Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

టాలీవుడ్ మన్మధుడు పుట్టిన రోజు-విశేషాలు (ఫోటో ఫీచర్)

Posted by:
Updated: Thursday, August 29, 2013, 15:00 [IST]

హైదరాబాద్ : ఈ రోజు మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఈ వేడుకను అభిమానులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఇమేజ్ క్రియోట్ చేసుకున్నారు. మిగతా హీరోలకు భిన్నంగా.... గీతాంజలి సినిమాతో మొదలైన ఆయన ప్రయోగాల పర్వం నేటికి కొనసాగుతుంది. శివ సినిమాతో తెలుగు సినిమా నే మార్చారు . ఒకవైపు సినీ రంగంలో హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ మంచి పేరు తెచ్చుకున్న ఆయన గురువారం 55వ ఏట అడుగు పెడుతున్నారు.

నాగార్జున 1959 ఆగష్టు 29 న చెన్నైలో జన్మించాడు. మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎమ్.ఎస్ చేసి 1986లో ‘విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు. మొదటనుంచి నాగార్జున కొత్త దర్శకులని, కొత్త కాన్సెప్ట్ లని బాగా ఎంకరేజ్ చేస్తూ,పరిశ్రమకు కొత్త రక్తం ఎక్కిస్తూ వస్తున్నారు.

అలాగే నటుడుగా... యాక్షన్, లవ్ స్టొరీ సినిమాలే కాదు భక్తిరసమైన సినిమాలు చేసి కూడా మెప్పించగలనని నిరూపించారు . కె. రాఘవేంద్ర రావు దర్శకతక్వంలో వచ్చిన అన్నమయ్య ఆయన కెరీర్లో టాప్ సినిమా. అలాగే శ్రీ రామదాసు పాత్రలో కూడా అటు విమర్శకుల ప్రశంసల్ని ఇటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. రీసెంట్ గా ఆయన సాయి బాబా పాత్రలో కనిపించారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ యంగ్ హీరోలతో పోటి పెడుతున్న ఈ నవ యువకుడుకి ..ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.

ఆయన ఆలోచనలు,అభిప్రాయాలుతో...స్లైడ్ షో

నా కోసం సినిమాలు చేయలేదు

నా శాటిస్‌ఫ్యాక్షన్ కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. అలాగే ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేయలేదు. అందరు ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకునే చేశాను. ఫ్యాన్స్ మాత్రమే చూస్తే సినిమాలు హిట్టవవు కదా. 'రాజన్న' కానీ, 'అన్నమయ్య' కానీ, 'శ్రీరామదాసు' కానీ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే చేశాను. అలా అనుకోకపోతే వాటిని చేయలేను. అలా అనుకోకపోతే ఆ రోజుల్లో రామ్‌గోపాల్‌వర్మతో 'శివ' కూడా చేసుండేవాణ్ణి కాదు. లారెన్స్‌తో 'మాస్'ని చేసేవాణ్ణి కాదు.

 

మా ఇష్టం...

"సినిమా బడ్జెట్ అనేది మా ఇష్టం. ఇది పొగరుతో అంటున్నది కాదు. బయట ఎవరి దగ్గర్నుంచీ డబ్బు తీసుకోవట్లేదు కదా'' అన్నారు హీరో అక్కినేని నాగార్జున. సినిమా అనేది ఇన్వెస్ట్‌మెంట్ అనీ, హిట్టయితే డబ్బులొస్తాయి, ఫ్లాపయితే పోతాయనీ చెప్పారు. ఇప్పుడు నేను ఐబీఎల్‌లో ఇన్వెస్ట్ చేశాను. రేపది పికప్ అవకపోతే డబ్బులు పోయినట్లేగా. బడ్జెట్ అనేది ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోకి సంబంధించింది. కాకపోతే అనవసర ఖర్చు ఉండకూడదంటాను. ఖర్చు పెట్టిందంతా స్క్రీన్ మీద కనిపించాలి. రూ. 50 కోట్లు ఖర్చు పెడితే అదంతా తెరమీద కనిపించాలి. ఇప్పుడు నేను చేస్తున్న 'భాయ్' సినిమా వరకొస్తే నా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఖర్చుపెట్టాం.

