twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pakka Commercial Day 11 Collections: మరోసారి తగ్గిన కలెక్షన్స్.. ప్రాఫిట్స్ లోకి రావడం కష్టమే?

    |

    గోపీచంద్ మారుతి కలయికలో తెరకెక్కిన 'పక్క కమర్షియల్' సినిమా ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ GA2 సంస్థ సంయుక్తంగా నిర్మించింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక్కసారిగా డిజాస్టర్ కలెక్షన్లు అందుకుంది. ఇక సినిమా 11వ రోజు ఏ స్థాయిలో కలెక్ట్ చేసింది? సక్సెస్ కావాలి అంటే ఇంకా ఎంత రావాలి అనేది వివరాల్లోకి వెళితే..

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    మ్యాచో స్టార్ గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ఓవరాల్‌గా రూ. 15.20 కోట్ల బిజినెస్‌ చేసింది.

    11వ రోజు వచ్చిన కలెక్షన్లు

    11వ రోజు వచ్చిన కలెక్షన్లు

    గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఈ సినిమా నెగిటివ్ టాక్ తో మొదటి వారంలోనే చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక మొదటి వారం తర్వాత కలెక్షన్స్ ఏమాత్రం పెరగలేదు. ఇక 11వ రోజు కేవలం నాలుగు లక్షల షేర్ మాత్రమే అందుకుంది.

    11 రోజుల్లో వచ్చిన షేర్

    11 రోజుల్లో వచ్చిన షేర్

    'పక్కా కమర్షియల్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా జన్నాయి. నైజాంలో రూ. 2.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.11 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 56 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో.. రూ. 7.05 కోట్లు షేర్, రూ. 11.68 కోట్లు గ్రాస్ దక్కింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 7.05 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 86 లక్షలు వసూలు చేసింది. ఇక 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పక్కా కమర్షియల్ సినిమాకు రూ. 8.23 కోట్ల షేర్‌తో పాటు రూ. 14.10 కోట్లు గ్రాస్‌ వసూలు వచ్చాయి.

    సక్సెస్ కావాలంటే..

    సక్సెస్ కావాలంటే..

    'పక్కా కమర్షియల్' సినిమాకు మొదట పెరిగిన పాజిటివ్ వైబ్రేషన్స్ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. అయితే 11 రోజుల్లో దీనికి రూ. 8.23 కోట్లు రాబట్టిన పక్కా కమర్షియల్ సినిమా.. సక్సెస్ కావాలి అంటే మరో 7.77 కోట్లు వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క.

    English summary
    Gopichand Pakka Commercial movie world wide Day 11 Collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X