twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe Shyam 3 Days Collections: పవన్‌ను దాటిన ప్రభాస్.. 204 కోట్లకు మూడు రోజుల్లో వచ్చింది ఎంతంటే!

    |

    కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలో తెలుగు సినిమాలకే పరిమితం అయిన అతడు.. బాహుబలి సక్సెస్ తర్వాత పంథాను మార్చుకున్నాడు. ఈ చిత్రంతో తన స్టామినాను దేశ వ్యాప్తంగా చూపించడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు.

    అప్పటి నుంచి భారీ చిత్రాలే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాధే శ్యామ్' అనే బిగ్ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో పాటు కలెక్షన్లూ అనుకున్న విధంగా రావడం లేదు. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' మూడు రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

    ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌

    ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌

    రెబెల్ స్టార్ ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను పోషించాడు.

    బట్టలు లేకుండా యాంకర్ విష్ణుప్రియ రచ్చ: హాట్ షోలో హద్దు దాటి మరీ దారుణంగా!బట్టలు లేకుండా యాంకర్ విష్ణుప్రియ రచ్చ: హాట్ షోలో హద్దు దాటి మరీ దారుణంగా!

    ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

    ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

    తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ఏరియాల్లో ప్రభాస్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ జరిగింది.

    3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    3వ రోజూ ‘రాధే శ్యామ్' మూవీ ఏపీ, తెలంగాణలో బాగా రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 4.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.07 కోట్లు, ఈస్ట్‌లో రూ. 66 లక్షలు, వెస్ట్‌లో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 76 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో.. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.58 కోట్లు షేర్, రూ. 18 కోట్లు గ్రాస్ వచ్చింది.

    కాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారికాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారి

    2 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    2 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    ‘రాధే శ్యామ్'కు 3 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 22.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.26 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.87 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.98 కోట్లు, గుంటూరులో రూ. 4.08 కోట్లు, కృష్ణాలో రూ. 2.34 కోట్లు, నెల్లూరులో రూ. 1.90 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 48.39 కోట్లు షేర్, రూ. 75.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    రెండు రాష్ట్రాల్లో 3 రోజుల్లో ‘రాధే శ్యామ్'కు రూ. 48.39 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 3.95 కోట్లు, తమిళనాడులో రూ. 61 లక్షలు, కేరళలో రూ. 13 లక్షలు, హిందీలో రూ. 6.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.55 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ. 71.83 కోట్లు షేర్‌తో పాటు రూ. 126.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 71.83 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 132.17 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

    Recommended Video

    Radhe Shyam Movie Art Director Ravinder Reddy Exclusive Interview About Radhe Shyam Movie
     మూడో రోజు 6.. ఓవరాల్‌గా 8వ స్థానం

    మూడో రోజు 6.. ఓవరాల్‌గా 8వ స్థానం

    ‘రాధే శ్యామ్' మూవీకి ఆశించిన రీతిలో టాక్ రాకున్నా మూడో రోజు ఈ సినిమా బాగానే రాబట్టింది. దీంతో మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు చేసిన చిత్రాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. తద్వారా వకీల్ సాబ్‌ను దాటేసింది. ఇక, మూడు రోజులకు కలిపి ఎక్కువ షేర్ రాబట్టిన చిత్రాల జాబితాలో మాత్రం ఇది ఎనిమిదో స్థానంలో ఉండడం గమనార్హం.

    English summary
    Prabhas Did Radhe Shyam Movie Under Radha Krishna Kumar Direction. This Movie Collects Rs 71.83 Cr in 3 Days .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X