twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Agent day 1 Collections ఏజెంట్‌ మూవీకి అలాంటి టాక్‌.. అయినా భారీ ఓపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?

    |

    స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, యంగ్ హీరో అఖిల్ అక్కినేని కాంబినేషన్‌లో రూపొందిన స్పై యాక్షన్, థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారథ్యంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    సీనియర్ యాక్టర్ మమ్ముట్టి, నూతన హీరోయిన్ సాక్షి వైద్య, బాలీవుడ్ నటుడు డినో మారియా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తెలుగు, మలయాళంలో రిలీజైన ఈ చిత్రం తొలి రోజున ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

    Agent Telugu movie day 1 expected Collections worldwide: Akhil Akkinenis movie opens positively at box office

    ఏజెంట్ బడ్జెట్, స్క్రీన్ కౌంట్: యాక్షన్ జోనర్‌తో స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఏజెంట్ చిత్రం పలు దేశాల్లో షూటింగ్ జరుపుకొన్నది. గ్రాఫిక్ వర్క్ కూడా భారీగా ఉండటంతో ఖర్చు భారీగా అయింది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 65 కోట్లు అయిందనేది ట్రేడ్ వర్గాల్లో టాక్. బడ్జెట్‌కు తగినట్టుగానే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 1120 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అఖిల్ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది.

    Agent Telugu movie day 1 expected Collections worldwide: Akhil Akkinenis movie opens positively at box office

    ఏజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్: ఇక ఎజెంట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో ఈ చిత్రం 11 కోట్లు, సీడెడ్‌లో 4.5 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్లుగా బిజినెస్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 30 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 1.5 కోట్లు, కేరళలో 1 కోటి రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 80 లక్షలు, ఓవర్సీస్‌లో 3.5 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 36.5 కోట్ల మేర బిజినెస్ చేసింది.

    Agent Telugu movie day 1 expected Collections worldwide: Akhil Akkinenis movie opens positively at box office

    తెలుగులో ఏజెంట్ ఆక్యుపెన్సీ: తెలుగు రాష్ట్రాల్లో అక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. తొలి రోజున మంచి రెస్పాన్స్ కనిపించింది. మిక్స్‌డ్ టాక్ రిపోర్టు ఉన్నప్పటికీ.. భారీ రెస్సాన్ కనిపించింది. మార్నింగ్ షోకు 45 శాతం, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్‌షోకు 42 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అఖిల్ సినిమాకు ఈ రేంజ్ ఆక్యుపెన్సీ కనిపించడం ఇటీవల కాలంలో ఇదే అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    Agent Telugu movie day 1 expected Collections worldwide: Akhil Akkinenis movie opens positively at box office

    మలయాళంలో ఏజెంట్ ఆక్యుపెన్సీ: ఏజెంట్ సినిమా మలయాళంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్ ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది. మలయాళంలో తొలి రోజున మార్నింగ్ షోకు 12 శాతం, మ్యాట్నీకి 7 శాతం, ఫస్ట్ షోకు 15 శాతం, సెకండ్ షోకు 15 శాతం మేరకు ఆక్యుపెన్సీ నమోదైంది.

    Agent Telugu movie day 1 expected Collections worldwide: Akhil Akkinenis movie opens positively at box office

    ఏజెంట్ తొలి రోజు కలెక్షన్లు..: ఏజెంట్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో మంచి ఒపెనింగ్స్ కనిపించాయి. ప్రీమియర్లు, ఫస్ట్ డే కలెక్షన్లు కలిపితే మొత్తం 100k డాలర్లు వసూలు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో కలిపి మొత్తంగా 7 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా 7 నుంచి 8 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

    English summary
    Akhil Akkineni's Agent movie by Director Surender Reddy. Akhil Akkineni is the Hero for this movie which is produced by Anil Sunkara. This movie is released on April 28th. Here is the day 1 expected collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X