twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Elimination: చివరి రోజు బిగ్ ట్విస్ట్.. పొజిషన్స్ తారుమారు.. ఈ సారి వెళ్లిపోయేది అతడేనా!

    |

    ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయం అయినా.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్. అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టే అయినా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నాలుగు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జరుగుతోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో నడుస్తోంది. ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది.

    అదే సమయంలో టాప్ -5లో ఎవరు ఉంటారన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ రిజల్ట్ గురించి ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

    13 వారాలు.. 13 మంది బయటకు

    13 వారాలు.. 13 మంది బయటకు

    గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌కు ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 13 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారంలో ప్రియాంక సింగ్‌లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో వెళ్లిన విషయం తెలిసిందే.

    హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!

    టాప్ -5లో ఎవరుంటారన్న ఆసక్తి

    టాప్ -5లో ఎవరుంటారన్న ఆసక్తి

    తాజా సీజన్ ఫినాలేకు టైం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఆరుగురు కంటెస్టెంట్లలో టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే వాళ్లు ఎవరన్న దానిపై ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎవరికి తోచిన పేర్లను వాళ్లు చెబుతున్నారు. అదే సమయంలో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కూడా పోటాపోటీగా టాస్కులు ఆడుతున్నారు. ఇప్పుడున్న ఆరుగురిలో శ్రీరామ్ ఇప్పటికే ఫినాలేకు చేరుకున్నారు. మిగిలిన వారిలో ఒకరు మాత్రం ఈ వారం ఎలిమినేట్ అవబోతున్నారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

    ఈ వారంలో ఐదుగురు నామినేట్

    ఈ వారంలో ఐదుగురు నామినేట్

    ఐదో సీజన్‌లో ఆరంభం నుంచే వీలైనంత ఎక్కువ మందిని నామినేషన్స్‌లో ఉంచుతున్న విషయం తెలిసిందే. తద్వారా కంటెస్టెంట్ల భవిష్యత్‌ను ప్రేక్షకుల చేతిలో పెడుతున్నారు. ఇక, ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో టాప్ 5 కంటెస్టెంట్ల జాతకాలను కూడా వాళ్లకే వదిలేశారు. అందుకే హౌస్‌లో ఉన్న అందరనీ (టికెట్ టు ఫినాలే గెలిచిన శ్రీరామ్ తప్ప) ఈ వారానికి నామినేట్ చేశారు. దీంతో మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు నామినేట్ అయ్యారు. ఇక, వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

    Ashu Reddy Pregnant: తల్లి కాబోతున్న అషు.. పిచ్చ కొట్టుడు కొట్టిన తల్లి.. అలా బయటకు వచ్చిన వీడియోAshu Reddy Pregnant: తల్లి కాబోతున్న అషు.. పిచ్చ కొట్టుడు కొట్టిన తల్లి.. అలా బయటకు వచ్చిన వీడియో

    టాప్ కోసం వాళ్లిద్దరు పోటీ పడినా

    టాప్ కోసం వాళ్లిద్దరు పోటీ పడినా

    14వ వారానికి సంబంధించి నామినేషన్స్‌లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారు. దీంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టాప్ ప్లేస్ కోసం షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ కనిపించిందని అంటున్నారు. ఆరంభంలో ఒకరు మొదటి స్థానంలో ఉంటే.. తర్వాతి రోజు మరొకరు టాప్‌ ప్లేస్‌కు వచ్చారని తెలిసింది. ఇలా ఈ వారం మొత్తం వీళ్లిద్దరూ తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారట. అయితే, 14వ వారం చివరకు సన్నీనే ఈ వారం నెంబర్ వన్‌గా ఉన్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

    మొదటి మూడు స్థానాలు వారివే

    మొదటి మూడు స్థానాలు వారివే

    టాప్ 5ను నిర్ణయించే వారం కావడంతో ఈ సారి ప్రేక్షకులు ఓటింగ్‌లో భారీ స్థాయిలో పాల్గొన్నారని తెలుస్తోంది. తమకు నచ్చిన కంటెస్టెంట్‌ను ఫినాలేకు చేర్చడం కోసం వాళ్లంతా ఉత్సాహంగా ఓట్లు వేశారని అంటున్నారు. దీంతో అందరి స్థానాలూ తరచూ మారుతూ వచ్చాయి. ఇక, చివరి రోజు మాత్రం ఓటింగ్‌ ఒక్కసారిగా పెరిగిపోయిందట. దీంతో కొన్ని స్థానాల్లో మార్పులు కూడా వచ్చాయని బుల్లితెర వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఓటింగ్ ముగిసే నాటికి షణ్ముఖ్, సన్నీలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. సిరి హన్మంత్ మూడో స్థానంలో నిలిచిందని అంటున్నారు.

    జబర్ధస్త్‌‌కు సుధీర్ టీమ్ షాక్: ఇలా జరుగుతుందని అనుకోలేదు.. మమ్మల్ని క్షమించండంటూ ఏడుస్తూ!జబర్ధస్త్‌‌కు సుధీర్ టీమ్ షాక్: ఇలా జరుగుతుందని అనుకోలేదు.. మమ్మల్ని క్షమించండంటూ ఏడుస్తూ!

    చివరి రోజు ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్

    చివరి రోజు ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్

    14వ వారం మొత్తం ఓటింగ్ ప్రక్రియ ఊహించని పరిణామాలతో సాగిందన్న టాక్ వినిపిస్తోంది. ఆరంభంలో ఒకరు చివరి స్థానంలో ఉంటే మధ్యలో మరొకరు లాస్ట్‌కు వచ్చారు. కానీ, వారాంతంలో ఇంకొకరు డేంజర్‌ జోన్‌లో నిలిచారని అంటున్నారు. వాస్తవానికి ఈ వారం కాజల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశాలు చాలా ఉన్నాయన్న టాక్ వినిపించింది. అయితే, శుక్రవారం ఓటింగ్‌లో ఆమె భారీగా పుంజుకుందని తెలుస్తోంది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న మానస్ చివరి స్థానానికి పడిపోయి.. ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

    బిగ్ బాస్ స్ట్రాటజీ అదే అంటూ

    బిగ్ బాస్ స్ట్రాటజీ అదే అంటూ

    టాప్ -5ను ఎంపిక చేసుకునే వారం కావడంతో ఈ సారి ఎలిమినేషన్‌ విషయంలో బిగ్ బాస్ నిర్వహకులు ఓ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సీజన్‌లో ఇద్దరు అమ్మాయిలు.. ముగ్గురు అబ్బాయిలను ఫినాలేలో ఉంచేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే తక్కువ ఫాలోయింగ్ ఉన్న మానస్‌ను ఈ వారం బయటకు పంపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్, ఆర్జే కాజల్ ఫినాలేలో అడుగు పెడతారన్న మాట.

    English summary
    Bigg Boss 5th Season Running Successfully. Sunny and Shanmukh Got Huge Votes. Maanas and RJ Kajal Got Very Less Votes In 14th Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X