 

మర్చిపోలేని బర్త్‌డే

పదేళ్ల క్రితం నా పుట్టిన రోజు వేడుకల కోసం మద్రాసు నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరాను. నా ఫ్లైట్ బయలు దేరడం కంటే ముందే మరో మిలిటరీ ఫ్లైట్ హైదరాబాద్‌కు బయలుదేరింది. కాగా ఆ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. అయితే మద్రాసు నుంచి హైదరాబాద్ బయలు దేరిన ఫ్లైటే క్రాష్ అయ్యిందని మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన నా మిత్రులు శ్రేయోభిలాషులు, అభిమానులు అంతా అప్పటికే ఇంటిదగ్గరికి చేరుకున్నారు. ఇంటిదగ్గర అంత మందిని చూసి మన కోసం ఇంతమందున్నారు . మనకు ఏమవుతుంది అనిపించింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన.

 

తెలుసుకున్న ఫిలాసఫీ

ఎప్పుడూ దేనిగురించైనా పెద్దగా ఆలోచించను. అలా ఆలోచిస్తే సమస్యలు మొదలవుతాయి. చిన్న సమస్య కూడా అప్పుడు పెద్దగా కనిపిస్తుంది. ఏపనికైనా ఓ సమయం అనేది ఉంటుంది. ఏది చేయాలన్నా టైమ్ కలిసి రావాలి. నేను చెప్పే ఫిలాసఫీ ఏంటంటే ఎప్పుడూ టెన్షన్స్ పెట్టుకోవద్దు. మైండ్‌ను ప్రశాంతంగా వుంచుకోవాలి. మన మైండ్ కరెక్ట్‌గా వుంటే ఎలాంటి సమస్యలు రావు. దేన్నయినా తట్టుకునే శక్తి ఉంటుంది.

 

యాక్షన్ ఎంటర్‌టైనర్‌లపైనే ...

ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు 80వ దశకంలోనే ఈ తరహా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల ఒరవడిని మొదలు పెట్టారు. పక్కాగా చెప్పాలంటే రాఘవేంద్రరావు ఈ ఒరవడిని ప్రారంభించారని చెప్పాలి. విలన్స్ మధ్య కూడా హాస్యనటులని అసిస్టెంట్‌లుగా పెట్టి వారి మధ్య హాస్యాన్ని పుట్టించారు. ప్రస్తుతం వస్తున్న యువ హీరోల సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాన్స్‌ను కూడా సమపాళ్లలో మేళవిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. దీన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. రోజంతా బిజీలైఫ్‌ని గడుపుతున్న ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో వినోదాన్నే కోరుకుంటున్నారు. మనం మొదలు పెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు బాలీవుడ్‌కు పాకింది. ప్రస్తుతం చేస్తున్న ‘భాయ్'లో కొంత మాఫియా బ్యాక్‌ డ్రాప్ కనిపించినా రెండవభాగం అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది.

 

వందో సినిమా

'భాయ్' 95వ సినిమా, 'మనం' 96వ సినిమా. వందకి ఇంకో నాలుగు చెయ్యాలి. 2015లో వందో సినిమా కచ్చితంగా వస్తుంది. ఇప్పట్నించే దానికి ప్లాన్ చేసుకోవాలన్న మాట. వంద అనేది మంచి సంఖ్య. అది చేరుకోవడం ఆనందమే. కానీ నూరవ సినిమా గురించి ఏమీ ఆలోచించలేదు. ఇప్పటికి తొంభై నాలుగో, అయిదో అయినట్లున్నాయి. లెక్క చూడలేదు. వందవ సినిమా గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. 'మనం' తర్వాత దుర్గా ఆర్ట్స్ బేనర్‌లో సతీశ్ దర్శకత్వంలో ఓ సినిమా, బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

 

సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని...

అభిమానులను దృష్టిలో పెట్టుకునో, నా సంతృప్తి కోసమో నేను సినిమాలు చేయను. సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తాను. అలా ఆలోచిస్తే ‘శివ', ‘గీతాంజలి', ‘అన్నమయ్య', ‘శ్రీరామదాసు' ‘రాజన్న', ‘శిరిడి సాయి' వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసుండే వాణ్ణే కాదు.

