twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu:వసుధార నుంచి రిషిధార అయ్యాను.. నీ ఆశయం మర్చిపోయావా?

    |

    రోజురోజుకి ఆసక్తికరంగా సాగిపోతుంది గుప్పెడంత మనసు సీరియల్. ఇక్కడ రెండు గుండెలు ఉన్నా ఆ రెండు గుండెల చప్పుడు మాత్రం ఒక్కటే. అదే ప్రేమ అని రిషితో చెబుతుంది వసుధార. ఈ డైలాగ్​లు చెప్పెటప్పుడు ప్లే అయ్యే బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ బాగా యాప్ట్​ అయింది. నన్ను క్షమించడి. నా ప్రేమను అంగీకరించండి. ఐ లవ్యూ అని రిషికి గిఫ్ట్​ ఇవ్వబోతుంది వసుధార. ఈ మాటను తక్కువ పదాల్లో చెప్పడం నాకు నచ్చట్లేదు కానీ, చెప్పకుండా మాత్రం ఇంకా ఎక్కువ సేపు ఉండలేనేమో. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడూ చెప్పలేనేమో. ఈ మాట చెప్పాక నేను మళ్లీ కొత్తగా పుట్టాననిపిస్తోందని మళ్లీ వసుధార ఐ లవ్యూ అని చెప్పడంతో అయోమయంగా వెనక్కి తిరుగుతాడు రిషి. మరీ ఆ తర్వాత ఏమైంది? ఆగస్టు 26, 2022 శుక్రవారం ఎపిసోడ్​ 539లో జరిగింది ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

    అది మన హృదయం..

    అది మన హృదయం..

    వసుధార తనకు ఐ లవ్యూ అని ప్రపోజ్​ చేయగానే అయోమయ స్థితిలో వెనక్కి తిరిగి వసుధార నువ్వు.. నువ్వేనా అని ప్రశ్నిస్తాడు రిషి. అందుకు వసుధార.. కాదు సార్​. నేను.. నేను కాదు. నేను వసుధార నుంచి రిషిధారను అయ్యాను. మీరు నా నీడ. నేను మీ నిజం సార్​ అని గిఫ్ట్ ఇవ్వబోతుంది. అప్పుడు ఆ గిఫ్ట్​ను రిషి అందుకోబోతుండగా జారి కిందపడిపోతుండగా.. తన చేతులతో అందుకుంటాడు రిషి. ఒకప్పుడు అది మీ హృదయం ఇప్పుడు అది మన హృదయం. రెండు పేర్లు, రెండు మనసులు ఒక్కటయ్యాయి అంటూ ఎమోషనల్​గా చెబుతుంది. అందుకు నాకు ఇచ్చావ్​గా.. భద్రంగా కాపాడే బాధ్యత ఇకపై నాదే అని రిషి చెప్పడంతో వసుధార తెగ సంతోషిస్తుంది.

    అలా జరిగితే బాగుండు..

    అలా జరిగితే బాగుండు..

    వర్షం బాగా పెరిగిపోతుంది. పదా.. అని వసుధారను తీసుకెళ్తాడు రిషి. ఇక్కడ కట్​ చేస్తే.. మరోవైపు మహీంద్రా, జగతి ఇద్దరూ వసుధార, రిషి గురించే ఆలోచిస్తూ ఉంటారు. రిషితో తన మనసులో మాటను వసుధార చెప్పేలా ఉంది అని మహీంద్రా అంటాడు. అమ్మవారి వద్ద వసుధార మాటలు వింటే నాకు అలానే అనిపిస్తోంది. అలా జరిగితే బాగుండును కదా జగతి. లేదంటే పరీక్షలు అయిపోతే వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఇక ఉండదు కదా అని మహీంద్రా అంటాడు. ఈసారి తన మనసులో మాట రిషికి వసుధార చెప్పేస్తుంది. తనకు ఇదే చివరి అవకాశం. రిషికి ఫోన్​ చేశా. ఆన్సర్ చేయట్లేడు అని మహీంద్రా అంటాడు. కొంపదీసి రాగానే అడుగుతారా ఏంటీ? అని జగతి ప్రశ్నించగా.. అడిగితే తప్పేముంది, రాగానే అడుగుతా అని అంటాడు మహీంద్రా.

     పర్సనల్​ విషయాల్లో దూరడం కరెక్ట్​ కాదు..

    పర్సనల్​ విషయాల్లో దూరడం కరెక్ట్​ కాదు..

