twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam weekly roundup చావు బతుకుల్లో వంటలక్క.. కార్తీకదీపంలో హై ఓల్టేజ్ ట్విస్టులు!

    |

    కార్తీకదీపం సీరియల్‌లో డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 10 వరకు సాగిన ఎపిసోడ్స్‌లో భారీ ట్విస్టులు కనిపించాయి. ఎమోషనల్ కంటెంట్‌తోపాటు రకరకాల సంఘటనలు, ట్విస్టులు సీరియల్‌పై ఆసక్తిని కలిగించాయి. వంటలక్కకు గుండె జబ్బు తీవ్రం కావడం, తల్లిదండ్రుల కోసం శౌర్య వెతకడం, కార్తీక్, దీప బతికి ఉన్నారా అనే సందేహాలతో తల్లిదండ్రులు ఆనందరావు, సౌందర్య ఎదురు చూడటం లాంటి అంశాలు భావోద్వేగంగా కనిపించాయి. డిసెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు సాగిన విషయాలు ఏమిటంటే?

     మోనిత‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

    మోనిత‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

    శౌర్యను వెతికేందుకు దీపతో కలిసి కార్తీక్ వెళ్లడంపై మోనిత కోపంతో ఊగిపోయింది. సౌందర్య ఇంటిలో బందీగా ఉన్న మోనిత తప్పించుకొని వచ్చి.. వారిద్దరిని కాల్చిపడేసేందుకు వెళ్తుంటే.. సౌందర్య ఎదురుపడింది. సౌందర్యను కాల్చేస్తే పీడ పోతుందని తుపాకి ఎక్కుపెట్టింది. అయితే సౌందర్య వెనుకాలే వచ్చిన ఏసీపీ రోషిణిని చూసిన మోనిత కంగారుపడింది. పెరోల్‌పై వచ్చి తప్పించుకు తిరుగుతున్న మోనితను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు,

    దీపకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్

    దీపకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్


    గుండె జబ్బుతో బాధపడుతున్న దీపకు కార్తీక్ సర్జరీ చేయడంతో కొంత ఉపశమనం కలిగింది. శౌర్య కోసం వెతికేందుకు ప్రయత్నిస్తున్న వంటలక్కను కార్తీక్ వారించాడు. అయితే మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత డిశ్చార్జి చేస్తామని డాక్టర్ చారుశీల చెప్పడంతో దీప ప్రశాంతంగా ఉంది. అయితే మెడికల్ రిపోర్టులు చూసిన చారుశీల షాక్ తిన్నది. దీపకు ఉన్న గుండె జబ్బు గురించి కార్తీక్‌కు ఇప్పడే చెప్పవద్దు. దీపకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుందని చారుశీల చెప్పింది.

     వారణాసి కోమాలో ఉన్నాడని తెలిసి..

    వారణాసి కోమాలో ఉన్నాడని తెలిసి..


    తన జీవితంలో ఎదురుపడిన సమస్యలను గట్టెక్కడానికి సహాయం చేసిన వారణాసి హాస్పిటల్‌లో ఉన్నాడని తెలుసుకొని దీప ఎమోషనల్ అయింది. నాకు చాలా సేవలు చేసిన వారణాసికి ఒక హామీ ఇచ్చాను. ఎంతకాలం ఆటో నడుపుకొంటావు.. ఒక ట్యాక్సీ కొనిస్తాను అని చెప్పాను. మనం వెళ్లిన తర్వాత టాక్సీ కొనివ్వాలి అని దీప చెప్పింది. అయితే నిన్ను, నన్ను కాపాడే ప్రయత్నంలో మోనిత మనుషులు దాడి చేయడంతో వారణాసి కోమాలో ఉన్నాడు అని కార్తీక్ చెప్పాడు.

    మోనితకు మెంటల్ సర్టిఫికెట్

    మోనితకు మెంటల్ సర్టిఫికెట్


    పోలీస్ కస్టడీలో ఉన్న మోనితను రకరకాలుగా విచారించారు. పిస్టల్ తీసుకొని ఎవరిని చంపేందుకు వెళ్లావనే విషయంపై పోలీసులు మోనితను విచారించారు. అయితే తనకు ఏమీ తెలియదు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నది. తనకు మెంటల్ ఉందని, సర్టిఫికెట్ కూడా తెచ్చుకొనేందుకు రెడీ అయింది. ఏం చేసినా మోనిత తన మనసులో మాటను బయటపెట్టేలా లేదు. పైగా జైలు గదిలో కార్తీక్ ఫోటో పెట్టుకొనేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకొన్నది అని సౌందర్య చెప్పింది.

    శౌర్యను దూరంగా ఉంచిన కార్తీక్

    శౌర్యను దూరంగా ఉంచిన కార్తీక్


    హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులను కలిసేందుకు దీప, కార్తీక్ బయలుదేరారు. మార్గమధ్యంలో తన కుటుంబాన్ని కలిసినట్టు దీప కల కన్నది. తీరా ఇంటి ముందుకు రాగానే సృహ కోల్పోవడంతో ఎదురుగా కుటుంబ సభ్యులు ఉన్నా.. చూడలేని పరిస్థితి. దీపను వెనుకకు తీసుకొచ్చి హాస్పిటల్‌లో చేర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో తన భార్యను కుటుంబ సభ్యులకు, తన పిల్లలకు చూపించడం సరికాదు అని కార్తీక్ నిర్ణయం తీసుకొన్నాడు. అలాగే శౌర్యను అప్పగించాలని వచ్చిన ఇంద్రుడిని కలిసి.. కొన్నాళ్లు నా బిడ్డను మీ వద్దే ఉంచుకోమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు నేను మీ వద్ద నుంచి శౌర్యను తీసుకెళ్తానని కార్తీక్ చెప్పాడు.

    English summary
    Karthika Deepam December 5th to 10th Episodes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X