twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Review హ్యాపీ కనిపించని బర్త్ డే.. ఆ ముగ్గురితోనే ఎంతో కొంత ఫన్!

    |

    Rating:
    2.0/5

    మత్తు వదలరా మూవీలో విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న దర్శకుడు రితేష్ రానా చేసిన మరో ప్రయత్నమే హ్యాపీ బర్త్ డే. ఇటీవల కాలంలో సక్సెస్‌కు ఆమడ దూరంలో ఉన్న లావణ్య త్రిపాఠిని ప్రధాన పాత్రధారిగా, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య, రాహుల్ రామకృష్ణ తదితర నటీనటులను సపోర్టింగ్‌గా తీసుకొని న్యూ ఏజ్ కామెడీ పేరుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ అండగా నిలవడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఈ సినిమా రితేష్ రానాకు మరో విజయాన్ని అందించిందా? లావణ్య త్రిపాఠిని సక్సెస్ దారి పట్టించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. హ్యాపీ బర్త్ డే సినిమాను సమీక్షించుకొందాం..

    Recommended Video

    హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
    హ్యాపీ బర్త్ డే మూవీ కథ

    హ్యాపీ బర్త్ డే మూవీ కథ


    కేంద్ర మంత్రి రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) పార్లమెంట్‌లో గన్ బిల్లు ప్రవేశపెడుతాడు. ఆత్మ రక్షణకు ప్రతీ ఇంటిలో ఓ తుపాకి ఉండాలనే విధానాన్ని దేశంలో అమలు పరుస్తాడు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి సోదికి సంబంధించిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన పెన్ డ్రైవ్‌ పసుపులేటి హ్యాపీ త్రిపాఠి (లావణ్య త్రిపాఠి) హ్యాండ్ బ్యాగ్‌లోకి చేరుతుంది.

    హ్యాపీ బర్త్ డే మూవీలో ట్విస్టులు

    హ్యాపీ బర్త్ డే మూవీలో ట్విస్టులు


    కేంద్ర మంత్రి అవినీతి భాగోతానికి సంబంధించిన సిగరెట్ లైటర్ రూపంలోని పెన్ డ్రైవ్ హ్యాపీ త్రిపాఠి బ్యాగులో ఎలా చేరింది? పెన్ డ్రైవ్ కోసం గుండా (రాహుల్ రామకృష్ణ) ఎందుకు ప్రయత్నించాడు? నగరంలోని ప్రముఖ హోటల్‌లోని హౌస్ కీపింగ్ బాయ్ లక్కీ (నరేష్ అగస్త్య)కు గుండాకు సంబంధం ఏమిటి? గుండా బెదిరింపులకు భయపడి లక్కీ పెన్ డ్రైవ్ కోసం ఎందుకు ప్రయత్నించాడు? ఈ కథలో మ్యాక్స్ పెయిన్ (కమెడియన్ సత్య) రోల్ ఏమిటి? సెరెనీ విలియమ్ (రాకెట్ రాఘవ) పాత్ర ఈ కథకు ఎలా ముడిపడి ఉంది అనే ప్రశ్నలకు సమాధానమే హ్యాపీ బర్త్ డే సినిమా కథ.

    ఫస్టాప్ గురించి

    ఫస్టాప్ గురించి

    పార్లమెంట్‌లో గన్ బిల్లును కేంద్ర మంత్రి సోది ప్రవేశపెట్టే సీన్‌తో హ్యాపీ బర్త్ డే సినిమా మంచి ఫన్‌తో మొదలవుతుంది. అయితే అదే జోష్‌తో కొనసాగిన ఈ కథ కాసేపటి తర్వాత అనేక పాత్రలు, అతుకుల బొంత లాంటి స్క్రీన్ ప్లేతో గందరగోళంగా మారుతుంది. కథను అనేక అధ్యాయాలుగా కోత పెట్టి.. మంచి ఫన్, హ్యుమర్ ఉన్న కథను అతిగా దర్శకుడు కంగాలీగా మార్చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో రకరకాల పాత్రల పరిచయంతోనే కాలం గడిచేలా చేశాడనిపిస్తుంది.

    సెకండాఫ్‌ ఎలా ఉందంటే..

    సెకండాఫ్‌ ఎలా ఉందంటే..

    ఇక సెకండాఫ్‌లోనైనా కథను నేరుగా ప్రేక్షకుడికి అర్ధం అయ్యేలా చెబుతాడని ఆశించిన ప్రేక్షకులకు అదే అతి కనిపిస్తుంది. ఫ్రంట్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో తన మేధావితనాన్ని ప్రదర్శించుకొనే ప్రయత్నాన్ని దర్శకుడు చేయడంతో అసలుకే ఎసరు పెట్టినట్టనిపిస్తుంది. సత్య కామెడీ ట్రాక్, యూట్యబర్ ఎపిసోడ్, రాకెట్ రాఘవ సన్నివేశాలు హ్యుమర్‌ను అందించాయని చెప్పవచ్చు. అయితే లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఓ ట్విస్టు సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. కానీ సినిమాకు అదే కోణంలోను వర్కవుట్ అయినట్టు కనిపించలేదు. వెరసి హ్యాపీ బర్త్ డే అతికి పరాకాష్టగా ముగుస్తుంది.

