twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జబర్దస్త్ పవిత్రకు మళ్లీ పెళ్లి.. మెడలో పసుపు తాడు, పక్కనే వరుడు.. వీడియో వైరల్

    |

    బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వారిలో లేడి కమెడియన్లు కూడా ఉన్నారు. ఈ జబర్దస్త్ స్కూల్ వచ్చి వినోదాన్ని పంచిన వారిలో పవిత్ర ఒకరు. ఫైమా, రోహిణి తరహాలో తనదైన కామెడీతో ఆకట్టుకుంది పవిత్ర. ప్రస్తుతం జబర్దస్త్ లో కనిపడని ఈ పవిత్ర తాజాగా మెడలో పసుపు తాడుతో దర్శనం ఇచ్చి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

    Jabardasth Pavithra

    వెండితెరపై": తెలుగులో లేడి కమెడియన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. సినిమాల్లో లేడీ కమెడియన్లు అరుదే. అయితే ఇప్పుడు దాన్ని భర్తి చేస్తున్నట్లుగా ముందుకు సాగుతుంది జబర్దస్త్ రోహిణి. బుల్లితెరపై మహిళా హాస్యనటిగా పేరు సంపాదించిన రోహిణి లాగే ఫైమా, పవిత్ర లేడి కమెడియన్లు అని నిరూపించుకున్నారు.

    Jabardasth Pavithra

    ఆమె వెల్లడం: సెలూన్ లో పని చేస్తూ టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది పవిత్ర. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన పవిత్రకు జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. బుల్లెట్ భాస్కర్, రాకేట్ రాఘవ, హైపర్ ఆది, మంకీ వెంకీ టీమ్స్ లో తనదైన కామెడీతో ఆకట్టుకుంది. ఇక ఫైమా జబర్దస్త్ నుంచి బయటకు రావడం వల్ల.. పవిత్రకు కలిసివచ్చిందని చెప్పుకోవచ్చు.

    Jabardasth Pavithra

    మెడలో పసుపుతాడు: ప్రస్తుతం జబర్దస్త్ షోలో కనిపించని పవిత్ర పలు షోలలో కామెడీ పంచుతోంది. అయితే తాజాగా జబర్దస్త్ పవిత్ర ఓ వీడియో చేసింది. దసరా సినిమాలోని కీర్తి సురేష్ డైలాగ్ తో చేసిన వీడియో నెట్టింట్లో వదిలింది. ఇందులో "అమ్మతోడు సూరిగా.. పెట్టి పుట్టావ్ రా కొడకా" అంటూ పెళ్లి కొడుకుని చూపించింది. ఇందులో పక్కనే వరుడు, మెడలో పసుపుతాడుతో కనిపించింది పవిత్ర.

    Jabardasth Pavithra

    మదర్స్ డే: అయితే పవిత్ర షేర్ చేసిన వీడియోకు "నిజంగానే పెట్టి పుట్టాలేమో నన్ను పెళ్లి చేసుకోవాలంటే. ఫైనల్ గా జీ తెలుగు వాళ్లు ఇచ్చిన టాస్క్ విజయవంతంగా పూర్తి చేశా. మ్యారేజ్ ప్రాంక్ ఆన్ మామ్" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే ఈ వీడియో మదర్స్ డే సందర్భంగా నిర్వహించిన ప్రోగ్రామ్ కోసం చేసినట్లుగా తెలుస్తోంది.

    జీవితం ప్రాంక్ కాకుండా: పవిత్ర షేర్ చేసిన వీడియో వైరల్ కాగా ఆమెపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురింపించారు. మదర్స్ డే సందర్భంగా తల్లును బకరాలు చేయడం ఏంటని మండిపడ్డారు. అయితే పవిత్ర ఇదివరకు కూడా ఓసారి జబర్దస్త్ తేజాతో పెళ్లైనట్లు ప్రాంక్ వీడియో చేసింది. ఇప్పుడు మళ్లీ తల్లినే మరోసారి పెళ్లితో ప్రాంక్ చేసింది. దీనిపై "పవిత్ర అని పెట్టుకుని పవిత్రమైన పెళ్లిని ప్రాంక్ చేస్తున్నావ్. నీ జీవితం కూడా ప్రాంక్ అయిపోద్ది జాగ్రత్త సుమీ" అని కామెంట్ చేశాడు ఓ నెటిజన్.

    English summary
    Jabardasth Lady Comedian Pavithra Pranked Her Mother With Marriage Over Mothers Day Programme
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X