twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi గొప్ప మనసు.. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో సినిమాటోగ్రాఫర్.. అన్ని లక్షలతో 'చిరు' సాయం!

    |

    మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరింజీవి. కొంతకాలం రాజకీయాలతో సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తనదైన మ్యానరిజంతో అలరిస్తున్నారు. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చాటుతున్న చిరంజీవి ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందు నిలబడి సాయం అందిస్తారు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మెగాస్టార్.

    సంక్రాంతి కానుకగా..

    సంక్రాంతి కానుకగా..

    మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాగే పలు చిత్రాలకు వాయిస్ కూడా అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయం సాధించారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

    మరో రీమెక్ లో చిరు..

    మరో రీమెక్ లో చిరు..

    చిరంజీవికి అభిమాని అయిన కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ లుక్ లో మెగాస్టార్ అదరగొట్టారని టాక్ వస్తోంది. ఇటీవల వాల్తేరు వీరయ్య విజయ విహారం అని సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. చిరంజీవి ఇదే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే విశ్వాసం అనే మరో మూవీని కూడా రీమెక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఎంతోమందికి చిరు సాయం..

    ఎంతోమందికి చిరు సాయం..

    ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించేందుకు ఒక అడుగు ముందు ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించి తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ కష్టాలు పడే ఎంతో మందికి సాయం అందిస్తూ చేయూతనిస్తుంటారు. ఇలా సహాయం అందుకున్న వాళ్లలో.. పావల శ్యామల, గుండు హనుమంతరావు, డ్యాన్స్ మాస్టర్ శివశంకర్, పొట్టి వీరయ్య, తమిళ్ యాక్టర్ పొన్నంబళం వంటివారు ఎంతో మంది ఉన్నారు.

    చనిపోవాలని చెప్పడంతో..

    చనిపోవాలని చెప్పడంతో..

    మెగాస్టార్ చిరంజీవి తాజాగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి. దేవరాజ్ కు సహాయం అందించారు. సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, ధర్మేంద్ర, చిరంజీవి, రజనీ కాంత్, బాలకృష్ణ వంటి ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు దేవరాజ్. ఆయన ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్న దేవరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాధలను చెప్పుకున్నారు. ఆ బాధలు తాళలేక చనిపోవాలనిపిస్తుందని కన్నీరు పెట్టున్నారు.

    రూ. 5 లక్షల చెక్ అందజేత...

    రూ. 5 లక్షల చెక్ అందజేత...

    ఇంటర్వ్యూ ద్వారా సినిమాటోగ్రాఫర్ పి. దేవరాజ్ గురించి తెలుసుకున్న చిరంజీవి చలించిపోయి.. ఆయనకు ఆర్థిక సాయం అందించారు. రూ. 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవరాజ్ ను కలిసి మెగాస్టార్ చెక్ అందజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే దేవరాజ్ తండ్రి శ్రీధర్ కూడా సినిమాటోగ్రాఫర్ గానే పని చేశారు. 1950 దశకంలో సినిమాటోగ్రాఫర్ గా శ్రీధర్ పనిచేశారు.

    300కు పైగా చిత్రాలకు..

    300కు పైగా చిత్రాలకు..

    అయితే చిరంజీవి హీరోగా చేసిన నాగు, పులి బెబ్బులి, రాణి కాసుల రంగమ్మ, టింగు రంగడు వంటి సినిమాలకు దేవరాజ్ కెమెరామేన్ గా వర్క్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో మొత్తం కలుపుకుని 300కుపైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు దేవరాజ్. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన ఆర్థికంగా స్థిరపడలేకపోయారు. దేవరాజ్ కుమారుడు కూడా అంతగా స్థిరపడలేదట. అలాగే ఆయనకు ఇటీవల యాక్సిడెంట్ కావడంతో.. సరిగ్గా నడవలేకపోతున్నారట. ఆయన ఆపరేషన్ కు రూ. 6 నుంచి 7 లక్షల వరకు ఖర్చవుతుందని దేవరాజ్ తెలిపారు.

    English summary
    Megastar Chiranjeevi Gives Rs 5 Lakh Cheque To Senior Cinematographer P Devaraj For Financial Problems And Photo Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X