Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

సినిమా వాళ్లని భయపెట్టదంటూ నాగార్జున

Posted by:
Published: Wednesday, August 28, 2013, 12:02 [IST]

 సినిమా వాళ్లని భయపెట్టదంటూ నాగార్జున
 

హైదారాబాద్ : ఏది జరిగినా, ఏమైనా ముందు టార్గెట్ సినిమానే అవుతోంది. ఫెడరేషన్ వాళ్లు, ఫైటర్స్ సమ్మె చేసినా...రాష్ట్ర విభజన విషయమైనా సినిమా వాళ్లనే టార్గెట్ చేస్తున్నారు. షూటింగ్‌లు ఆపేస్తున్నారు. ఈ రెండు మూడేళ్ల కాలంలో సినిమా పరిక్షిశమ భారీ నష్టాలనే చవిచూసింది. ఇప్పటికైనా అందరిని కోరుకునేది ఒక్కటే దయచేసి రాజకీయ నాయకులు సినిమా వాళ్లని భయపెట్టకండి.
ప్రస్తుతం రాష్ట్రంలో వున్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా పరిశ్రమ గురించి నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే ... రాష్ట్ర విభజన తరువాత సినీ పరిక్షిశమ వైజాగ్‌కు తరలిపోతుందనే అలాంటి ఆలోచన ప్రస్తుతానికి ఏమీ లేదు. మద్రాసులో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నపుడు అక్కడి నుంచి పరిశ్రమను హైదరాబాద్ తరలించాలని మర్రి చెన్నాడ్డి, జలగం వెంగళరావు గారు చాలా కృషి చేశారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు చిత్ర పరిక్షిశమ తరలిరావాలని మా నాన్న గారిని వారు కోరడం జరిగింది. ఇక్కడే స్టూడియోలను కట్టమని కూడా అడగడంతో అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించడం జరిగింది. ఇదంతా 63లో జరిగింది. మద్రాసు నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడానికి 30 ఏళ్లు పట్టింది. అయినా ఇప్పటికీ రీ-రికార్డింగ్‌ల కోసమని, ఇతర సాంకేతిక నిపుణుల కోసమని బాంబే, చెన్నై వెళ్లాల్సి వస్తోంది అన్నారు.

ఇక విభజన తరువాత సీమాంధ్ర వేరే రాష్ట్రం అవుతుంది కదా ఇక్కడ నిర్మించే సినిమాలకు రాయితీలకు సంబంధించిన సమస్య తలెత్తే అవకాశం ఉంటుదనే విషయం గురించి చెప్తూ... రాష్ట్ర విభజన వల్ల చిత్రపరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇప్పటికీ చాలా వరకు వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో షూటింగ్‌లు చేస్తున్నాం. రామానాయుడుగారు వైజాగ్‌లో స్టూడియో కట్టారు. అందులోనూ షూటింగ్‌లు జరుగుతున్నాయి. విభజన ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. విభజన అయిపోయాక రెండు రాష్ట్రాల ముఖ్యమంవూతులతో సమావేశమై ఎలా చేస్తే బాగుంటుంది ఏవిధంగా చేస్తే సమస్యలు రావో అందరం కలిసి చర్చిస్తాం. ఇప్పటి నుంచే ఏం జరుగుతుందో? ఏమైపోతుందో అంటూ లేనిపోని అపోహలు పెట్టుకుంటే ప్రశాంతత పోతుంది. అయినా సినీ పరిక్షిశమ హైదరాబాద్‌ను వదిలి అవసరం లేదని నా అభిప్రాయం అన్నారు. నాగార్జున త్వరలో ‘భాయ్'గా మరోసారి తనదైన మార్కు ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకోబోతున్నారు.

English summary
Bhai has been shot in over 15 exotic locales in Bangkok, Europe and India. Also starring Richa Gangopadhyay, Sonu Sood, Rahul Dev, Mukul Dev, Ashish Vidyarthi, Brahmanandam, Jayprakash, Hamsa Nandhini and Nathalia Kaur, the film is expected in theatres next month. "We are as excited as numerous of movie goers and my fans who viewed the first trailer of the film are pouring in their compliments, comments and eagerness to watch the film. The trailer, which reveals the stylish look along with a rocking one minute title song of the film, continues to attract views," Nagarjuna said in a statement. Produced under the banner Annapurna Productions the movie is currently under post production. Veerabhadram Choudry has directed the film and the music is by Devi Sri Prasad.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice