twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    PAPA Twitter Review: నాగ శౌర్య, మాళవిక కెమిస్ట్రీ అద్భుతంగా.. అసలైనదే మిస్ అయిందంటూ!

    |

    ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి సినిమాలతో హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది వరుడు కావలెను, కృష్ణ వ్రిద విహారి సినిమాతో పలకరించిన నాగ శౌర్య ఈ సంవత్సరం నటించిన మూవీ 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి'. నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం అంటే మార్చి 17న విడుదల అయింది. ఈ క్రమంలో ఈ సినిమాపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో ట్విటర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

    ఏడేళ్ల గ్యాప్ తర్వాత..

    ఏడేళ్ల గ్యాప్ తర్వాత..


    సినీ ఇండస్టీలో ఏడాదికి దాదాపుగా 50 సినిమాలు తెరకెక్కితే అందులో సగం కంటే ఎక్కువగా ప్రేమ కథలే ఉంటాయనేది ఒక టాక్. అంటే అంతలా ప్రేక్షకులు, యూత్ లవ్ స్టోరీలకు కనెక్ట్ అయిపోతారు. ఇక దర్శకులు వాటిని ఎంత కొత్తగా చెబితే అంతగా హిట్ కొడతాడు. ఇదే ఫార్ములాతో దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని మరోసారి మెగా ఫోన్ పట్టాడు నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్. నాగ శౌర్య హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా జతకట్టిన 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

    రెండోసారి జంటగా..

    రెండోసారి జంటగా..

    'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద వంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో రెండోసారి జతకట్టారు నాగ శౌర్య, మాళవిక నాయర్. వీరిద్దరు హీరో హీరోయిన్లుగా బీవీ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కల్యాణ వైభోగమే అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేదు.

    కీలక పాత్రలో డైరెక్టర్..

    ఇప్పుడు 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' సినిమాతో మరోసారి జత కట్టారు నాగ శౌర్య, మాళవిక నాయర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇదివరకే ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అవసరాల శ్రీనివాస్ ఇందులో కీలక పాత్ర సైతం పోషించారు. మరి మార్చి 17న విడుదలకు ముందే పలు ప్రీమియర్ షోలు పడ్డాయి. వాటిపై నెటిజన్ల స్పందిస్తూ రివ్యూ ఇచ్చారు.

    మంచి ఛాయిస్ కాదంటూ..

    "ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా ఒక అందమైన మెడికోర్ రొమాంటిక్ డ్రామా. సినిమాను నేచురల్ గా టేకింగ్ చేశారు. ఇతర సినిమాల్లో చూసినట్లుగా సన్నివేశాలు అనిపిస్తాయి. అయితే సినిమా ప్లాట్ చాలా స్లోగా సాగుతుంది. సినిమా ఒక చాప్టర్ మాదిరిగా వెళుతుంది. వెబ్ సిరీస్ ను చూసిన ఫీల్ కలుగుతుంది. అది అంతా మంచి ఛాయిస్ కాదనిపించింది. అసంపూర్తిగా అనిపించింది. కొన్ని డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, పాటలు మాత్రం బాగున్నాయి. బీజీఎమ్ పెద్దగా ప్రభావం చూపలేదు" అని ఒక నెటిజన్ రాసుకొస్తూ 5కి 2.5 రేటింగ్ ఇచ్చాడు.

     నెగెటివ్ పాయింట్ గా హీరో..

    నెగెటివ్ పాయింట్ గా హీరో..

    "ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి మూవీ ఒక ఎప్పటికీ ప్రారంభం కానీ లవ్లీ టీవీ సీరియల్. మాళవిక నాయర్ ప్లస్ పాయింట్. నాగ శౌర్య, సాంగ్స్ అండ్ మ్యూజిక్, నరకం చూపించే స్లో నెరేషన్ నెగెటివ్ పాయంట్స్. ఇది శ్రీనివాస్ అవసరాల సినిమాల అస్సలు అనిపించలేదు అంటూ" ఒక నెటిజన్ రాసుకొస్తూ సినిమాకు 5కి 1.25 రేటింగ్ ఇచ్చాడు.

    పట్టు కోల్పోయాడని..

    పట్టు కోల్పోయాడని..

    అయితే శ్రీనివాస్ అవసరాల ఫలానా అమ్మాయి.. ఫలానా అమ్మాయి సినిమాకు మిక్స్ డ్ టాక్, రివ్యూలు వస్తున్నాయి. నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా మాళవిక నాయర్ చాలా బ్యూటిఫుల్ గా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుందట. చాలా కాలం తర్వాత మాళవికకు మంచి పాత్ర దొరికిందంటున్నారు. అయితే కొందరు సంగీతం బాగుంది అంటే మరికొందరు బాగలేదు అంటున్నారు. కథనంలో శ్రీనివాస్ అవసరాల పట్టు కోల్పోయాడని చెబుతున్నారు. ఆయనలో ఉన్న రచయిత మిస్ అయ్యాడని పెదవి విరుస్తున్నారు.

    English summary
    Naga Shaurya Malvika Nair Starrer Avasarala Srinivas Directed Movie Phalana Abbayi Phalana Ammayi Twitter Review And Netizens Reaction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X