    అయినా వాళ్ల పర్సనల్ విషయాల్లోకి మనం దూరడం ఏంటీ? మహీంద్రా అని జగతి అన్నదానికి.. అవును అలా వ్యక్తిగత విషయాల్లోకి మనం దూరడం కరెక్ట్​ కాదు కానీ, అది వాళ్లమంచి కోసమే కదా అని మహీంద్రా బదులిస్తాడు. మనం ఇంత టెన్షన్ పడుతున్నాం. ఇది టెన్షన్ కాదు. రిషి మీద మనకున్న ప్రేమ అని జగతి అంటుంది. మరోవైపు రిషి, వసు ఇద్దరు చేతిలో చేయి వేసుకుని పక్కనే ఉన్న ఓ ప్లేస్​కు వెళ్తారు. వర్షం భారీగా పడుతుండటంతో అక్కడ తల దాచుకుంటారు. మీ పక్కనే ఇలాగే ఉండిపోవాలని ఉంది. మీతో కలిసి చేసే ఈ ప్రయాణం నాకు ఆనందాన్ని ఇస్తోంది. ఇక నా ప్రతి అడుగు మీతోనే అని వసుధార తన మనసులో అనుకుంటుంది.

    ఊహించాను.. కానీ..

    ఊహించాను.. కానీ..


    మన మధ్య జ్ఞాపకాలు తప్ప ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అనేది నా కోరిక అని రిషి అంటాడు. ఈ బహుమతి ఆరోజు నీకు ఇచ్చిన రోజు నిన్ను బెదిరించింది ఎవరు? అని రిషి అడుగుతాడు. దీంతో షాక్​ అయిన వసుధార తనను బెదిరించింది సాక్షి అని ఎలా చెప్పాలో వసుధారకు అర్థం కాదు. మన మధ్య దాపరికాలు ఉండకూడదు అని చెప్పాను కదా అని రిషి అంటాడు. దీంతో సాక్షి అని వసు చెబుతుంది. ఊహించాను కానీ, నువ్వు నేను మనం అయిన ఈ రోజుకి మాత్రం సాక్షి ఈ వర్షమే అంటాడు రిషి. ఈ వర్షానికి నాకు ఏదో తెలియని అనుబంధం ఉందేమో అని వసుధార అంటుంది. ఒక వర్షం నువ్వు దూరం కాలేదంది. ఇంకోసారి ఇదే వర్షం నువ్వు నన్ను కాదన్నావని చెబుతుంటే వినింది. ఈరోజు అదే వర్షం నిన్ను నన్ను మనం అంటోంది అని రిషి అంటాడు. మేఘాలు కరిగిపోతాయి. వర్షం ఆగిపోతుంది. కానీ మన ఈ ప్రయాణం ఆగిపోకూడదు అని రిషి అంటాడు.

    త్యాగం చేయాలి..

    త్యాగం చేయాలి..


    ఆ ఆకాశంలా మనం ఎప్పటికీ నిలిచిపోవాలి. ఒక్కటిగా ఉండాలి అని చెబుతూ రింగ్​ తీస్తాడు రిషి. ఎప్పటికీ ఆగిపోని ప్రేమధారలా రిషిధారల నిలిచిపోవాలి అని తన వేలికి ఉంగరాన్ని తొడగబోతాడు రిషి. కానీ మళ్లీ ఆగిపోతాడు. వీ అన్న అక్షరానికి ఆర్​ కలవాలంటే గీత గీసినంత సులభం మాత్రం కాదు వసుధార అని అంటాడు రిషి. మనం అలా నిలిచిపోవాలంటే, ఈ ఉంగరాన్ని నీ వేలిక తొడగాలంటే, ఒకరికి ఒకరంగా మిగలాలంటే ఒక పని చేయాలి అంటాడు రిషి. ఒక సామ్రాజ్యాన్ని జయించాలంటే యుద్ధాలు జరగాలి. ఒక ప్రేమ గెలవాలంటే మనం ఒక పని చేయాలి ముఖ్యంగా నువ్వు.. ఒక పని చేయాలని అన్న రిషితో ఏం చేయాలి సార్​ అంటుంది వసుధార. త్యాగం చేయాలని అంటాడు రిషి. దీంతో షాక్​ అవుతుంది వసుధార.

    నీ ఆశయం మర్చిపోయావా?

    నీ ఆశయం మర్చిపోయావా?

