twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi: విక్రమ్‌కు దివ్య మేసేజ్.. అంతలోనే రాజ్యలక్ష్మి షాక్.. ప్రియ రాకతో మరో ట్విస్ట్

    |

    చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి ఎందుకు దగ్గర అవుతున్నావని నందూను లాస్య సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో తాను ఇష్టం లేకున్నా వాసుదేవ్ కోసం యాక్టింగ్ చేస్తున్నానని చెప్తాడు. ఇక, దివ్యపై సంజయ్, రాజ్యలక్ష్మి కోపంగా ఉంటారు. ఆ సమయంలోనే విక్రమ్ వచ్చి ఆ అమ్మాయి ఎవరో తెలియక ఉద్యోగం నుంచి తీసేయమంటాడు. అనంతరం దివ్యతో కలిసి వెళ్తుండగా రౌడీలు వస్తారు. దీంతో వాళ్లందరినీ విక్రమ్ కొట్టేస్తాడు. ఇక, లాస్య అడగడంతో విక్రమ్ గురించి మొత్తం వివరాలను తెలుసుకున్న భాగ్య.. ఫోన్ చేసి మరీ అతడి బ్యాగ్రౌండ్ చెప్తుంది.

    చీకట్లో రెచ్చిపోయిన మెగా హీరోయిన్: అవి మాత్రమే కనిపించేలా లైట్ వేసి!చీకట్లో రెచ్చిపోయిన మెగా హీరోయిన్: అవి మాత్రమే కనిపించేలా లైట్ వేసి!

    తులసి పక్కనే పడుకున్న నందూ

    తులసి పక్కనే పడుకున్న నందూ


    ఉదయాన్నే తులసి నిద్రలేవగా పక్కనే నందూ పడుకుని ఉంటాడు. అది చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాదు, ఎంత పొద్దెక్కినా నిద్ర లేవలేదు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే అతడిని నిద్ర లేపుతుంది. అప్పుడు నందూ అప్పుడే నిద్ర లేచావా ఇంకో కొద్దిసేపు పడుకో అని అంటాడు. దీనికి తులసి 'వంటింట్లో పని ఉంది. అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా' అంటుంది. దీనికి నందూ 'రాములమ్మ ఉంది.. ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళు చేసుకుంటారు లే తులసి' అనగా.. తులసి నాకు జ్వరం తగ్గింది అని చెప్తుంది.

    భయం కాదు.. ఇబ్బందిగా ఉంది

    భయం కాదు.. ఇబ్బందిగా ఉంది

    తులసి జ్వరం తగ్గిందని చెప్పడంతో నందూ'జ్వరం తగ్గినా నీరసం తగ్గదు కదా. కాబట్టి రెస్ట్ తీసుకో. రాత్రంతా మూసిన కన్ను తెరవకుండా పడుకున్నావు' అని అంటాడు. నందూ మాటలకు తులసి 'అయినా మీరు రాత్రంతా నాకోసం ఎందుకు ఎదురుచూస్తున్నారు? దివ్య ఉంది కదా. తను చూసుకునేది కదా' అని అంటుంది. అప్పుడు నందూ 'దివ్య కంటే నీ మీద నాకు ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పుడు నీ భయం ఏంటో నాకు అర్థమైంది తులసి' అంటాడు. దీంతో తులసి బాధ పడుతూ 'ఈ విషయంలో అది భయం కాదు ఇబ్బంది మాత్రమేనండీ' అని అంటుంది.

    అందాల గేట్లు ఎత్తేసిన ప్రియా ప్రకాశ్: ఎద నుంచి థైస్ వరకూ ఫ్రీ షోఅందాల గేట్లు ఎత్తేసిన ప్రియా ప్రకాశ్: ఎద నుంచి థైస్ వరకూ ఫ్రీ షో

    దివ్య మెసేజ్... విక్రమ్ సంతోషం

    దివ్య మెసేజ్... విక్రమ్ సంతోషం

    దివ్య ఉదయాన్నే నిద్ర లేవగానే విక్రమ్‌తో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటుంది. అలా అతడిని తలుచుకుంటూ సంతోష పడుతుంది. ఆ సమయంలో దివ్య 'మనసును ఎంత కంట్రోల్ చేసుకుందామనుకుంటున్నా మీ దగ్గరికి పారిపోయి వస్తోంది. కాస్త జాగ్రత్తగా చూసుకో మనసు లేకుండా నేను ఉండలేను. కానీ నువ్వు లేకుండా నా మనసు ఉండలేకపోతోంది' అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. తర్వాత మొబైల్‌లో విక్రమ్ ఫోటో చూస్తూ అతడికి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తుంది. అది చూసి విక్రమ్ సంతోషిస్తాడు. వెంటనే దేవుడికి కూడా చెబుతాడు.

