twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: తారక్, చరణ్ ఫ్యాన్స్‌కు కోలుకోలేని షాక్.. తెలుగు రాష్ట్రాల్లో ఆ షోలన్నీ రద్దు!

    |

    ఇటు ఇండియాలో కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ.. అటు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ కొద్ది రోజులుగా మారుమ్రోగిపోతోన్న పేరు RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలితో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

    ఈ నేపథ్యంలో ఓవర్సీస్‌లో నెల రోజుల ముందు నుంచే ఈ సినిమా ప్రీ సేల్ మొదలైంది. అలాగే, ఇండియాలోనూ కొన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా RRR మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

    పోరాట యోధులుగా మారిన స్టార్లు

    పోరాట యోధులుగా మారిన స్టార్లు

    తెలుగు పోరాట యోధులుగా పేరొందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను చేశారు.

    Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిBigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

    రికార్డులు బ్రేక్... భారీ అంచనాలు

    రికార్డులు బ్రేక్... భారీ అంచనాలు

    ఆరంభం నుంచే RRR మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా స్పందన దక్కింది. అలాగే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలకు కూడా రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోయాయి.

    అత్యధిక బిజినెస్... గ్రాండ్‌ రిలీజ్

    అత్యధిక బిజినెస్... గ్రాండ్‌ రిలీజ్

    తెలుగులోనే కాదు.. ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీకి అత్యధిక స్థాయిలో బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా హక్కులకు భారీ ధరలు వచ్చాయి. దీంతో టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలోనే రికార్డు నమోదైంది. ఇక, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీ సహా మొత్తం 12 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

    శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!

    అక్కడ ప్రీమియర్స్.. అన్నీ పూర్తి

    అక్కడ ప్రీమియర్స్.. అన్నీ పూర్తి

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే అమెరికా సహా ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీమియర్స్‌కు సంబంధించిన బుకింగ్ ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, కొన్ని గంటల్లోనే అవన్నీ అమ్ముడైపోయాయి. దీంతో విడుదలకు ముందే ఇది సత్తా చాటింది.

    స్పెషల్ షోలకు పర్మీషన్స్ కూడా

    స్పెషల్ షోలకు పర్మీషన్స్ కూడా

    ఓవర్సీస్‌లోనే కాదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సైతం RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ఐదు షోలకు అనుమతి లభించింది. అంతేకాదు, హైదరాబాద్‌ నగరంలోని ఆరు థియేటర్లలో 25వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచే షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రాలో కూడా ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    డోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చడోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చ

    పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తూ

    పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తూ

    ఓవర్సీస్‌లో విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు వేస్తుంటారన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా 24వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్‌ను వేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లతో కూడా చర్చలు జరిపింది. దీంతో సినిమాను ఒకరోజు ముందే చూడొచ్చని ప్రేక్షకులు సంతోషపడుతున్నారు.

    అవన్నీ క్యాన్సిల్ చేసిన యూనిట్

    అవన్నీ క్యాన్సిల్ చేసిన యూనిట్

    తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ యూనిట్ వెనక్కి తగ్గిందట. ఇందులో భాగంగానే 24వ తేదీన ఎలాంటి షోలూ ప్రదర్శితం కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పారట. అయితే, దీని వెనుక కారణం మాత్రం తెలియలేదు.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Telugu States Paid Premiers cancelled
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X