twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 శ్రీసత్య చేసిన పనికి రేవంత్ సీరియస్.. ముగ్గురికి 'బిగ్' బాస్ 'బాంబ్' ఛాలెంజ్!

    |

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ఇంటి సభ్యులు ప్రస్తుతం భయం భయంగా కామెడీ పంచుతున్నారు. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బుని తిరిగి సంపాదించడానికి బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్ లు ఇస్తున్నారు. ఛాలెంజ్ లో గట్టిగా తలపడి డబ్బులు సంపాదించుకున్న ఇంటి సభ్యులకు గత ఎపిసోడ్ లో డార్క్ రూమ్ టాస్క్ ఇచ్చారు. దీంతో ఇంటి సభ్యులు ఓవైపు భయపడుతూనే మరోవైపు కామెడీ చేస్తున్నారు.

    గత ఎపిసోడ్ లో భయం భయంగా వెళ్లిన ఆదిరెడ్డి, శ్రీహాన్ మొత్తానికి డబ్బు సంపాదించుకుని వచ్చారు. ఇక మిగిలిన సభ్యుల వంతు ఉంది. డిసెంబర్ 8 గురువారం నాటి 95వ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

    భయం వేస్తుంది బిగ్ బాస్..

    భయం వేస్తుంది బిగ్ బాస్..

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ డిసెంబర్ 8 గురువారం నాటి 95వ రోజు 96వ ఎపిసోడ్ ప్రోమోలో శ్రీ సత్య.. కన్ఫెషన్ రూమ్ (డార్క్ రూమ్) కి రండి అని బిగ్ బాస్ పిలిచాడు. దీంతో శ్రీ సత్యను కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్తూ ఒక్కసారి ఇది వినేసేయ్ అని విచిత్రంగా అరిచింది కీర్తి భట్. అయ్యే బిగ్ బాస్ భయం వేస్తుందని శ్రీసత్య అంది. డార్క్ రూమ్ డోర్ దగ్గర నిలబడి వెళ్లేందుకు శ్రీ సత్య భయపడుతుంటే.. మీరు వెళ్లండి నేను డోర్ వేస్తానని ఆదిరెడ్డి అన్నాడు.

    కన్ఫెషన్ రూమ్ లోకి రండి..

    కన్ఫెషన్ రూమ్ లోకి రండి..

    ఆదిరెడ్డి అలా అనడంతో ఆగండి.. ఎందుకు వేయడం అని శ్రీ సత్య కంగారుగా అంది. బిగ్ బాస్ నాతోపాటు ఇంకొకరిని పిలవండి, లేకుంటే నేను రాను అని డోర్ దగ్గర కూర్చుని శ్రీ సత్య అంటే.. నా పేరు చెప్పావంటే ప్లేట్ ఇచ్చుకుని కొట్టేస్తాను అని శ్రీహాన్ అన్నాడు. ఇంకొక్కరిని రమ్మనండని శ్రీ సత్య చెప్పబోతుంటే.. కన్ఫెషన్ రూమ్ లోపలికి రండి అని బిగ్ బాస్ అన్నాడు. దీంతో అమ్మో నేను రాను అని శ్రీ సత్య మారాం చేసింది.

    లక్ష రూపాయలు కోల్పోయారు..

    లక్ష రూపాయలు కోల్పోయారు..

    సత్య నువ్ ధైర్యవంతురాలివి కదా, హర్రర్ అవి వింటావ్ కదా.. మళ్లీ ఇదేంటి అని రేవంత్ అన్నాడు. చిన్న చిన్న పురుగులకే భయపడతాను బిగ్ బాస్.. పాములు పెట్టావ్.. నావల్ల అవ్వదు బిగ్ బాస్ అని శ్రీ సత్య బతిమిలాడుకుంది. దీనికి డబ్బులు మాత్రం కట్ అవుతో ఇంట్లో మొత్తం సీరియస్ అవుతా నీ ఇష్టం అని రేవంత్ అన్నాడు. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లలేకపోయినందున.. ఈ రౌండ్ కి సంబంధించిన రూ. లక్షను ఇంటి సభ్యులు కోల్పోవడం జరిగిందని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు.

    శ్రీసత్యపై రేవంత్ సీరియస్..

    శ్రీసత్యపై రేవంత్ సీరియస్..

    బిగ్ బాస్ అలా అనేసరికి లేదు.. వస్తున్నా.. వస్తున్నా అని భయంగానే అరిచింది శ్రీ సత్య. తర్వాత డోర్ క్లోజ్ అవ్వడంతో అబ్బా అనుకుంటూ బయటకు వచ్చారు హౌజ్ మేట్స్. డోర్ దగ్గర నిలబడి బిగ్ బాస్ వస్తా అని శ్రీ సత్య అంటే.. ఇంకెందుకు వస్తా అని అనడం.. ఇక ఇటు రా అంటూ రేవంత్ సీరియస్ గా వెళ్లిపోయాడు. దానికి రేవంత్ ఎందుకు అలాగా అని శ్రీహాన్ అన్నాడు. ఎంటర్టైన్ మెంట్ టాస్క్ ను అలాగే అవ్వనివ్వరా అని శ్రీహాన్ చెప్పాడు.

    డబ్బులు తిరిగి పొందడానికి బిగ్ బాంబ్..

    డబ్బులు తిరిగి పొందడానికి బిగ్ బాంబ్..

    పాములు ఉన్నాయి లోపల అంటూ శ్రీ సత్య బయటకు వచ్చింది. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించుకోవడానికి ఇప్పుడు ఇస్తున్న ఛాలెంజ్ బిగ్ బాంబ్. ఈ ఛాలెంజ్ లో భాగంగా ముగ్గురు పోటీ దారులు వారి బాంబ్ కు ఉన్న సరైన వైర్స్ ని కట్ చేసి డిఫ్యూస్ చేయాలి ఉంటుందని వచ్చిన అనౌన్స్ మెంట్ ను ఆదిరెడ్డి చెప్పాడు. ఈ ఛాలెంజ్ లో రేవంత్, శ్రీ సత్య, ఇనయా పాల్గొన్నారు.

    ఇది ఫిజికల్ టాస్క్ కాదు..

    ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న ముగ్గురిలో ఓ ఒక్కరు గెలుస్తారని భావిస్తున్నారో ఏకాభిప్రాయంతో చెప్పమని బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్లకు తెలిపాడు. ఇనయా గెలవచ్చేమో అని శ్రీహాన్ అంటే ఇనయా గానీ సత్య అని నాకు అనిపిస్తుందని ఆదిరెడ్డి అన్నాడు. రోహిత్ కూడా శ్రీ సత్య పేరు చెప్పాడు. నాకు రేవంత్ అన్నా అనిపిస్తుందని కీర్తి చెప్పింది. ప్రతీసారి రేవంత్ గెలుస్తాడని అనుకోలేం. ఎందుకంటే ఇది ఫిజికల్ టాస్క్ కాదు అని ఆదిరెడ్డి వివరించాడు.

    English summary
    Bigg Boss Telugu 6 Sri Satya Scared To Go To Dark Room And Revanth Serious On Sri Satya December 8 Episode Day 95 Promo 1 Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X