    తులసి ఫైల్స్.. నందూ సాయం

    తులసి ఫైల్స్.. నందూ సాయం

    తులసి బయటకు రాగానే అనసూయ ముఖం వెలిగిపోతూ ఉండడంతో ఏమైందని ప్రశ్నిస్తుంది. దీనికామె 'నీకు తెలుసు కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నావు తులసి' అని అంటుంది. అప్పుడు తులసి 'మనకు కంటికి కనిపించేది ఏది నిజం కాదు అత్తయ్య' అని బాధ పడుతుంది. ఇంతలోనే వాసుదేవ్, ఇందు వచ్చి తులసినీ పరామర్శిస్తారు. అప్పుడు తులసి 'ఈ ఆఫీస్ ఫైల్స్ అన్ని చూడాలి ఇప్పుడు మేనేజర్ వస్తాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు' అంటుంది. దీంతో వాసుదేవ్ 'అదేంటి నందు నైట్ అంతా కూర్చొని ఫైల్స్ అన్ని క్లియర్ చేశారు కదా. ఇంకా ఉన్నాయా' అని అడుగుతాడు. దీంతో తులసి వాటిని చెక్ చేసి తెగ సంతోష పడుతుంది. తర్వాత వాసుదేవ్ వాళ్ల నందూను పొగుడుతూ మాట్లాడతారు.

    కాజోల్ ఎద అందాల బీభత్సం: 48 ఏళ్ల వయసులో ఘోరంగా.. కుచ్ కుచ్ హోతాహై!కాజోల్ ఎద అందాల బీభత్సం: 48 ఏళ్ల వయసులో ఘోరంగా.. కుచ్ కుచ్ హోతాహై!

    విక్రమ్‌కు షాకిచ్చిన రాజ్యలక్ష్మి

    విక్రమ్‌కు షాకిచ్చిన రాజ్యలక్ష్మి

    దివ్య మెసేజ్ చేసిన విషయాన్ని దేవుడికి చెప్పిన విక్రమ్.. 'ఈరోజు దివ్యను కలిసి నా మనసులో మాట బయటకు చెప్పేస్తాను' అంటాడు. అంతలోనే అక్కడకు రాజ్యలక్ష్మి రావడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడామె 'మన మామిడి తోట కాపుకు వచ్చేసింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమే చూసుకోవాలి. కాబట్టి తోట దగ్గరికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండిరా' అని చెబుతుంది. దీంతో షాకైపోయిన విక్రమ్ సరే అమ్మా అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత విక్రమ్.. దివ్య గురించి ఆలోచించుకుని బాధ పడుతుంటాడు. తర్వాత దేవుడు.. దివ్యను రెండు రోజులు దూరం పెట్టమని విక్రమ్‌కు సలహా ఇస్తాడు. దీంతో ఆమె ఫోన్ చేసినా విక్రమ్ లిఫ్ట్ చేయడు. అప్పుడు దివ్య అతడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

    నందూకు థ్యాంక్స్.. ప్రియ రాక

    నందూకు థ్యాంక్స్.. ప్రియ రాక

    జ్వరం వచ్చినప్పుడు మంచిగా చూసుకున్నందుకు నందూకు తులసి థాంక్స్ చెబుతుంది. దీనికి నందూ 'నాకోసం ఎన్నో చేశావు మరి నేను థాంక్స్ చెప్పలేదు కదా' అంటాడు. దీనికి తులసి 'థాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అప్పట్లో మన మధ్య బంధం ఉంది. ఇప్పుడు ఆ బంధం లేదు' అని చెబుతుంది. అంతలోనే మేనేజర్ రావడంతో ఆ ఫైల్స్ అతడికి ఇచ్చి పంపుతుంది. తర్వాత దివ్య కాఫీ తాగుతూ ఉండగా వాళ్ల ఆస్పత్రిలో పని చేస్తున్న నర్స్ ప్రియ అక్కడకు వస్తుంది. వచ్చీ రావడమే సంజయ్‌తో తనకు పెళ్లి జరిపించాలని అడుగుతుంది.

    Ritu Varma: తెలుగు పిల్ల హాట్ షో.. తొలిసారి ఘాటు ఫోజులతో రెచ్చిపోయిందిగా!<br />Ritu Varma: తెలుగు పిల్ల హాట్ షో.. తొలిసారి ఘాటు ఫోజులతో రెచ్చిపోయిందిగా!

    క్లాస్ పీకిన దివ్య.. ఆలోచిస్తూనే

    క్లాస్ పీకిన దివ్య.. ఆలోచిస్తూనే

    దివ్య దగ్గరకు వచ్చిన ప్రియ 'సంజయ్ చేతిలో మోసపోయాను. పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నాకు రెండో నెల. అదిగో ఇదిగో అంటూ మాట దాటేస్తున్నాడు. కానీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పుడు గట్టిగా నిలదీస్తే పెళ్లి చేసుకోను అబార్షన్ చేయించుకో కావాలని డబ్బులు ఇస్తాను అంటున్నాడు మేడం' అంటుంది. దీంతో దివ్య చేయించుకో అంటూ ఆమెకు గట్టిగానే క్లాస్ పీకుతుంది. తర్వాత 'ప్రేమించిన వాడు ఎవడు కూడా పెళ్లికి ముందు ఇలా కాలు జారడు. అసలు మోసం చేయడం అతని తప్పు కాదు మోసపోవడం నీ తప్పు అయినా అంత పెద్ద హాస్పిటల్ ఓనర్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు' అని ప్రశ్నిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 901: Bhagya Told The Truth about Vikram To Lasya. Then Vikram Saves Divya From Rowdies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X