twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam శౌర్యను చెంపదెబ్బ కొట్టబోయిన స్వప్న.. డాక్టర్ నిరుపమ్ ఏం చేశాడంటే?

    |

    శ్రీరాం నగర్ బస్తీకి వెళ్లిన జ్వాలా అలియాస్ శౌర్యకు ఎమోషనల్ సంఘటనలు ఎదురయ్యాయి. గతంలో తాము ఉన్న ఇంటిలో తన తండ్రి కార్తీక్ ఫోటోకు దండేసి పూజలు చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. మోనిత ఆంటీ ఇంటిని శుభ్రం చేస్తుందా? లేదా నా శత్రువు హిమ నా తండ్రికి ఫోటోకు పూజలు చేస్తుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే అంతలోనే హోటల్‌లో పనిచేసే రవ్విడ్లీ అనే బాలుడు కలవడంతో.. ఇంటిలో తన ఫోన్ మరిచిపోయాను. వెళ్లి తీసుకు రమ్మని అడిగింది. దాంతో ఇంట్లోకి అడుగుపెట్టిన రవ్విడ్లి కార్తీక్ ఫోటో చూసి షాక్ తిన్నాడు. అంతలోనే శౌర్య జేబులో ఫోన్ మోగడంతో రవ్విడ్లిని పిలిచి.. జేబులోనే ఫోన్‌ ఉందని చెప్పి పిలిచింది. తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కార్తీకదీపం సీరియల్ తాజా 1327 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    రవ్విడ్లీకి శౌర్య వార్నింగ్

    రవ్విడ్లీకి శౌర్య వార్నింగ్

    జ్వాలా వద్దకు వచ్చి రవ్విడ్లీ నాకు కూడా ఆటో డ్రైవింగ్ నేర్పించవా అంటే.. కోపగించుకొన్నది. నవ్వు డాక్టర్ కావడానికి చదువుకోవాలి. ఖాళీ సమయంలో హోటల్ అకౌంట్స్ చూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది. చిన్నతనంలో హిమ చేసిన పనికి తన తల్లిదండ్రులు మరణించడాన్ని గుర్తు చేసుకొని బాధపడింది. అంతలోనే శౌర్యకు హిమ ఫోన్ చేయడంతో రిలాక్స్ అయింది. ఇప్పుడే రవ్విడ్లిపై అరిచాను. నీవు ఫోన్ చేయగానే నా కోపం హుష్ కాకి అయిపోయింది అని శౌర్య చెప్పింది. అయితే తాను ప్రేమ్ నిర్వహించే ఫోటో ఎగ్జిబిషన్‌కు నీవు కూడా రమ్మని చెప్పింది.. హిమ అక్కడికి బయలు దేరింది.

    ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్‌ కోసం..

    ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్‌ కోసం..

    సౌందర్య మనవడు ప్రేమ్ తాను తీసిన ఫోటోలను ఎగ్జిబిషన్‌గా పెట్టాలని అనుకొన్నాడు. అయితే దాంపత్య జీవిత పరంగా విడిపోయిన తల్లిదండ్రులను ఆహ్వానించాలని ప్రేమ్, డాక్టర్ నిరుపమ్ నిర్ణయించుకొన్నారు. ప్రేమ్ తాను నిర్వహించే ఎగ్జిబిషన్‌కు రమ్మని ఆహ్వానిస్తే.. తల్లి స్వప్న భయంతో తండ్రి రానని చెప్పాడు. ఇక తల్లిని డాక్టర్ నిరుపమ్ ఆహ్వానిస్తే.. నీ తండ్రి వస్తే.. నేను రానని స్వప్న తెగేసి చెప్పింది. అయితే ఎలాగోలా కన్విన్స్ చేసి తల్లి స్వప్నను డాక్టర్ నిరుపమ్ ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తన సోదరుడు ప్రేమ్‌కు ఫోన్ చేస్తే.. మమ్మి కారణంగా డాడీ రానని చెప్పాడు అంటే.. ఎలా మమ్మీ డాడీని కలుపాలని అనుకొంటే ఇలా జరుగుతుందేమిటంటూ నిరుపమ్ ఆవేదన చెందాడు.

    తల్లికి షాక్ ఇచ్చిన ప్రేమ్

    తల్లికి షాక్ ఇచ్చిన ప్రేమ్


    ప్రేమ్ నిర్వహించే ఎగ్జిబిషన్ వద్దకు డాక్టర్ నిరుపమ్, తల్లి స్వప్న చేరుకొన్నారు. తన తల్లికి, సోదరుడికి స్వాగతం పలికి.. థ్యాంక్యూ అంటూ అన్నాడు. తల్లిని అదోరకంగా చూస్తూ.. రావాల్సిన వాళ్లు రాలేదేంటి? హిమ వస్తే నా మనసులో మాటను చెప్పుకోవాలి అని అని మనసులో అనుకన్నాడు. ఆ తర్వాత నాన్న కూడా వస్తే బాగుండు అని ప్రేమ్ అంటే.. నాలుగు ఫోటోలు తీస్తే గొప్పా? నిరుపమ్ మాదిరిగా డాక్టర్ చదివితే బాగుండు అని అని స్వప్న అంది. దాంతో ఇలా నీవు మాట్లాడితే అందులో కొత్తేమీ ఉంది. డాడీ మంచి వాడు కాబట్టి.. నాకు ఇష్టమైన రంగంలో రాణించడానికి ప్రోత్సాహించాడు అని ప్రేమ్ అన్నాడు. ఆ తర్వాత వారిని లోపలికి తీసుకెళ్లాడు.

    అమ్మా.. వాతావరణాన్ని పాడు చేయకు..

    అమ్మా.. వాతావరణాన్ని పాడు చేయకు..

    ఇక ప్రేమ్ నిర్వహించే ఎగ్జిబిషన్‌కు హిమ వచ్చింది. దాంతో సంతోషంలో మునిగిపోయాడు. అయితే హిమను చూసిన స్వప్న.. కోపంతో ఊగిపోతూ.. ఏంటి దానిని ఎందుకు పిలిచావు రా అని ప్రేమ్‌పై సీరియస్ అయింది. అయితే నీ కోపతాపాలు నా వద్ద చూపించి.. ఈ వాతావరణాన్ని పాడు చేయకు అంటూ అరిచాడు. అంతలోనే తాను తెచ్చిన బొకేను ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అయితే ప్రేమ్ చేతిలో ఉన్న హిమ చేతిని లాగేసి.. ప్రేమ్‌ను ఎవరో పిలుస్తున్నారని పక్కకు పంపించింది. హిమపై కోపగించుకొంటూ.. పిలువని పేరంటానికి వచ్చావా? ఫోటో ఎగ్జిబిషన్‌కు వచ్చినట్టు లేదు.. ఫోటోషూట్‌కు వచ్చినట్టు ఉంది.. మీ నాన్నమ్మ బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉందే అంటూ సెటైర్లు వేసింది.

    నాకు నటించడం రాదు అంటూ..

    నాకు నటించడం రాదు అంటూ..


    అంతలోనే.. డాక్టర్ నిరుపమ్ వచ్చి.. హాయ్ హిమ అంటూ పలకరించాడు. దాంతో వచ్చిందిలే పిలువని పేరంటానికి అని స్వప్న అంటే.. ఇక్కడ కూడా గొడవలు ఏమిటి? సైలెంట్‌గా ఉండు అంటే.. నాకు నటించడం రాదు.. ఒక చోటు ఒకలా.. మరో చోటులో మరోలా ఉండటం నాకు రాదు అంటూ స్వప్న ఫైర్అయింది. హిమను చూస్తూ నేను తీసిన ఫోటోలో నీ నవ్వే గొప్పగా ఉంది అంటూ ప్రేమ్ అన్నాడు. హిమను చూస్తూ.. నేను ప్రేమలో పడ్డాను అంటే ఆమె కంగారు పడిపోయింది. దాంతో అదే నేను ప్రకృతితో ప్రేమలో పడ్డాను అంటూ కవరింగ్ ఇచ్చాడు. దాంతో డాక్టర్ నిరుపమ్ నవ్వుల్లో మునిగిపోయారు. అయితే జ్వాలా అలియాస్ శౌర్య.. ప్రేమ్, నిరుపమ్ తండ్రిని అబ్దద్దాలు ఆడి ఎగ్జిబిషన్‌కు తీసుకొచ్చింది.