ఆ కుటుంబం తర్వాత మా కుటుంబమే

రాజ్‌కపూర్ ఫ్యామిలీ తర్వాత మూడు తరాల హీరోలు కలిసి సినిమా చేసే అవకాశం ఒక్క అక్కినేని ఫ్యామిలీకే వచ్చింది. తర్వాత ఎప్పుడు, ఎవరికి వస్తుందో తెలీదు. అందువల్ల 'మనం' స్పెషల్ ఫిల్మ్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దాన్ని తీస్తున్నాం. నిజ జీవితంలో మాదిరిగానే మేం ముగ్గురం తాత, తండ్రి, కొడుకు పాత్రలు చేస్తున్నాం. రెగ్యులర్ ఫార్మట్‌కు చాలా చాలా భిన్నంగా, చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఈ వయసులోనూ నాన్నగారు ఫుల్ ఎనర్జీతో నటిస్తున్నారు. నేను, నాన్న కాంబినేషన్ సీన్లు చేశాం. మా ముగ్గురి కాంబినేషన్ సీన్లు సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతాయి. అక్టోబర్ ఆఖరుకి షూటింగ్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌కి రెండు నెలలు పడుతుంది.

 

జడ్జ్ చేయలేకపోతున్నాం...

ఈ మధ్య ఏ సినిమా హిట్టవుతుంది? ఏది ఫట్టవుతుందో జడ్జ్ చేయలేకపోతున్నాం అనేది నిజమే. ఇప్పుడున్న జనాభాలో యువతే 65 శాతం ఉంది. మొదటి పది రోజులు యువతే సినిమాలు చూస్తున్నారు. వాళ్లని జడ్జ్ చేయడం మాకు కొంచెం కష్టమే. అందుకే యంగ్ టెక్నీషియన్స్‌తో వర్క్ చేస్తూ, యూత్ నాడి ఎలా ఉందో తెలుసుకుంటుంటాను. యూత్‌కి సినిమా ఎక్కితే చాలు హిట్టే.

 

డ్రీమ్ రోల్స్ ...

ఎన్టీఆర్‌గారు, నాన్నగారు చేసిన పౌరాణికాలు చూస్తూ పెరిగినవాణ్ణి. అలాంటి సినిమాలు ఎవరైనా చేస్తే నటించాలని ఉంది. ఇప్పుడు రాజమౌళిగారు పెద్ద బడ్జెట్‌తో సినిమా చేస్తున్నారు కదా. అలా ఎవరైనా ‘మహాభారతం'లాంటివి తీస్తే చేయాలని ఉంది. మహాభారతంలో ఏ కేరక్టర్ అయినా చేయాలని ఉంది. ఇలాంటి సినిమా అంటే ముగ్గురు, నలుగురు హీరోలు కావాలి. ఎవరైనా ప్లాన్ చేస్తే బాగానే ఉంటుంది.

 

అఖిల్ డైరక్టర్ ఎవరు

అఖిల్ ఎంట్రీ జరిగినప్పుడు డెఫినెట్‌గా జరుగుతుంది. క్రికెట్ నేర్చుకుంటానంటే ఓకే అన్నాను. సినిమాల్లోకి వస్తానంటే ఓకే అంటాను. ఇంకా ఏ దర్శకుడూ కన్‌ఫర్మ్ కాలేదు. అఖిల్ ఎప్పుడు హీరోగా అడుగు పెడతాడనేది ఇంకా నిర్ణయించలేదు. కచ్చితంగా అతని వయసుకు తగ్గ సబ్జెక్టుతోనే ఉంటుంది. వాడికి చిన్నప్పట్నించే నటించాలనేది మనసులో పడిపోయింది.

 

Story first published:  Thursday, August 29, 2013, 12:10 [IST]
English summary
Today is the birthday of Akkineni Nagarjuna. Nagarjuna has consistently re-invented himself over the years and he has never hesitated to try out new things. Films like ‘Manmadhudu’, ‘Shiva’, ‘Geethanjali’ and ‘Ninne Pelladutha’ remain unique and special in our industry.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice