twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Badava Rascal review ఫుష్ప ధనుంజయ్ అదుర్స్.. మదర్ సెంటిమెంట్‌తో

    |

    Rating: 2.75/5

    రాంగోపాల్ వర్మ రూపొందించిన భైరవ గీత, ఇటీవల కాలంలో సంచలన విజయం సాధించిన పుష్ప చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ధనుంజయ్ హీరోగా నటించిన చిత్రం బడవ రాస్కెల్. ఈ సినిమాకు ధనుంజయ నిర్మాతగా కూడా మారడం విశేషం. కన్నడలో భారీ విజయాన్ని అందుకొన్న ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్‌ చేసి రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18వ తేదీన రిలీజైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయంలోకి వెళితే..

    మధ్య తరగతి కుటుంబానికి చెందిన శంకర్ (ధనుంజయ్) ఓ ఆటో డ్రైవర్ కొడుకు. ఎంబీఏ చదివినప్పటికి తన తండ్రి వారసత్వాన్ని తీసుకొని ఆటోడ్రైవర్‌గా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో సంపన్న కుటుంబం, రాజకీయ నాయకురాలి కూతురు సంగీత (అమృతా అయ్యంగార్) ప్రేమలో పడుతాడు. పెళ్లి చేసుకోనేందుకు సిద్ధమవుతున్న సమయంలో శంకర్‌కు హ్యాండిస్తుంది.

     Badava Rascal Telugu review and Rating: Dhananjay done fair job as shankar

    ఉన్నత చదువును అభ్యసించిన శంకర్ ఎందుకు ఆటో డ్రైవర్‌గా మారాడు? ఆటో డ్రైవర్‌గా శంకర్ ఫిలాసఫి ఏమిటి? ఆటో డ్రైవర్‌ శంకర్‌తో గొప్పింటి యువతి సంగీత ఎందుకు ప్రేమలో పడింది. పీకల్లోతు ప్రేమలో కూరుకు పోయిన తర్వాత ఎందుకు వెనకడుగు వేసింది? శంకర్‌తో పెళ్లిని నిరాకరించడానికి కారణం ఏమిటి? తన ప్రేమను నిరాకరించిన తర్వాత శంకర్ పరిస్థితి ఏమిటి? చివరకు శంకర్, సంగీత ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే బడవ రాస్కెల్.

    బడవ రాస్కెల్‌లో సాదా సీదా, రెగ్యులర్ ప్రేమకథ అయినప్పటికీ.. కథ చుట్టు అల్లిన తండ్రి కొడుకుల బంధం, తల్లి, కొడుకు సెంటిమెంట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. అయితే తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన శంకర్ గురు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ కథ, కథనాలను మరింత వేగంగా తెరమీద చూపించి ఉంటే డిఫినెట్‌గా మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ అయి ఉండేది. ఫస్టాఫ్ వేగంగానే సాగినప్పటికీ.. సెకండాఫ్ మరీ సాగదీతగా అనిపిస్తుంది. కానీ విడి విడిగా తల్లి, కొడుకు, తండ్రి కొడుకు మధ్య ఉండే సెంటిమెంట్ హృదయానికి హత్తుకొంటుంది. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా.. ఊహించినట్టే ఉంటుంది. కాకపోతే స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్‌ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

    శంకర్‌గా ధనుంజయ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రకు తగినట్టుగా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఫైట్స్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. తల్లితో శంకర్ చెప్పే డైలాగ్స్, తండ్రితో పంచుకొనే భావోద్వేగం ఆకట్టుకొంటుంది. డబ్బింగ్ విషయంలో కొంచెం శ్రద్ద వహించాల్సింది. తనదైన మేనరిజం మాస్ డైలాగ్స్‌తో ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. శంకర్ ప్రియురాలిగా అమృత తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది. శంకర్ తల్లిదండ్రులుగా తార, రంగయన రఘు ఫీల్‌గుడ్ పెర్పార్మెన్స్ అందించారు. శంకర్ ఫ్రెండ్‌గా నాగలింగ‌గా నటించిన నాగభూషణ్ మంచి హాస్యాన్ని పండించాడు. సంగీత తల్లిగా స్పర్ష రేఖ నెగిటివ్ షేడ్స్‌ పాత్రతో ఆకట్టుకొన్నారు.

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రాఫర్‌గా ప్రీతా జయరామన్ ప్రతిభను చాటుకొన్నారు. మాస్ సీన్లు, ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా తెరకెక్కించారు. వాసుకి వైభవ్ సంగీత బాగుంది. మాస్ నంబర్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. డాలీ పిక్చర్స్ బ్యానర్‌పై ధనుంజయ్ ఈ సినిమాను రూపొందించారు. తెలుగులో రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా రిజ్వాన్‌ విడుదల చేశారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌కు తగినట్టుగా తెలుగులో రిచ్ క్వాలిటీస్‌తో బడవ రాస్కెల్‌ను రిలీజ్ చేశారు.

    నటీనటులు: ధనుంజయ, అమృతా అయ్యంగార్, నాగభూషణ్, రంగాయణ రఘు, తారా, స్పర్ష రేఖ తదితరులు
    రచన, దర్శకత్వం: గురు శంకర్
    నిర్మాత: ధనుంజయ, గుజ్జల్ పురుషోత్తం, రిజ్వాన్
    సినిమాటోగ్రఫి: ప్రీతా జయరామన్
    ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే
    మ్యూజిక్: వాసుకి వైభవ్
    బ్యానర్: డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌
    రిలీజ్ డేట్: 2022-02-18

    English summary
    Kannada star Dhananjaya's Badava Rascal hits the screens on February 18th. In this occassion, Here is the Telugu filmibeats exclusive reveiw
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X