twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kida మూవీకి ఇండియన్ పనోరమాలో స్టాండింగ్ ఓవేషన్.. స్రవంతి రవికిషోర్‌కు ప్రశంసల వర్షం

    |

    స్రవంతి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కిడ. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ పనోరమాలో కిడ చిత్రాన్ని ప్రదర్శించగా స్టాండింగ్ ఒవేషన్ లభించింది.

    కిడలో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.

    Sravanthi Ravi Kishores Kida movie gets standing ovation at Indian Panorama of IFFI

    ఈ సందర్భంగా 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''నేను చెన్నై వెళ్ళినప్పుడు ఓ స్నేహితుడిని కలిశా. తానొక కథ విన్నానని, అద్భుతంగా ఉందని చెప్పారు. కథ ఏంటి? అని అడిగా. ఐదు నిమిషాల పాటు కథ చెప్పారు. వినగానే కనెక్ట్ అయ్యాను. సరేనని స్క్రిప్ట్, డైరెక్టర్ నేరేషన్ వాయిస్ పంపించామని అడిగా. కథ మొత్తం విన్నాను. బావుంటుందని వెంటనే ఓకే చెప్పా. దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్ట్ ఏదైతే రాశాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. అందుకే, ఇవాళ ఇన్ని ప్రశంసలు లభిస్తున్నాయి. మా స్రవంతి సంస్థలో ఇది తొలి తమిళ సినిమా. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే సబ్ టైటిల్స్ తో కూడా చూస్తారు. అందుకనే, తమిళంలో తీశా. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు ‌.

    చిత్ర దర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ ''మా చిత్రానికి ఇంత అరుదైన గౌరవం లభించడం సంతోషంగా ఉంది. మదురైకి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో సినిమా తీశాం. తాతయ్య, మనవడు, ఓ మేకపిల్ల ఇందులో ముఖ్య పాత్రలు పోషించాయి. ఆ ముగ్గురి మధ్య ఎమోషన్స్ కీలకం. పనోరమాలో షో వేసినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చూశారు. నేను యంగ్ జనరేషన్ కి ఈ సినిమా కనెక్ట్ అవ్వరని అనుకున్నా. కానీ, వాళ్ళు సీన్ టు సీన్ చెబుతుంటే సంతోషంగా ఉంది. నేను మా అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగాను. తమిళనాడులో దీపావళి ఘనంగా సెలబ్రేట్ చేస్తాం. నా బాల్యంలో జరిగిన సంఘటనల స్పూర్తితో తీశాం. ఈ రోజు సినిమా ఈ స్థాయికి వచ్చిందంటే కారణం మా నిర్మాత స్రవంతి రవికిశోర్ గారు. నా తొలి సినిమాకు అటువంటి నిర్మాత లభించడం అదృష్టం. నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏ రోజూ ఆయన సెట్ కి రాలేదు. కానీ, నాకు ఏం కావాలో అది సమకూర్చారు. ఆయనకు చాలా థాంక్స్'' అని అన్నారు.

    English summary
    Ace producer ‘Sravanthi’ Ravikishore’s maiden Tamil film “Kida” has received a rare honour at the International Film Festival Of India which is being held at Goa now. Following the screening of Kida at the Indian Panorama, it got a standing ovation from the viewers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X