twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sania Mirza మమ్మల్ని తలెత్తుకొనేలా చేశారు.. టెన్నిస్ రిటైర్‌మెంట్‌పై రాంచరణ్ ఎమోషనల్!

    |

    సినిమా ఇండస్ట్రీతోనే కాకుండా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయనేది అందరికి తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. RRR సినిమాను ఆస్కార్ రేసులో విజేతగా నిలిపేందుకు ఆయన గత కొన్ని వారాలుగా అమెరికాలో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా మారిపోయారు. ఈ సందర్భంగా రాంచరణ్ తనకు స్నేహితురాలైన సానియా మిర్జా రిటైర్‌మెంట్‌పై ఎమోషనల్‌గా స్పందిస్తూ..

    ఆస్కార్ బిజీలో రాంచరణ్

    ఆస్కార్ బిజీలో రాంచరణ్

    మెగా హీరో రాంచరణ్ ప్రస్తుతం అమెరికాలో RRR సినిమా విజయోత్సోవం, అలాగే ఆస్కార్‌ను సాధించేందుకు బిజీగా ప్రమోషన్ చేస్తున్నారు. మార్చి 12న జరగబోయే అవార్డుల కార్యక్రమం కోసం సిద్దమవుతున్నారు.అలాగే తన సినిమా ప్రమోషన్స్ కాకుండా బయట జరిగే విషయాలపై నిశితంగా దృష్టిని పెడుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్ పోటీల నుంచి సానియా మిర్జా వైదొలగడంపై రాంచరణ్ ఎమోషనల్‌గా స్పందించారు.

    సానియా మిర్జా టెన్నిస్‌కు గుడ్ బై

    సానియా మిర్జా టెన్నిస్‌కు గుడ్ బై

    ఇటీవల టెన్నిస్ రంగానికి వీడ్కోలు చెప్పడానికి సానియా నిర్ణయం తీసుకోవడంతో హైదరాబాద్‌లోని లాల్ బహద్దూర్ స్టేడియంలోని ఫతే మైదానంలోని టెన్నిస్ గ్రౌండ్‌లో చివరి మ్యాచ్‌ను నిర్వహించారు. తాను ఎక్కడైతే టెన్నిస్ క్రీడకు సంబంధించిన ఓనమాలు స్వీకరించారో.. అక్కడే తన క్రీడా జీవితానికి ముగింపు పలికారు. సానియా ఆడే చివరి మ్యాచ్ కోసం మైదానాన్ని సర్వసుందరంగా ముస్తాబు చేశారు.

    ఫతే మైదాన్‌లో చివరి మ్యాచ్

    ఫతే మైదాన్‌లో చివరి మ్యాచ్

    టెన్నిస్ క్రీడలో తనకు భాగస్వామ్యంగా నిలిచిన కారా బ్లాక్, బెతనీ మాటెక్ సాండ్స్, మారియన్ బర్టోలి, ఇవాన్ డోడిగ్, రొహన్ బొప్పన్న లాంటి ఆటగాళ్లను ఆహ్వానించారు. వారితో కలిసి మ్యాచులు ఆడారు. చివరి మ్యాచ్ సందర్భంగా క్రికెటర్ యువరాజ్ సింగ్, బేతానీ జట్టుతో సానియా, రోహన్ బొప్పన జంటగా ఆడారు. టెన్నిస్ క్రీడకు ముగింపు చెప్పే ముందు మూడు మ్యాచ్‌లు ఆడటమే కాకుండా.. చివరి మ్యాచ్‌లో విజేతగా నిలిచారు.

    కేటీఆర్, అజర్, దుల్కర్ హాజరు

    కేటీఆర్, అజర్, దుల్కర్ హాజరు

    సానియా ముగింపు మ్యాచ్‌కు పలువురు సినీ తారలు, రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, సినీ నటులు దుల్కర్ సల్మాన్, హ్యుమా ఖురేషి, క్రీడా ప్రముఖులు మహ్మాద్ అజారుద్దీన్, డయానా పెంటీ, రాబిన్ ఊతప్ప, అనన్య బిర్లా తదితరులు హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం మంత్రి కేటీఆర్‌ ఆమెను ఘనగా సత్కరించారు.

    సానియా, యువరాజ్, ఇర్ఫాన్ స్టెప్పులు

    టెన్నిస్ జీవితానికి ముగింపు పలికిన తర్వాత సానియా మిర్జా హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో అతిథులకు విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుక ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ.. అనే పాటపై సానియా, సైనా నెహ్వాల్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఫర్హా అఖ్తర్ స్టెప్పులు వేశారు. అలా సానియా మిర్జా తన కెరీర్ ఘనంగా ముగింపు పలికారు.

    రాంచరణ్ ఎమోషనల్‌గా ట్వీట్

    టెన్నిస్ రంగానికి వీడ్కోలు చెప్పిన సానియా మిర్జాకు రాంచరణ్ గౌరవపూర్వకంగా ట్వీట్ చేస్తూ విషెస్ అందించారు. నా ప్రియాతి ప్రియమైన సానియా మిర్జా టెన్నిస్ రంగం నుంచి తప్పుకొన్నారు. టెన్నిస్ మైదానంలో ఆమెను ఇక చూడలేం. ఇండియాకు మీరు అందించిన సేవలు వెలకట్టలేనివి. మీరు ఆట ద్వారా మమ్మల్ని గర్వంగా ఫీలయ్యేలా చేశారు అని రాంచరణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Mega Power Star Ram Charan gets emotional over Sania Mirza retirement from World Tennis My dearest buddy MirzaSania … Tennis courts across the world will miss seeing you in action. Your contribution to sports in India is unmatched. You continue to make us proud.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X