Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

2012లో బాక్సాఫీస్ బద్దలుకొట్టిన సినిమాలు!(ఫోటో ఫీచర్)

Posted by:
Published: Tuesday, December 18, 2012, 10:30 [IST]

హైదరాబాద్ : సౌతిండియాలో పెద్ద సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ. 2012లో తెలుగులో దాదాపు 150 సినిమాల వరకు విడుదలయ్యాయి. అందులో 47 అనువాద చిత్రాలు కాగా, ఇతర చిత్రాలు 10 వరకు ఉన్నాయి. టాలీవుడ్ నుంచి నేరుగా దాదాపు 117 చిత్రాలు విడుదలయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే... 2012 సంవత్సరం టాలీవుడ్ కి బాగా కలిసొచ్చింది. ఎక్కువ సినిమాలు విజయవంతం అయి కలెక్షన్ల వర్షం కురిపించాయి.

ఈ సంవత్సరం బాగా హైప్ సాధించిన సినిమాల్లో... గబ్బర్ సింగ్ మొదటి స్థానం సంపాదించగా, రచ్చ, జులాయి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, డమరుకం, కృష్ణ వందే జగద్గురుమ్, దేనికైనా రెడీ చిత్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచి మంచి ఓపెనింగ్స్ సాధించాయి. కొన్ని తెలుగు చిత్రాలైతే ఓవర్సీస్ మార్కెట్లో కొన్ని బాలీవుడ్ పెద్ద సినిమా కంటే మంచి వసూళ్లు సాధించాయి.

అదే విధంగా కొన్ని చిత్రాల విషయంలో అంచనాలు తలక్కిందులయ్యాయి. దమ్ము, దరువు, అధినాయకుడు, ఎందుకంటే ప్రేమంట, ఊ కొడతారా ఉలిక్క పడతారా, దేవుడు చేసిన మనుషులు, శ్రీమన్నారాయణ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, షిరిడి సాయి, రెబల్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. బాక్సాఫీసు వద్ద అనుకున్న వసూళ్లు సాధించలేక పోయాయి.

టాలీవుడ్ ఈ సంవత్సరం టాప్-10లో నిలిచిన చిత్రాల విశేషాలను స్లైడ్ షోలో వీక్షిద్దాం...

పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం మే 11న విడుదలైంది. దాదాపు రూ. 28 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై... ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడమే కాదు. పలు రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం ఓపెనింగ్స్ తెలుగు సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ గా నిలిచాయి. అదే విధంగా 306 సెంటర్లలో 50 రోజుల వేడుక జరుపుకుంది. ఈ చిత్రం వంద కోట్ల మార్కుదాటి బిజినెస్ చేసిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గ్రాఫికల్ వండర్ ‘ఈగ' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓవర్సీస్ మార్కెట్లో ఈచిత్రం వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అదే విధంగా ఫాస్టెస్ట్ గ్రాసింగ్ టాప్ 50లో చోటు దక్కించుకుంది.

మహేస్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మేన్ చిత్రం కూడా భారీ ఓపెనింగ్స్ సాధించి ఈ సంవత్సరం హిట్టైన టాప్ 10 చిత్రాల్లో చోటు దక్కించుకుంది. ఈ చిత్రం దాదాపుగా రూ. 72 కోట్లు వసూలు చేసినట్లు టాక్.

రామ్ చరణ్, తమన్నా కాంబినేషన్లో వచ్చిన ‘రచ్చ' చిత్రం దాదాపు 28 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమై... ఏపీలో దాదాపు 48 కోట్ల వరకు వసూలు చేసింది. అదే విధంగా తమిళం, మళయాలం వెర్షన్లలో మరో 7 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఓవరాల్గా 140 సెంటర్లలో 50రోజుల వేడుక జరుపుకోగా అందులో ఏపీలో 127 స్కీన్లు ఉన్నాయి. 38 సెంటర్లలో 100 రోజులు పండగ జరుపుకుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లే సాధించింది. ఈ చిత్రదం దాదాపుగా 60 కోట్లు వసూలు చేసిందని అంచనా.

హీరో అల్లు అర్జున్ ఈ సంవత్సరం ‘జులాయి' చిత్రంతో హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ-ఇలియానా జంటగా నటించిన ఈచిత్రం 5 వారాల్లో దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో 0.90 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, కేరళ, కర్నాటకల్లో 5 కోట్ల వరకు రాబట్టింది. టోటల్ గా ఈచిత్రం రూ. 55 కోట్లు వసూలు చేసిందని టాక్.

భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన సుడిగాడు చిత్రం అల్లరి నరేష్ కెరీర్లోనే బిగ్గెస్ హిట్ చిత్రంగా నిలిచింది. అల్లరి నరేష్ సరసన మోనాల్ గజ్జర్ నటించింది. ఈచిత్రం వరల్డ్ వైడ్ గా 50 కోట్లపైనే వసూలు చేసిందని టాక్.

చాలా కాలం తర్వాత హీరో మంచు విష్ణు ‘దేనికైనా రెడీ' చిత్రం ద్వారా హిట్ కొట్టారు. మంచు విష్ణు, హన్సిక జంటగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈచిత్రం రూ. 50 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా.

నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రం డమరుకం. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈచిత్రం ఇప్పటికీ ఇంకా ప్రదర్శితం అవుతూనే ఉంది. సినిమా బిజినెస్ పూర్తయితేగానీ దీని సంగతేంటో చెప్పలేం.

రాణా దగ్గుబాటి, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్'. నయనతార హీరోయిన్ గా నటించిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్సే సాధించింది. ఈ చిత్రం కూడా ఇంకా ప్రదర్శితం అవుతోంది. సినిమా బిజినెస్ పూర్తయితేగానీ పూర్తి వివరాలు బయటకు వస్తాయి.

English summary
In 2012, Telugu film industry, which is the biggest industry in South India, has already released 150 movies, including 47 dubbed films. Another 10 movies, including three dubbed films are slated to hit the screens in this year. Barring dubbed versions, Tollywood has produced a total of 117 movies. When compared to previous year, 2012 seems to be very lucky year as many films have become big hits at the Box Office.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice