twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jr NTR: తప్పంతా ఎన్టీఆర్‌దే.. పిలిచినా రాలేదు.. టీడీ జనార్ధన్ కామెంట్స్

    |

    ఐదారేళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సినీ ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తారక్ తన నటనాకౌశల్యంతో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా నుంచి నేటి RRR వరకు నటనలో వైవిధ్యం చూపిస్తూ అలరిస్తున్నాడు. అయితే తాజాగా సర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తారక్ రాకపోవడంపై పలు విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఆహ్వానంపై టీడీ జనార్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    హాజరు కానీ తారక్: తెలుగు దేశం పార్టీ వ్వయస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా వారం రోజుల క్రితం హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు ఆయన మనువడు, నట వారసుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. దీంతో అటు రాజకీయపరంగా, ఇటు సినిమాల పరంగా జోరుగా చర్చ నడుస్తోంది. రెండు వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి.

    TD Janardhan

    ఏది ముఖ్యం: నందమూరి, నారా కుటుంబాలు జూనియర్ ఎన్టీఆర్ ను అవమానిస్తున్నాయని, అతన్ని సినీ రంగంలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని టాక్. అందుకే ఈ వేడుకలకు తారక్ రాకుండా మంచి పని చేశాడని ఓ వర్గం అంటోంది. పుట్టిన రోజు వేడుకలకు కుటుంబాలతో సహా విదేశాలకు వెళ్తే ఎలా వస్తాడని, విజయవాడలో జరిగిన వేడుకలకు కూడా తారక్ ను పిలవలేదని, ఇప్పుడు పిలిచినా అటెండ్ కాలేదని మరో వర్గం అంటోంది. అలాగే తాత శత జయంతి వేడుకలు ముఖ్యమా.. ట్రిప్ ముఖ్యమా అని కొంతమంది అంటున్నారు.

    TD Janardhan

    22 కుటుంబాలతో: ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పర్యవేక్షిస్తున్న టి.డి. జానర్థన్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. "ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఆహ్వానం ఇవ్వాలని ప్రయత్నించాం. ఆయనేమో వారం తర్వాత అపాయింట్ మెంట్ ఇచ్చారు. సరేనని వెళ్లి కలిసి విషయం చెప్పాం. అప్పుడాయన ముందుగానే మా పోగ్రామ్ ఫిక్స్ అయిందన్నారు. 22 ఫ్యామిలీలతో కలిసి ట్రిప్ కు వెళ్తున్నాం. ముందుగానే అనుకున్నాం" అని చెప్పారు అని జనార్ధన్ పేర్కొన్నారు.

    కల్యాణ్ రామ్ కూడా:"ఎన్టీఆర్ చెప్పిన దానికి మేం బాబు.. పుట్టినరోజులు మళ్లీ వస్తుంటాయి. శత జయంతి అనేది ఒకసారే మాత్రమే వస్తుందని కూడా అన్నాం. కానీ ఆయనకు షెడ్యూల్ కుదర్లేదేమో. మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయన నిర్ణయం తీసుకున్నారు. కల్యాణ్ రామ్ ను కూడా ఈ శత జయంతి వేడుకలకు ఆహ్వానించాం. ఆయన కూడా తారక్ తో పాటే వెళ్లినట్లున్నారు. అందుకే రాలేకపోయినట్లు భావిస్తున్నాం" అని జనార్ధన్ చెప్పుకొచ్చారు.

    TD Janardhan

    టార్గెట్ చేస్తూ: ఇక జనార్ధన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ దే తప్పు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తారక్ ప్రస్తుతం దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ NTR31 సినిమాలతో బిజీగా ఉన్నాడు.

    English summary
    TD Janardhan Comments About Jr NTR Not Attending Sr NTR 100 Years Birth Anniversary And Foreign Trip With 22 Families
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X