twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ram Charan: స్టార్ క్రికెటర్ బయోపిక్ లో రామ్ చరణ్? ఇద్దరి గడ్డం కూడా సేమ్ ఉంటుందంటూ చెర్రీ!

    |

    ఎంటర్టైన్ మెంట్ అంటే మొదటగా గుర్తు వచ్చేది రెండే రెండు. ఒకటి సినిమా అయితే.. రెండోది క్రికెట్. హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అదే స్థాయిలో క్రికెటర్లకు సైతం ఉంటుంది. ఐపీఎల్, వన్డే, టెస్ట్ అది ఎలాంటి మ్యాచ్ అయినా టీవీలకు అతుక్కుపోతారు క్రికెట్ లవర్స్. సినీ హీరోలకు, స్టార్ క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

    అభిమాన హీరోల సినిమాల కోసం ఎలా పడిగాపులు పడతారో.. అలాగే ఫేవరెట్ క్రికెటర్ కొట్టే సిక్సుల కోసం అంతే ఎదురుచూస్తారు. అలాంటిది స్టార్ క్రికెటర్ జీవితం ఆధారంగా సినిమా రూపొందింతే. అందులోనూ గ్లోబల్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో నటిస్తే వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు అలాంటి కిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

    చిరుత సినిమాతో..

    చిరుత సినిమాతో..

    మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. డ్యాషింగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి నటనతో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. మెగా పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక జక్కన్న తెరకెక్కించిన రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులర్ అయిపోయాడు.

    అన్నింట్లో మార్కులు..

    అన్నింట్లో మార్కులు..

    RRRలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనపై తెలుగు ప్రేక్షకులు, సినీ విమర్శకులే కాకుండా విదేశీయులు సైతం కొనియాడారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, దర్శకుడు రాజమౌళి టేకింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం, పాటలు, కొరియోగ్రఫీ, యాక్షన్ స్టంట్స్ అన్నింట్లో మార్కులు కొట్టేసింది RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా. ఇక ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ 2023 గెలుచుకుని సత్తా చాటింది.

    తర్వాతి సినిమాలు..

    తర్వాతి సినిమాలు..

    మార్చి 13న ఉదయం జరిగిన 95వ అకాడమీ అవార్డు వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఎమ్ఎమ్ కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ పురస్కారం అందుకుని తెలుగు సినీ ప్రేక్షకుల చిరకాలం వాంఛ నెరవేర్చారు. దీంతో RRR సినిమా టీమ్ తోపాటు టెక్నీషియన్స్ అందరిపై వరల్డ్ వైడ్ గా అటెన్షన్ వచ్చింది.

    తర్వాతి సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే శంకర్ దర్శకత్వం రామ్ చరణ్ RC15 చేస్తున్న విషయం తెలిసిందే.

    స్పోర్ట్స్ ఆధారిత మూవీ..

    స్పోర్ట్స్ ఆధారిత మూవీ..

    ఇప్పుడు తాజాగా ఒక స్టార్ క్రికెటర్ బయోపిక్ లో నటించాలని ఉందని తన మనసులో మాట చెప్పాడు రామ్ చరణ్. స్పోర్ట్స్ రోల్స్ చేయడం అంటే తనకు ఇష్టమని చెప్పిన చెర్రీ వెండితెరపై క్రీడకారుడిగా కనిపించాలను కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇండియా టుడే కాన్ క్లేవ్ లో మీరు ఏదైనా రోల్ చేయాలని ఉందా అని అడగ్గా.. "చాలా రోజుల నుంచి స్పోర్ట్స్ ఆధారిత సినిమా చేయాలని అనుకుంటున్నా" అని రామ్ చరణ్ తెలిపాడు.

    స్ఫూర్తివంతమైన రోల్..

    చెర్రీ ఆన్సర్ కి హోస్ట్ రాజ్ దీప్.. 'విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తే బాగుంటుందని' సలహా ఇవ్వగా.. "ఫెంటాస్టిక్. ఛాన్స్ వస్తే చేస్తా. విరాట్ కోహ్లీ స్ఫూర్తివంతమైన రోల్. మా ఇద్దరి గడ్డం కూడా సేమ్ ఉంటుంది" అని రామ్ చరణ్ అన్నాడు. ఇదిలా ఉంటే గతంలోనూ రామ్ చరణ్ ఒక స్పోర్ట్స్ మూవీ చేయాలని ట్రై చేశారు. పవన్ కల్యాణ్ బంగారం సినిమాకు దర్శకత్వం వహించిన కోలీవుడ్ డైరెక్టర్ ధరణితో మెరుపు అని ఒక సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు.

    ఇద్దరికీ చాలా పోలికలు..

    ఇద్దరికీ చాలా పోలికలు..

    అయితే పలు కారణాల వల్ల ఆ మెరుపు సినిమాను పక్కన పెట్టేశారు రామ్ చరణ్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయలేదు చెర్రీ. దీంతో ఎంతగానో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న కోహ్లీ బయోపిక్ చేస్తే బాగుంటుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్లిద్దరికీ చాలా పోలికలు ఉన్నాయంటూ ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇక మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ గా వచ్చిన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.

    English summary
    SS Rajamouli Directed Film RRR Actor Ram Charan Says He Would Love To Act Virat Kohli Role In His Biopic In India Today Conclave
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X