Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

సూర్య 'బ్రదర్శ్' ఆడియో విడుదల తేది ఖరారు

Posted by:
Published: Thursday, September 20, 2012, 12:47 [IST]

సూర్య 'బ్రదర్శ్' ఆడియో విడుదల తేది ఖరారు
 

హైదరాబాద్ : సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్. అవిభక్త కవలల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రదర్శ్ అనే టైటిల్ పెట్టి తెలుగుకు అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 22న విడుదల చేస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గతంలో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ చిత్రం మిక్సెడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా,ఓపినింగ్స్ పరంగా మంచి రెవిన్యూ తెచ్చి పెట్టింది. దాంతో ఈ చిత్రానికి సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. బెల్లంకొండ సురేష్ తెలుగుకి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.

ఇక తొలిసారిగా సూర్య తన వాయిస్ ని తెలుగువారికి వినపించనున్నారు. తనే తన పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. బెల్లంకొండ సురేష్ తెలుగుకి అందిస్తున్న ఈ చిత్రం సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడా మంచి ఓపినింగ్స్ ఉంటాయంటున్నారు. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ కి మార్కెట్లో మంచి రేటు పలికింది . కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు.

మాట్రాన్, ఎమ్జీఆర్ చిత్రంలా అన్ని వర్గాల వారిని అలరించేలా ఉంటుందని ఆ చిత్ర హీరో సూర్య వెల్లడించారు. ఈయన అవిభక్త కవలలుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం మాట్రాన్. ర్య మాట్లాడుతూ... మాట్రాన్‌లో ప్రతి సన్నివేశంలో నటించ డం సరికొత్త అనుభవమే. నేను నటుడిగా రంగప్రవేశం చేసి 13 ఏళ్లు అయ్యింది. ఇప్పటివరకు మాట్రాన్ చిత్రం లో పాత్రల తరహాలో నటించలేదు. ఇందులో కవలలుగా విరుద్ధ భావాలున్న పాత్రలు పోషించాను. ఒక పాత్ర పేరు అఖిళన్, మరో పాత్ర పేరు విమలన్. ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. అయితే ఇద్దరూ హీరోలే. రెండు పాత్రల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇక ఇందులో దర్శకుడి పని తీరు అద్భుతం. మాట్రాన్ చిత్రం కోసం కెవి ఆనంద్ ఎంతగా శ్రమించారో నాకు తెలుసు.

ర్శకుడు కె.వి.ఆనంద్ మాట్లాడుతూ థాయిలాండ్‌కు చెందిన అవిభక్త కవలలను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం మాట్రాన్ అని తెలిపారు. ఈ కవలలు అమెరికా వెళ్లి ఒక సర్కస్ కంపెనీ ప్రారంభించి బాగా ఉన్నత స్థితికి చేరుకున్నారని శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఫ్లైట్‌లో పయనిస్తుండగా ఒక మ్యాగజైన్‌లో చదివానన్నారు. అప్పుడే దీన్ని ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేద్దామని సూర్యతో చెప్పానన్నారు. ఆ విధంగా మాట్రాన్ తెరకెక్కిందని వివరించారు. ఒక పాట మినహా చిత్రం పూర్తి అయ్యిందని చెప్పారు. డబ్బింగ్ కూడా పూర్తి అయ్యిందని, ప్రస్తుతం గ్రాఫిక్స్ జరుగుతున్నాయని తెలిపారు.

English summary
The audio of Suriya, Kajal starrer Brothers is going to be launched in Hyderabad on September 22. KV Anand (of Rangam fame) has directed the film and Suriya will be seen as conjoined twins. The action entertainer is titled Maattrraan in Tamil and it's one of the most eagerly awaited films of the year. So far, none of the Tamil films dubbed in Telugu have managed to do well in Andhra Pradesh this year. However, that might change with Brothers since Suriya has a huge market here. Harris Jayaraj has composed the music. The film is going to release on October 12.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice