twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The WARRIORR: రామ్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. ఆ గెటప్‌తో సర్‌ప్రైజ్ చేసిన హీరో

    |

    కొన్నేళ్ల పాటు వరుసగా ఫ్లాపులు ఎదురు కావడంతో తెగ ఇబ్బందులు పడినా.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఈ సినిమా విజయాన్ని అందించడమే కాదు.. భారీ కలెక్షన్లను కూడా రాబట్టి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి యమ జోష్‌తో కనిపిస్తోన్న అతడు.. ఆ వెంటనే 'రెడ్'తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని సినిమాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ యంగ్ హీరో కోలీవుడ్ డైరెక్టర్ లింగు సామీతో ఓ సినిమాను మొదలు పెట్టేశాడు.

    Anasuya Bharadwaj తో అది కావాలన్న హైపర్ ఆది: పుష్ప నటుడితో బేరాలు.. వైరల్‌గా వీడియో!Anasuya Bharadwaj తో అది కావాలన్న హైపర్ ఆది: పుష్ప నటుడితో బేరాలు.. వైరల్‌గా వీడియో!

    రామ్ పోతినేని 19వ సినిమాగా తెరకెక్కుతోన్న దీన్ని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసినా.. ఆ తర్వాత కోవిడ్ సెకెండ్ వేవ్ రావడంతో షూటింగ్‌ను మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన రెడ్యూలర్ షూటింగ్‌ను యూనిట్ ఆరంభించేసింది. అంతేకాదు, వరుసగా పలు షెడ్యూళ్లను కూడా చకచకా జరిపించేశారు. అలా అంతా సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే హీరో రామ్ షూటింగ్‌లో గాయపడ్డాడు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను మరోసారి ఆపేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

    Ram Pothineni and Lingusamy Movie Title The WARRIORR

    తెలుగు, తమిళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు వాటిని రెట్టింపు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఓ అప్‌డేట్ రాబోతుందని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్‌ను రివీల్ చేశారు. ఇక, ఈ సినిమాకు 'ద వారియర్' అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో రామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫర్‌ గెటప్‌తో కనిపించాడు.

    హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ద వారియర్' మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇక, ఈ మూవీలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటించబోతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే కన్నడ భామ అక్షర గౌడను తీసుకున్నారని కూడా చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ఆ తర్వాత పలువురి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

    'ద వారియర్' సినిమాలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.

    English summary
    Ram Pothineni Now Doing The WARRIORR Moviw Under Kollywood Director Lingusamy Direction. Now This Film Title Poster Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X