twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YSRCPApologizeRAJINI ట్రెండింగ్.. సంధినా? సమరమా? మీ రాజధాని ఎక్కడ? జగన్‌పై రజనీ ఫ్యాన్స్ ట్రోలింగ్

    |

    ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై గత రెండు రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై అత్యంత వివాదాస్పదమయ్యాయి. ఇటీవల విజయవాడలో జరిగిన స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ వేడుకల్లో రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ది గురించి ఆయన ప్రశంసలు గుప్పించారు. అయితే రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? ఎందుకు వివాదాస్పదమయ్యాయనే వివరాల్లోకి వెళితే..

    హైదరాబాదా? న్యూయార్కా? అని:విజయవాడలో జరిగిన సభలో రజనీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబుతో 30 ఏళ్ల స్నేహం ఉంది. ఆయన 2020 విజన్ కారణంగా హైదరాబాద్‌‌లో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ది చెందింది. ఇటీవల నేను బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌లో పర్యటించినప్పుడు.. నేను న్యూయార్క్‌లో ఉన్నానా? అనే ఫీలింగ్ కలిగింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు.. ఆయనతో ఈ మధ్య మాట్లాడినప్పుడు ఆయన 2047 విజన్ గురించి చెప్పాడు. అది అమలైతే ఇండియాలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంటుంది అని అన్నాడు.

    Rajinikanth fans trolling YS Jagan: YSRCPApologizeRAJINI hash tag treanding

    రోజా, నాని, జోగి రమేష్ దారుణంగా :రజనీకాంత్ చేసిన ప్రసంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. రోజా, కొడాలి నాని, జోగి రమేష్ లాంటి నేతలు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేయడంతో రజనీకాంత్ అభిమానులు రంగంలోకి దిగారు. కొన్ని గంటల వ్యవధిలోనే 2 లక్షలకుపైగా ట్వీట్లు చేసి #YSRCPApologizeRAJINI అంటూ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ చేశారు.

    Rajinikanth fans trolling YS Jagan: YSRCPApologizeRAJINI hash tag treanding

    వైఎస్ జగన్ మిమ్మల్ని ఏమైనా అన్నారా? :రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు సమర్ధించారు. మీ పార్టీని ఏమైనా అన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను సమర్ధించారా? కేవలం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబును పొగిడితే.. మీకు ఎందుకు అభద్రతాభావం ఏర్పడింది. మీకు ఇంత ఇన్ సెక్యూరిటీ అవసరమా? అంటూ రజనీకాంత్ అభిమానులు ప్రశ్నించారు.

    మీ రాజధాని ఎక్కడో చెప్పండి:తమిళనాడుకు చెందిన రజనీకాంత్ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మా రాజధాని చెన్నై. మీ రాజధాని ఏమిటో చెప్పండి. రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. మంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రజనీకాంత్‌కు వైఎస్ జగన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.

    సమరానికి తేల్చుకొంటారో.. :సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్‌కు భేషరుతుగా క్షమాపణ చెప్పాలి. సంధికొస్తారో.. సమరానికి తేల్చుకొంటారో అంది మీ ఛాయిస్ అని రజనీకాంత్ అభిమానులు సవాల్ విసురుతున్నారు. #YSRCPApologizeRAJINI ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు.

    ఏ దేశానికి వెళ్లినా రజనీకాంత్‌కు :ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా రజనీకాంత్‌ను మంచిగా గుర్తించి గౌరవిస్తారు. కొడాలి నాని లాంటి వ్యక్తి పక్క జిల్లాకు వెళ్తేనే ఎవరు పట్టించుకోరు. అలాంటి వ్యక్తి రజనీకాంత్‌పై చెత్త మాటలు మాట్లాడుతారా? జీరోగా మారిన వైసీపీ వెంటనే క్షమాపణలు చెప్పాలి అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

    జగన్ నీకు లాస్ట్ వార్నింగ్:వైసీపీ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ రజనీకాంత్ అభిమానులు డిమాండ్ చేస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. జగన్ నీకు ఇది లాస్ట్ వార్నింగ్ అంటూ కామెంట్ చేశారు. మన రాష్ట్రంలోనే కాకుండా మీకు పక్క రాష్ట్రాలతో కూడా తిట్టించుకోవడం సంతోషంగా ఉందా? అంటూ రజనీకాంత్ అభిమానులు ట్వీట్ చేశారు.

    ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి :రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రముఖ సినీ స్టార్స్ అభిమానులు భగ్గుమంటున్నారు. రజనీకాంత్‌కు ప్రభాస్, పవన్ కల్యాణ్, ఇతర నటీనటుల అభిమానులు సంఘీభావం తెలిపారు. తలైవాకు మా సపోర్టు ఇస్తున్నాం. వెంటనే రజనీకాంత్‌కు క్షమాపణ చెప్పాలి అని ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్ చేశారు.

    ఓ నేరస్థుడు అంటూ .. :రజనీకాంత్ అభిమానులు వైఎస్ జగన్‌పై భారీగా విరుచుకుపడుతున్నారు. ఓ నేరస్థుడిని ఈవెంట్‌కు పిలిస్తే.. తన మైండ్‌లో చరిత్రనంతా మాట్లాడుతాడు. కానీ రజనీకాంత్ లాంటి వ్యక్తి ఏపీ అధికార ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు. వారిని విమర్శించలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దూషించడం సమంజసమేనా. వెంటనే రజనీకాంత్‌కు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు

    English summary
    YSRCP leaders made comments on Super Star Rajinikanth in abusive manner after He praises chandrababu Naidu in Vijayawada. So Rajinikanth fans are trolling YS Jagan's party with YSRCPApologizeRAJINI hash tag.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X