twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జారు మిఠాయ' అర్థమిదే.. పాట పాడినందుకు మోహన్ బాబు డబ్బులు ఇచ్చారు: సింగర్ క్లారిటీ

    |

    సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని వీడియోలు పాటలు వైరల్ అవుతున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొందరు ఇష్టంతో వైరల్ అయ్యేలా చేస్తుంటే మరి కొందరు మాత్రం కావాలని నెగిటివ్ గా కామెంట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా జిన్నా సినిమాలో నీ జంకలకడి జారు మిఠాయ అనే పాట బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే జిన్నా సినిమా ఈవెంట్లో పాడిన జానపద సింగర్స్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. నెగిటివ్ గా ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే దాని అసలు అర్థం చెప్పిన ఆ మహిళా గాయకులు మోహన్ బాబు డబ్బు కూడా ఇచ్చినట్లు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

     ఆ పాట వీడియో పై ట్రోల్స్

    ఆ పాట వీడియో పై ట్రోల్స్

    చిన్న సినిమా వచ్చి దాదాపు నెల రోజులు అయ్యింది. కానీ అందులోని పాట మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దానిని ఎక్కువగా ఇన్స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్లలో నెగిటివ్ గా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. జంకలకిడి జారు మిఠాయ అని పాట పాడిన మహిళకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆమె పాడిన విధానం పై నేటి తరం సోషల్ మీడియా పేజీలు ఊహించిన విధంగా కొంత ట్రోల్స్ కూడా చేశాయి.

     సింగర్స్ పేరేమిటంటే..

    సింగర్స్ పేరేమిటంటే..

    అయితే ఎంతో వైరల్ అయిన జారు మిఠయ పాట అనే పదానికి అర్థం ఏమిటి అనే విషయంలో కూడా చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జానపదం గేయాలకు ఇప్పుడిప్పుడే సినిమాల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఎవరో ఒకరు అలాంటి గాయాకులకు మంచి అవకాశాలు ఇస్తూ హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జిన్నా ఈవెంట్లో కూడా అదే విధంగా భారతమ్మ, నాగ రాజమ్మ వెలుగులోకి తీసుకువచ్చారు.

    జారు మిఠాయ అంటే..

    జారు మిఠాయ అంటే..


    అయితే జిన్నా సినిమాలో జారు మిఠాయ పాట స్ఫూర్తిగా చిత్తూరులోని జానపద గేయం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక భారతమ్మ ఈ పాట గురించి స్పందిస్తూ చిన్నప్పుడు గొర్రెలను మేకలను కాసేందుకు వెళ్లినప్పుడు సరదాగా మహిళలందరూ కూడా ఇలాంటి పదాలతో పాటలు పాడుకునేవారు అని.. జారు మిఠాయ అంటే తమ పల్లెల్లో ఉండే ఎన్నో అందాలు అని అర్థం వస్తుంది అని ఆమె చెప్పింది.

     జడేస్తా చూడు జడేస్తా చూడు..

    జడేస్తా చూడు జడేస్తా చూడు..

    ఇక జడేస్తా చూడు జడేస్తా చూడు.. నచ్చకుంటే తీసేస్తా చూడు, అని కూడా మేము అప్పుడప్పుడు సరదాగా తోటి మహిళలతో పాడుకుంటాము అని ఆమె అన్నారు. ఇక జంకలకిడి జారు మిఠాయి అంటే అమ్మాయి పేరుగా అర్థం వస్తుంది అని ఇంకా ఇదే పాటలో ఉండే మరికొన్ని పదాలకు కూడా చాలా అందమైన అర్థాలు ఉన్నాయి అని ఆమె వివరణ ఇచ్చారు.

    మోహన్ బాబు డబ్బులు ఇచ్చారు

    మోహన్ బాబు డబ్బులు ఇచ్చారు


    అయితే ఈ పాట పాడుతున్నప్పుడు మోహన్ బాబు గారు ఎంతగానో మెచ్చుకున్నారు అని అలాంటి పెద్ద వేడుకలలో మాలాంటి గ్రామీణ మహిళలు పాటలు పాడడం కూడా ఎంతో సంతోషంగా అనిపించింది అని బారతమ్మ తెలియజేశారు. ఇక సోషల్ మీడియా గురించి మాత్రం వారు ఏ విధంగానూ రియాక్ట్ అవ్వలేదు. అయితే ఆ పాటలు పాడగానే మోహన్ బాబు గారు రూ.50 వేలు ఇచ్చినట్లు కూడా ఆమె తెలియజేశారు.

    English summary
    Jinna movie jaru mitaya meaning and clarification from village singers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X