twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nenu Student Sir collections నేను స్టూడెంట్ సార్ మూవీకి పాజిటివ్ టాక్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

    |

    నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా స్వాతిముత్యం మూవీతో టాలీవుడ్ అడుగుపెట్టిన బెల్లంకొండ గణేష్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో నాంది నిర్మాత సతీష్ వర్మ ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నేను స్టూడెంట్ సినిమాను తెరకెక్కించారు. జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ఏ మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

    స్టూడెంట్ బ్యాక్ డ్రాప్‌తో మొబైల్ ఫోన్ మిస్సింగ్ కథా నేపథ్యంగా మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం నేను స్టూడెంట్ సార్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సానీ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లకు మంచి ఆదరణ దక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

    Nenu Student Sir! day 1 expected collections worldwide: bellamkonda Ganesh movie box office report

    ఇక నేను స్టూడెంట్ సార్ సినిమాను మోస్తారు బడ్జెట్‌తో రిచ్‌గా రూపొందించారు. ఈ చిత్రాన్ని సుమారు 4 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి సుమారు 5 కోట్ల వరకు బడ్జెట్ అయింది అని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని సుమారు తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

    నేనూ స్టూడెంట్ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఓ మోస్తారుగా నమోదైంది. మార్నింగ్ షోకు 15 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. అలాగే మ్యాట్నీకి 18 శాతం వరకు నమోదైంది. ఇక మార్నింగ్, మ్యాట్నీకి పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ పాజిటివ్‌గా నమోదైంది. ఈ సినిమాకు ఓవరాల్‌గా 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

    Nenu Student Sir! day 1 expected collections worldwide: bellamkonda Ganesh movie box office report

    నేను స్టూడెంట్ సార్ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఫర్వాలేదనిపించే విధంగా నమోదయ్యాయి. ఈ సినిమా తొలి రోజు 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్‌లో కూడా టాక్ పాజిటివ్‌గానే ఉంది. దాంతో మరో 10 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఓవరాల్‌గా తొలి రోజు 60 లక్షల రూపాయల కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Bellamkonda Ganesh's latest movie is Nenu Student Sir. Satish Varam is the producer. Rakesh Uppalapati is director. Here is the day 1 expected collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X