twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 10 Days Collections: ఎఫ్3కి కలిసొచ్చిన సండే.. ఒక్కసారిగా కలెక్షన్లు డబుల్.. ఇంకెంత రావాలంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల సందడి క్రమంగా పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ఇలా వచ్చిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులను అలరించి సూపర్ డూపర్ హిట్లుగా నిలవడమే. అందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. ఇది ఘన విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్‌గా F3 అనే మూవీని రూపొందించారు. హిట్ కాంబినేషన్‌ కావడంతో ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే భారీ అంచనాలతో గత వారమే ఈ సినిమా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ చిత్రం 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    స్టార్ హీరోల కాంబోలో వచ్చేసింది

    స్టార్ హీరోల కాంబోలో వచ్చేసింది

    టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన మల్టీస్టారర్ మూవీనే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

    మోక్షజ్ఞ ఎంట్రీపై అనిల్ రావిపూడి క్లారిటీ: ఇప్పుడదే పనిలో.. బాలయ్య ప్లాన్‌ అంటూ మేటర్ లీక్మోక్షజ్ఞ ఎంట్రీపై అనిల్ రావిపూడి క్లారిటీ: ఇప్పుడదే పనిలో.. బాలయ్య ప్లాన్‌ అంటూ మేటర్ లీక్

    ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

    ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

    వెంకటేష్, వరుణ్ తేజ్‌కు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీనికితోడు F2 వంటి భారీ హిట్ మూవీ తర్వాత ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఎఫ్3' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని దీనికి రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

    10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

    10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

    'ఎఫ్ 3'కు 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు డబుల్ అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 42 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్‌లో రూ. 15 లక్షలు, వెస్ట్‌లో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.35 కోట్లు షేర్, రూ. 2.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రెగ్నెంట్ అయినా తగ్గని హీరోయిన్: హాట్ సెల్ఫీలో ఎద అందాల ఆరబోతప్రెగ్నెంట్ అయినా తగ్గని హీరోయిన్: హాట్ సెల్ఫీలో ఎద అందాల ఆరబోత

    10 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    10 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    'ఎఫ్ 3'కి 10 రోజులకు కలిపి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 17.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.64 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.21 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.34 కోట్లు, గుంటూరులో రూ. 3.10 కోట్లు, కృష్ణాలో రూ. 2.71 కోట్లు, నెల్లూరులో రూ. 1.69 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 41.81 కోట్లు షేర్, రూ. 67.30 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

    మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

    ఆంధ్రా, తెలంగాణలో రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగానే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 10 రోజులకు రూ. 41.81 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.95 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే ఈ మూవీ రూ. 51.61 కోట్లు షేర్, రూ. 86.51 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    బ్రాతో రెచ్చిపోయిన సమంత: అదొక్కటి అడ్డు లేకుంటే ఇక అంతే!బ్రాతో రెచ్చిపోయిన సమంత: అదొక్కటి అడ్డు లేకుంటే ఇక అంతే!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

    బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 51.61 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 12.89 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

    English summary
    Daggubati Venkatesh, Varun Tej Did F3 Movie under Anil Ravipudi Direction. This Movie Collect Rs 49.01 Crore in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X