    రిషి కొనసాగిస్తూ నీ ప్రేమను త్యాగం చేయాలి అంటాడు. త్యాగమా? సర్​.. మీరేం మాట్లాడుతున్నారు? మీ ప్రేమను దక్కించుకోవడం కోసం నా ప్రేమను త్యాగం చేసి ప్రేమను పోగొట్టుకోవాలా? అంతకన్నా ప్రాణం అడగండి.. ఇచ్చేస్తాను వెంటనే అని అంటుంది వసుధార. ఆ మాటలకు నాకు మనసొక్కటి, మాటొక్కటి నచ్చుదు. నీ ప్రేమను పోగొట్టుకోవడం అనడం లేదు. నీ ఆశయం కోసం కొన్నాళ్లు ఈ ప్రేమకు దూరంగా ఉండమంటున్నా. నీ ఆశయం మర్చిపోయావా? యూనివర్సిటీ టాపర్​ అవడం నీ లక్ష్యం. నీ దృష్టి అంతా రాబోయే పరీక్షలపైనే ఉండాలి. ప్రేమ మీద కాదు అని అంటాడు రిషి. అందుకే నీ పరీక్షలు అయ్యేదాకా మనం కలవకూడదు, మాట్లాడుకోకూడదు అని రిషి చెబుతాడు. సార్​.. ఇది సాధ్యమా? కష్టం మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఎలా.. కుదరదు సార్​. నా వల్ల కాదు అంటుంది వసు. దీంతో కావాలి వసుధార. ఆశయం కోసం నువ్వు కుటుంబాన్ని వదిలేసి పెళ్లి పీటల మీద నుంచి వచ్చావ్. మన ప్రేమ నీ ఆశయాన్ని మార్చేసింది. అది మన ప్రేమకే అవమానం. ఆలోచించూ అంటాడు రిషి.

    మన ప్రేమకథ ఇప్పుడే మొదలు..

    మన ప్రేమకథ ఇప్పుడే మొదలు..


    సార్​.. ఆ రింగ్ నాది. నా జీవితం. ఆ ఆనందం నాకు కావాలి. యూనివర్సిటీ టాపర్​ అనే స్థానం కన్నా ఈ ఉంగరం మీతో తొడిగించుకోవడం చాలా గొప్ప అంటుంది వసుధార. నేను ఆ అదృష్టాన్ని పోగొట్టుకోలేను. తప్పకుండా మీరు అన్నట్టే చేస్తాను. కానీ, మీరు నాకు ఓ మాట ఇవ్వాలి. ఇది ఎప్పటికీ నాదే కదా అని అడుగుతుంది. దీంతో ఈ రిషేంద్ర భూషణ్ నీకు మాటిస్తున్నాడు. ఈ పంచభూతాలు, మన మనసుల సాక్ష్యం. ఎప్పటికీ ఇది నేకే. కానీ, నీ ఆశయం.. నీ చదువు. నువ్వు నాకు మాటివ్వు.. నేను చెప్పినట్టు నీ దృష్టి అంతా చదువు మీదే పెట్టు అని అన్న రిషితో ఉంగరం సాక్షిగా వసుధార మాటిస్తుంది. నా ఆశయం కోసం మీ మాట వింటాను. మీరు చెప్పినట్టే పరీక్షలు పూర్తయ్యే దాకా ప్రేమ కోసం ఆలోచించను. ప్రామిస్​ అని అంటుంది వసుధార. ఇంతలో ఆకాశంలో ఉరుములు రావడంతో రిషిని గట్టిగా కౌగిలించుకుంటుంది వసు. నింగి నేల, వాన, గాలి, నిప్పు అన్ని మనచుట్టే వసుధార. ఈ రాత్రి సాక్షిగా ఈ క్షణం నుంచి మన ప్రేమకథ మొదలు అని రిషి అంటాడు.

    ఇది మాములు కథ కాదు. ఒకరిని ఒకరం తెలుసుకునే సమయం. ఇది శాశ్వతం అంటాడు రిషి. దీంతో ఒక్కసారిగా గట్టిగా రిషిని కౌగిలించుకుంది వసుధార. అనంతరం ఒకరి చేతుల్లో ఒకరు చేతులు పెట్టుకుని సంతోషంగా కారులో వెళ్తుంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్​ ఎపిసోడ్​ వరకు ఆగాల్సిందే.

    English summary
    Guppedantha Manasu Episode 539:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X