    ఫోటోలు కాదు.. ఎక్స్‌రేలు అంటూ సెటైర్

    ఫోటోలు కాదు.. ఎక్స్‌రేలు అంటూ సెటైర్

    అయితే తనను జ్వాలా ఫోటో ఎగ్జిబిషన్‌కు తీసుకు రావడంతో డాక్టర్ నిరుపమ్ తండ్రి షాక్ తిన్నాడు. తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాడు.. దాంతో మీ అబ్బాయి సంతోషం కోసం తెచ్చాను అంటే.. ఇక్కడ అందరి ఆనందాన్ని పాడు చేసే వాళ్లు ఉన్నారు ఇక్కడ అంటూ నిరుపమ్ తండ్రి అన్నాడు. అయితే జీవితంలో ఆనందం కంటే గొప్పగా ఏమి ఉండదు. మీరు ఏమీ ఆలోచించకుండా రండి అంటూ ప్రేమ్ తండ్రిని లోనికి తీసుకెళ్లింది. అయితే ఎగ్జిబిషన్‌కు వచ్చిన తన భర్తను చూసి స్వప్న కోపంతో ఊగిపోయింది. మీరు ఎవరిని పట్టించుకోకండి.. ప్రేమ్ కోసం వచ్చాం అంటూ శౌర్య కవరింగ్ ఇచ్చింది. తండ్రిని చూడగానే.. థ్యాంక్స్ డాడీ.. అంటే.. నన్ను బలవంతంగా తీసుకొని జ్వాలా తీసుకొచ్చింది అంటే.. నువ్వు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావా అంటూ ప్రేమ్ అన్నాడు. అయితే డాక్టర్ సాబ్ మీరు కూడా ఫోటోలు తీస్తారా అంటే.. తీస్తాను.. కానీ వాటిని ఎక్స్‌రేలు అంటారు అని డాక్టర్ నిరుపమ్ అంటే.. డాక్టర్ సాబ్ మీరు జోకులు కూడా వేస్తారా అంటూ నిరుపమ్‌పై జ్వాలా సెటైర్ విసిరింది.

    శౌర్యకు చెంపదెబ్బ.. అడ్డుకొన్న డాక్టర్ నిరుపమ్

    శౌర్యకు చెంపదెబ్బ.. అడ్డుకొన్న డాక్టర్ నిరుపమ్

    ఇదిలా ఉండగా.. తాజా ప్రోమోలో మరోసారి ఇంటెన్స్‌తో కూడిన సన్నివేశాలు కనిపించాయి. తన కొడుకులతో హిమ, జ్వాలా క్లోజ్‌గా ఉండటాన్ని చూసి స్వప్న సహించలేకపోయింది. తన కొడుకులకు దూరంగా ఉండేలా జ్వాలాకు బుద్ది చెబుతాను అంటూ ఆవేశపడింది. ఓ దశలో జ్వాలాను చెప్పదెబ్బ కొట్టడానికి ప్రయత్నించింది. జ్వాలాపై చేయి చేసుకోబోతున్న తల్లి చేతిని డాక్టర్ నిరుపమ్ అడ్డుకొన్నాడు. ఇలా కార్తీకదీపం సీరియల్‌లో భావోద్వేగాలు కనిపించాయి.

    Recommended Video

    KGF Chapter 2 Inayath Khaleel ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రే| Filmibeat Telugu
    14వ వారంలో కూడా టాప్ రేటింగ్

    14వ వారంలో కూడా టాప్ రేటింగ్

    ఇక కార్తీకదీపం సీరియల్ ఈ ఏడాది 14వ వారంలో కూడా టాప్ టీఆర్పీని సాధించింది. గత నాలుగేళ్లుగా టాప్ పొజిషన్‌లో కొనసాగుతూ.. తన స్థానాన్ని నిలబెట్టుకొన్నది. 14వ వారంలో ఈ సీరియల్ 12.52 రేటింగ్‌తో ముందుకెళ్తున్నది. మిగితా స్థానాల్లో ఇంటిటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, జానకి కలగనలేదు సీరియల్స్ కొనసాగుతున్నాయి.

    English summary
    Karthika Deepam April 15th Episode number 1327.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X