twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stopకి ఆదిలోనే హంసపాదు.. పెద్ద ప్లాన్ వేశారు కానీ అంతా ఫెయిల్.. అసలు ఏమైందంటే?

    |

    ఎన్నో అంచనాలతో ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజుల వ్యవధిలోనే నిలిపి వేయడం చర్చనీయాంశంగా మారుతోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటి? అనేది బయటకు రాలేదు కానీ దీని వెనుక పెద్ద కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఆ విషయాన్ని బయటకు రానీయకుండా ఉండడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టకేలకు ఆ విషయం బయటకు వచ్చింది. అసలు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎందుకు ఆపేశారు? అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే

    భేదాలు ఏర్పడే విధంగా

    భేదాలు ఏర్పడే విధంగా

    హిందీ బిగ్ బాస్ లో ఏర్పాటు చేసిన విధంగానే తెలుగులో కూడా బిగ్ బాస్ షో ఓటీటీ ఫార్మాట్ తీసుకు వచ్చి దానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ అని పేరు పెట్టారు. గతంలో పాల్గొన్న కొంతమంది అలాగే కొత్తవాళ్లను కలిపి 17 మందిని హౌస్ లోపలికి పంపారు. అనుభవం ఉన్న పాత కంటెస్టెంట్ లకు వారియర్లు అని కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలెంజర్లు అని పేర్లు పెట్టి రెండు టీములుగా విభజించి ఒకరి గురించి ఒకరికి విభేదాలు ఏర్పడే విధంగా టాస్క్ లు ఇస్తున్నారు.

    తలపట్టుకున్న పరిస్థితి

    తలపట్టుకున్న పరిస్థితి

    అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ మీద ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి ఏర్పడ లేదు. 24 గంటల పాటు ఎవరూ చూడ లేకపోవడం ఒక ఎత్తు అయితే గతంలో రోజుకు గంట ఎపిసోడ్ విడుదల చేయగా ఉదయం ఒక అరగంట ఎపిసోడ్ సాయంత్రం ఒక అరగంట ఎపిసోడ్ విడుదల చేయడం కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ సాధారణ ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. ఈ విషయం మీద ఏం చేయాలా అని బిగ్ బాస్ నిర్వాహకులు తలపట్టుకున్న పరిస్థితి నెలకొంది.

     ఏ మాత్రం సరిపోవడం లేదని

    ఏ మాత్రం సరిపోవడం లేదని

    అయితే మరో సమస్య కూడా వచ్చి పడింది. అదేమిటి అంటే తమిళ బిగ్ బాస్ నిర్వాహకులు ఈ రోజు జరిగిన ఈ విషయం రేపు జరిగినట్టు ప్రేక్షకులకు ఒక రోజు గ్యాప్ ఇచ్చి టెలికాస్ట్ చేస్తూ వచ్చారు. కానీ తెలుగు నిర్వాహకులు మాత్రం ప్రేక్షకులను పెద్దగా మాయలో పడ వేయకుండానే రెండు గంటల గ్యాప్ తో సీజన్ నడిపించాలని భావించారు. అయితే ఆ రెండు గంటల గ్యాప్ అనేది ఎడిటింగ్ చేసుకోవడానికి ఏ మాత్రం సరిపోవడం లేదని తెలుస్తోంది.

     డెబ్భై కెమెరాల అవుట్ ఫుట్

    డెబ్భై కెమెరాల అవుట్ ఫుట్

    రెండు గంటల సమయంలో డెబ్భై కెమెరాల అవుట్ ఫుట్ మొత్తాన్ని పరిశీలించి ఏది ప్రేక్షకులకు ఇస్తే బాగుంటుంది? దేన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే వాళ్లు ఇంప్రెస్ అయ్యి షో మీద ఆసక్తి చూపిస్తారు అనే విషయాన్ని అంచనా వేయలేక పోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక రోజు గ్యాప్ దొరికితే 70 కెమెరాలను మొత్తం పరిశీలించి ప్రేక్షకుల ముందుకు ఏ కంటెంట్ తీసుకు వస్తే వారు ఆసక్తి చూపిస్తారు అనేదాన్ని ఒక అంచనా వేసుకుని దానిని మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట.

    Recommended Video

    Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
    12 గంటల నుంచి మళ్లీ మొద

    12 గంటల నుంచి మళ్లీ మొద


    అదీకాక 24 గంటల పాటు టెలికాస్ట్ అనే పేరుతో కంటెస్టెంట్ లు నిద్రపోతున్న సమయంలో వారు నిద్రపోతున్న ఫుటేజీలను కూడా చూపిస్తున్నారు. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు ఎవరు చూడటానికి ఆసక్తి చూపిస్తారు ? ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కొంతమంది నిద్ర పోతూ ఉండగా మరికొంతమంది మెలకువగా ఉండి ఏదో మంతనాలు జరుపుతున్నట్టు ప్రేక్షకులకు భ్రమ కలిగిస్తూ కంటెంట్ క్రియేట్ చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి మళ్లీ మొదలు కాబోతోంది చూడాలి ఈసారి ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది.

    English summary
    Bigg Boss Non Stop : reason behind the interruption of 24/7 live streaming
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X