twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas మారుతి సినిమా.. లోకేషన్ ఫొటో లీక్.. ఆ ఇంట్లోనే దెయ్యంతో ప్రభాస్!

    |

    ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక హారర్ కామెడీ సినిమా తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా షూటింగ్ ను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఒక కీలకమైన షెడ్యూల్ కూడా ముగిసినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా వేసిన ఒక సెట్ లో ప్రభాస్ తో పాటు మరికొంతమంది ప్రముఖ నటినటులతో దర్శకుడు మారుతి ఇటీవల కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

    ఈ సినిమా హారర్ కామెడీగా డిఫరెంట్ స్టైల్లో తెరపైకి రాబోతున్నట్లు టాక్. అయితే ఇప్పటివరకు దర్శకుడు మారుతి ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ రోజుకో రూమర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన లొకేషన్ సెట్ ను దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

    Pan india star prabhas maruti project location still viral

    అందులో కూడా ప్రభాస్ సినిమా అని క్లారిటీ ఇవ్వలేదు కానీ ప్రస్తుతం మాత్రం మారుతి ప్రభాస్ కు సంబంధించిన సినిమా షూటింగ్లోనే బిజీగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ ఫోటో కూడా ఆ లొకేషన్ కు సంబంధించినదే అని అర్థమవుతుంది. తప్పకుండా ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగానే ఉంటుందట. ఇక సైలెంట్ గా సినిమా షూటింగ్ పూర్తి చేసి కొన్ని రోజుల తర్వాత ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు.

    ఇక మారుతి లీక్ చేసిన ఫోటోలో కనిపిస్తున్న ఇల్లు ప్రధానంగా హైలెట్ కానుందట. ప్రభాస్ అలాగే అతని టీమ్ దెయ్యంతో ఎదుర్కొనే సన్నివేశాలను అందులోనే షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా ఇందులో హైలెట్ గా ఉంటుందట. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా హాట్ టాపిక్ గా మారుతొంది. ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత 100 కోట్ల కంటే తక్కువ బడ్జెట్లో ఇంతవరకు సినిమా చేయలేదు. కానీ ఈ సినిమాను మాత్రం 60 నుంచి 70 కోట్ల మధ్యలో ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నారు. కుదిరితే 50 కోట్ల లోపే నిర్మించాలని కూడా ఆలోచిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

    English summary
    Pan india star prabhas maruti project location still viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X