 , Feroz Shah Kotla, Delhi
Chennai Super Kings won by 48 runs