    దర్శకుడు రితేష్ రానా గురించి

    దర్శకుడు రితేష్ రానా గురించి

    దర్శకుడు రితేష్ రానా రాసుకొన్న పాయింట్ గురించి ఆలోచిస్తే చాలా బాగుందనిపిస్తుంది. కానీ సాంప్రదాయ సినిమా మేకింగ్‌కు భిన్నమైన పోకడను అనుసరించడమే హ్యాపీ బర్త్ డే మూవీకి శాపంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఒక్కో ఎపిసోడ్ పరంగా చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా కథగా ఆలోచిస్తే.. ఎక్కడ ప్రేక్షకుడికి కనెక్టివిటీ ఉండదు. అసలు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు దారుణంగా ఫెయిలయ్యాడని చెప్పవచ్చు. గన్ కల్చర్ వల్ల దారుణాలు ఏమిటనే పాయింట్‌ను బాగా చెప్పడానికి ఉన్న అవకాశాన్ని చేజేతులా వదిలేసుకొన్నాడనే చెప్పవచ్చు.

    నటీనటుల ఫెర్ఫార్మెన్స్ గురించి

    నటీనటుల ఫెర్ఫార్మెన్స్ గురించి


    లావణ్య త్రిపాఠిని ప్రధాన పాత్రధారిగా ఎక్స్‌పోజ్ చేసినప్పటికీ.. సినిమాలో ఆమె పాత్ర ఆటలో అరటిపండుగానే కనిపిస్తుంది. ఆమె పాత్ర ప్రభావం ఏమాత్రం సినిమాపై కనిపించదు. గుంపులో గోవిందయ్య మాదిరిగానే ఉంటుంది.బలమైన పాత్ర డిజైన్ చేయకపోవడం వల్ల అటు గ్లామరపరంగా, ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. ఇక సత్య తనదైన కామెడీతో సినిమాకు బలంగా కనిపించాడు. సత్య కామెడీ లేకపోతే సినిమా పరిస్థితి మరింత దారుణంగా మారేదేమో అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాను సాధ్యమైనంత వరకు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తనదైన యాటిట్యూబ్, బాడీ లాంగ్వేజ్‌తో వెన్నెల కిషోర్ మెప్పించాడు. లక్కీగా నరేష్ అగస్త్య తన పాత్ర పరిధి మేరకు సినిమాకు పాజిటివ్‌గా మారాడు. మిగితా పాత్రలు తమ పరిధి మేరకు న్యాయం చేశారని చెప్పవచ్చు. గుండు సుదర్శన్ తన కెరీర్‌లోనే బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రిట్జ్ హోటల్ వాతావరణాన్ని ప్రజెంట్ జనరేషన్‌కు తగినట్టుగా మలచడంలో ఆర్ట్ విభాగం పనితీరు బాగుండటమే కాకుండా సినిమా చాలా రిచ్‌గా కనిపించేలా చేశారు. ఇక కాల భైరవ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. సన్నివేశాల్లో వైవిధ్యం లేకపోవడం వల్ల రొటీన్‌గానే మ్యూజిక్ అనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి విభాగాల పనితీరు బాగుంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫి, లైటింగ్ చక్కగా ఉంది. డైరెక్టర్ విజన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నందున్న ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ పనితనాన్ని తక్కువగా అంచనా వేయడం సరికాదనిపిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. కథ, కథనాలు తప్ప ఉన్నత ప్రమాణాలతో సినిమాను రూపొందించారనిపిస్తుంది.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఓ హోటల్‌లోని పబ్ కేంద్రంగా జరిగే చేజింగ్ డ్రామాగా హ్యాపీ బర్త్ డే తెరకెక్కింది. అవసరమైన విషయం కంటే అనవసరమైన కంటెంట్‌పై ఫోకస్ పెట్టడం వల్ల మంచి హ్యూమర్‌కు స్కోప్ ఉన్న కథ పక్కదారి పట్టిందనిపిస్తుంది. వెన్నెల కిషోర్, సత్య, గుండు సుదర్శన్ లేకపోతే సినిమా చూడటం కూడా కష్టంగా మారేది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను పక్కన పెడితే.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ తరహా సినిమా నచ్చడం కష్టమే. ఈ సినిమాకు ముందు ఏర్పడి క్రేజ్‌, అంచనాలకు దిగువన హ్యాపీ బర్త్ డే ఉంది. కాబట్టి రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. సాంప్రదాయ సినీ మేకింగ్‌‌కు భిన్నంగా ఉండే మూవీస్‌ను ఆదరించే వారికి, సెటైరికల్ కామెడీని ఇష్టపడే వారికి హ్యాపీ బర్త్ డే నచ్చడానికి అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    వెన్నెల కిషోర్, సత్య, గుండు సుదర్శనం కామెడీ
    ప్రొడక్షన్ వ్యాల్యూస్
    కొన్ని కామెడీ ట్రాక్స్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    డైరెక్షన్
    లావణ్య త్రిపాఠి క్యారెక్టరైజేషన్
    స్టోరిని గ్రిప్పింగ్‌గా చెప్పలేకపోవడం

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య, గుండు సుదర్శన్, నరేష్ ఆగస్త్య, రాహుల్ రామకృష్ణ, రాకెట్ రాఘవ తదితరులు
    రచన, దర్శకత్వం: రితేష్ రానా
    నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
    సమర్పణ: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
    మ్యూజిక్: కాల భైరవ
    సినిమాటోగ్రఫి: సురేష్ సారంగం
    ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
    ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
    ఫైట్స్: శంకర్ ఉయ్యాల
    కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్
    లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు
    ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి
    చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ
    ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల
    బ్యానర్స్: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌
    రిలీజ్: 2022-07-08

    English summary
    Lavanya Tripathi's Happy Birthday movie hits the theatres on July 8th. Here is the exlusive review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X