twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    CCL 2023: థమన్ బ్యాటింగ్ మైండ్ బ్లోయింగ్.. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సిక్సర్ల మోత!

    |

    మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతంలోనే కాదు క్రికెట్ లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం సినిమా సెలబ్రిటీలు అందరూ కలిసి ఒక క్రికెట్ లీగ్ ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో తమన్ ఈరోజు ఈరగదీసాడు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 2023లో భాగంగా పంజాబ్ దే షేర్ తో జరుగుతున్న మ్యాచులో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఏమాత్రం గ్యాప్ దొరికినా..

    ఏమాత్రం గ్యాప్ దొరికినా..

    మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ తో బిజీగా ఉంటే కాస్త ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రికెట్ ఆడుతూ ఉంటాను అని థమన్ చాలాసార్లు చెప్పాడు. ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా థమన్ తన స్నేహితులతో కలిసి గ్రౌండ్లోకి వెళ్లి మ్యాచ్ లు అడుతుంటాను అని అంటుంటారు. ఇక మొదటిసారి థమన్ కి CCL ద్వారా మంచి అవకాశం దొరికింది.

     సోషల్ మీడియాలో వైరల్

    సోషల్ మీడియాలో వైరల్

    ఇక బ్యాట్ అందుకుని క్రీజులోకి వచ్చీ రాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన థమన్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధులపై విరుచుకుపడ్డాడు. గ్రౌండ్ కి అన్ని వైపులా బౌండరీలు బాదుతూ తన జట్టుకు స్కోరు తీసుకురావడమే గాక అభినులను ఉత్సాహ పరిచాడు. థమన్ బ్యాటింగ్ చూసి ఆడియెన్స్ సోషల్ మీడియాలో చాలా హడావుడి చేస్తున్నారు.

     థమన్ బెస్ట్ బ్యాటింగ్

    థమన్ బెస్ట్ బ్యాటింగ్

    18 బంతుల్లో 37 పరుగులు చేసి తెలుగు టైటాన్స్ కు మంచి చెప్పుకోదగ్గ స్కోర్ అందించాడు. 47 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టైటాన్స్ కు థమన్ ఇన్నింగ్స్ ప్రాణం పోసిందని విశ్లేషకులు చెబుతున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలుగు టైటాన్స్ కు మంచి శుభారంభం అందిందనే చెప్పాలి.

    ఆదుకున్న థమన్

    ఆదుకున్న థమన్

    ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసేసరికి టైటాన్స్ 3 ఓవర్లలో 38 పరుగులు చేసింది. టైటాన్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ ఈ మ్యాచ్ లో కూడా భాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 14 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అనంతరం వరుస వికెట్లు కోల్పోయి టైటాన్స్ పని అయిపోయిందా అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో థమన్ ఆదుకున్నాడు.

    వరుస వికెట్లు

    వరుస వికెట్లు

    3 బంతులు ఎదుర్కున్న సుధీర్ బాబు(0) డకౌట్ అయ్యి వెనుదిరగగా, అశ్విన్ 1(2 బంతుల్లో), రోషన్ 1 (3 బంతుల్లో) వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన థమన్ వచ్చీరాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారికి ఊపిరి అందకుండా చేశాడు.

    నలువైపులా బౌండరీలు

    ఫోర్లు, సిక్సర్లతో బంతిని నలువైపులా బౌండరీలకు పంపుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 18 బంతులు ఆడిన థమన్ 37 పరుగులు చేశాడు. థమన్ బ్యాటింగ్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే బౌలింగ్ లో థమన్ తన తడాఖా చూపిస్తున్నాడు. మరి రాబోయే మ్యాచ్ లలో థమన్ ఇంకా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

    English summary
    CCL 2023 ss thaman mind blowing batting with Punjab batting..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X