Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దర్శకుడిగా నాపై కొన్ని విమర్శలు వచ్చాయి: మారుతి

Posted by:
Published: Monday, March 11, 2013, 8:15 [IST]
 

హైదరాబాద్ : ''ఈరోజుల్లో' వెనక కొన్నేళ్ల కృషి ఉంది. 'బస్‌స్టాప్‌'ని కూడా తపనతో తీశాను. ఆ సినిమా విజయం సాధించినా... దర్శకుడిగా నాపై కొన్ని విమర్శలు వచ్చాయి. వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాను. రెండవ సినిమా బస్టాప్‌కు కొన్ని విమర్శలు వచ్చాయి. కొంత మందైతే ఎదగాల్సిన దర్శకుడివి పంధా మార్చుకోమన్నారు. ఆ సినిమాకు అలా అవసరం అనుకుని చేశాను. కానీ ఈ సినిమా ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది. రెండున్నర గంటలపాటు కుటుంబ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే క్లీన్ చిత్రమిది. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా వుంటుంది. 'ప్రేమకథా చిత్రమ్‌' చూశాక మారుతి ఇలా కూడా రాస్తాడా? అని ఆశ్చర్యపోతారు. ఎవరూ వూహించని ప్రేమకథ ఇది. సుధీర్‌బాబు, నందిత ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. జె.బి., సంగీతం, ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వ శైలి కథకు ప్రాణం పోశా యి''అన్నారు దర్శకుడు మారుతి.


సుధీర్‌ బాబు, నందిత జంటగా నటించిన సినిమా 'ప్రేమకథా చిత్రమ్‌'. జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి నిర్మాత. దర్శకుడు మారుతి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌లో టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎ.రమేష్‌ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ''మంచి నటీనటులు కుదిరారు. ప్రతి సన్నివేశం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సుధీర్‌, నందిత తెరపై చేసే సందడి ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది''అన్నారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ ''ఇదివరకు నేను చేసిన 'ఎస్‌.ఎమ్‌.ఎస్‌' చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే సంభాషణలు చెప్పే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని కొందరు సూచించారు. మహేష్‌బాబు కూడా అదే చెప్పారు. నన్ను నేను మార్చుకొని ఈ సినిమాలో నటించాను. తప్పకుండా ఇదొక మంచి చిత్రమవుతుంది''అన్నారు. ''ఇందులో నటించడం ఓ చక్కటి అనుభవం'' అన్నారు నందిత.

ఎ.రమేష్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ''మా నాన్నగారు ఎల్వీప్రసాద్‌ ఎన్నో కష్టాల్ని అధిగమించి ఈ రంగంలో ఎదిగారు. సినిమాపై ఉన్న భక్తిభావమే ఆయన్ని ముందుకు నడిపించింది. అదే తరహా తపన ఈ చిత్రబృందంలో కనిపిస్తోంది. ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి''అన్నారు. ''ఏప్రిల్‌ 14న పాటల్ని, మే 10న సినిమాని విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో డార్లింగ్‌ స్వామి, జె.బి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'పచ్చని కాపురం'లోని 'వెన్నెలైనా చీకటైనా నీతోనే జీవితమూ' ఎంత సూపర్ హిట్టో తెలిసిందే. ఇప్పుడు ఆ పాటని రీమిక్స్‌ చేస్తున్నారు. 'ఒక ప్రేమకథా చిత్రమ్‌' కోసం ఈ పాట మరోసారి తెరకెక్కి అలరించనుంది. ప్రవీణ్, హాసిక, రణధీర్, అదుర్స్ రఘు, ఏలూరు శ్రీను తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: జె.బి., కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు, సహ నిర్మాతలు: ఆర్. ఆయుష్‌ రెడ్డి, ఆర్.పి. అక్షిత్‌రెడ్డి, ఛాయాగ్రహణం, దర్శకత్వం: జె. ప్రభాకరరెడ్డి.

English summary
The first look of Sudheer Babu, Nandita starrer Premakatha Chitram was launched in Hyderabad. Ramesh Prasad launched the first look of the film. Maruthi, Sudheer Babu, J Prabhakar Reddy, JB, Swamy, Sudharshan Reddy and Nandita attended the event. J Prabhakar Reddy is the cinematographer and director of the film whereas Maruthi has written the story and dialogues, apart from supervising the direction.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice