twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tiku Weds Sheru OTT Review కంగన రనౌత్ బయోపిక్! టికు వెడ్స్ షేరు మూవీ ఎలా ఉందంటే?

    |

    నటీనటులు: నవాజుద్దీన్ సిద్దిఖీ, అవనీత్ కౌర్, విపిన్ శర్మ, ముఖేష్ భట్, ఖుషి భరద్వాజ్ తదితరులు
    రచన, దర్శకత్వం: సాయి కబీర్
    నిర్మాత: కంగన రనౌత్
    సినిమాటోగ్రఫి: ఫెర్నాండో గయేస్కై
    ఎడిటింగ్: బల్లు సలూజ
    మ్యూజిక్: గౌరవ్ చటర్జీ, సాయి కబీర్
    బ్యానర్: మణికర్ణిక ఫిల్మ్స్
    ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
    ఓటీటీ రిలీజ్: 2023-06-23

    సిరాజ్ షేర్ ఖాన్ అఫ్గానీ అలియాస్ షేరు (నవాజుద్దీన్ సిద్దిఖీ) సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టు‌గానే కాకుండా జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే వ్యక్తిగా పనిచేస్తుంటాడు. సినిమా నిర్మించాలని డబ్బు ఫైనాన్స్‌కు తీసుకొని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతాడు. ఇక భోపాల్‌కు చెందిన టికూ ఖాన్ (అవనీత్ కౌర్) బాలీవుడ్‌లో హీరోయిన్ కావాలనే కలతో ముంబైలో అడుగుపెడుతుంది. అనుకోకుండా టికూ, షేరు ఇద్దరూ పెళ్లి చేసుకొంటారు. కానీ పెళ్లి జరిగిన వారంలోనే టికూ గర్భవతి అని తేలుతుంది.

    జూనియర్ ఆర్టిస్ట్ సప్లైయర్ షేరు నటుడు, నిర్మాత కావాలనే కోరిక మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? షేరును ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి పనులు చేసేలా పురిగొల్పాయి? టికూతో షేర్ పెళ్లి ఎలా జరిగింది? టికూ గర్బవతి కావడానికి కారణం ఎవరు? టికూ గర్బవతి అనే విషయం తెలిసినప్పుడు షేరు పరిస్థితి ఏమిటి? షేర్ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? షేరు జైలుకు వెళ్లిన తర్వాత ఎలాంటి కఠిన నిర్ణయాలను టికూ తీసుకొన్నది? టికూ, షేరు జీవితాలకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే టికూ వెడ్స్ షేరు (Tiku Weds Sheru) సినిమా కథ.

    Tiku Weds Sheru OTT Review

    షేరు, టికూ భారీ కలలతో రంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన నేపథ్యంతో టికూ వెడ్స్ షేరు (Tiku Weds Sheru) కథ మొదలవుతుంది. హీరో, హీరోయిన్లు కావాలనే కలతో వచ్చే వారు ఎలాంటి కష్టాలకు గురి అవుతారనే విషయాలను దర్శకుడు ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎమోషనల్ సీన్లకు కావాల్సిన కంటెంట్ సరిగా లేకపోవడంతో సినిమా రొటీన్‌గా సాగుతుందనే ఫీలింగ్‌తోపాటు అంతగా ఆకట్టుకొన్నట్టు అనిపించదు. టికూ, షేరు పెళ్లి జరగడం. అంతకు ముందే మరో వ్యక్తితో టికూ శారీరక సంబంధం ఉండటంతో గర్బవతి కావడం చకచకా జరిగిపోతాయి. దాంతో కథలో వేగంగా కదలికలు మొదలవుతాయి. ఈ ఎపిసోడ్‌ కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది.

    ఇక టికూ వెడ్స్ షేరు (Tiku Weds Sheru) సినిమా కథలో రకరకాల వేరియేషన్స్ జొప్పించడం వల్ల ఇది ఫ్యామిలీ డ్రామానా? లేదా మరో కథనా అనే గందరగోళం ఏర్పడుతుంది. అప్పుల కారణంగా ఇతర వివాదాల కారణంగా షేరు జైలుకు వెళ్లడంతో టికూ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. దాంతో కన్న కొడుకు, చెల్లెలి సంరక్షణ కోసం, నిత్యావసరాల కోసం బోల్డ్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి టీకూకు ఏర్పడుతుంది. అయితే ఇలాంటి ఎమోషనల్ కంటెంట్‌ను డీల్ చేయడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యారు.

    Tiku Weds Sheru OTT Review

    నవాజుద్దీన్ సిద్ధిఖీ షేరుగా తన పాత్ర పరిధిలో వైవిధ్యమైన నటనను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో తన మార్కు ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. ఇక టికూగా అవనీత్ కౌర్ ఫెర్ఫార్మెన్స్, గ్లామర్ పరంగా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అని చెప్పుకోవాలి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లలో, సెకండాఫ్‌లో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను చక్కగా ఉపయోగించుకొని మంచి యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నదనే చెప్పాలి. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    Tiku Weds Sheru OTT Review

    ఇక సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. టికూ వెడ్స్ షేరు సినిమా సినీ నేపథ్యం, వాతావరణంతో సాగే కథ. సినిమాకు తగినట్టుగా వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ ఫెర్నాండో చక్కగా తెరకెక్కించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకోపోయాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు అంతంత మాత్రమే అనిపిస్తాయి.

    టికూ వెడ్స్ షేరు (Tiku Weds Sheru) సినిమాకు నిర్మాత అగ్ర హీరోయిన్ కంగన రనౌత్ నిర్మాత. ఈ సినిమాను ముందుగా గ్రాండ్ స్కేల్‌లో నిర్మించాలని అనుకొన్నారు. తొలుత ఈ సినిమాలో హీరోగా ఇర్ఫాన్ ఖాన్, కంగన రనౌత్ నటించాలని అనుకొన్నారు. కానీ ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మరణంతో నవాజుద్దీన్ సిద్దిఖీ తెరపైకి వచ్చారు. అయితే దర్శకుడు దాదాపు మూడేళ్లు అనారోగ్యానికి గురి కావడంతో ప్రాజెక్టు ఆలస్యమైంది. దాంతో కంగన రనౌత్ హీరోయిన్‌గా తప్పుకొని అవనీత్ కౌర్‌ను బోర్డుపైకి తెచ్చారు. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు కంగన రనౌత్ జీవితంలో జరిగిన సంఘటనలా? అనే అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా ఇది ఆమె జీవితానికి సంబంధించిన అన్ అఫీషియల్ బయోపికా అనే సందేహం కలుగుతుంది.

    Tiku Weds Sheru OTT Review

    లవ్, ఎమోషన్స్, సినీ రంగంలో రాజకీయాలు, అవకతవకాలు, ఫిల్మ్ ఫైనాన్స్, జూనియర్ ఆర్టిస్టుల జీవితాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన సినిమా టికూ వెడ్స్ షేరు (Tiku Weds Sheru). కానీ పేలవమైన సన్నివేశాలు, చిన్న నటీనటులతో సినిమాను చుట్టేసిన విధానం కారణంగా సినిమా డెస్టినీ దెబ్బ తిన్నదనే ఫీలింగ్ కలుగుతుంది. ఒకే పడవ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా కలవడం, ఆ తర్వాత వారి జీవిత ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులకు లోనయ్యాయనే కథను చెప్పే ప్రయత్నం చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి టికూ వెడ్స్ షేర్ నచ్చుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. తీరిక వేళలో చూసి ఆనందించే వీలు మీ చేతిలోనే ఉంది

    English summary
    Bollywood Actress Kangana Ranaut as producer maiden venture is Tiku Weds Sheru. Nawazuddin Siddiqui, Avneet Kaur are in lead. This movie is streaming on Amazon prime Video from June 23rd. Here is the Telugu Filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X