twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bro సూపర్ సక్సెస్‌ఫుల్.. పవన్ కల్యాణ్ విషయంలో ఆ డౌట్స్ పెట్టుకోకండి.. టీజీ విశ్వ ప్రసాద్ (ఇంటర్వ్యూ)

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం బ్రో (Bro The Avatar). ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రూపొందించిన సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సముద్రఖని దర్శకత్వంలో జీ స్టూడియోస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించాయి. యువ హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 28వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..

    పవన్ కల్యాణ్‌తో చాలా రోజులుగా ట్రావెల్ అవుతున్నాను. ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకొంటున్న సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్టును మా వద్దకు తెచ్చారు. తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించిన వినోదయ సీతమ్ సినిమాను చేయమని సలహా ఇచ్చారు. ఆయన సూచన మేరకు బ్రో (Bro The Avatar) మూవీ స్టార్ట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను పవన్ కల్యాణ్‌తో నిర్మించే అవకాశం లభించింది అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

    TG Vishwa Prasad Interview about Pawan Kalayns Bro and Sai Dharam Tej

    వినోదయ సీతమ్ సినిమా తమిళంలో చాలా చిన్న సినిమా. 20 రోజుల వ్యవధిలో షూట్ చేశారు. కానీ తెలుగు రీమేక్ విషయానికి వస్తే.. చాలా పెద్ద పరిధి ఉన్న సినిమా. బిగ్ స్కేల్‌తో రూపొందించారు. పవన్ కల్యాణ్ అభిమానులకు, ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే కథ, పాటలతోపాటు కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను రూపొందించాం అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

    ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై వినోదయ సీతమ్ ఉంది. రీమేక్స్‌ను ప్రజలు ఆదరించరు అనే విషయాలు తప్పు. ఆ వాదనలు ఉన్నా మేము పట్టించుకోం. రీమేక్స్ విషయంలో మేము తీసుకొనే జాగ్రత్తలు, చర్యలు వేరు. ఒరిజినల్ సినిమాకు బ్రో సినిమా ఎక్కడా పోలీక ఉండదు. ఆ విషయాన్ని సినిమా చూస్తే మీరే గ్రహిస్తారు అని టీజీ విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.

    రిలీజ్ తర్వాత వినోదయ సీతమ్ కంటే బ్రో సూపర్ సక్సెస్‌ఫుల్ అనేది మీరే గ్రహిస్తారు. తమిళంలో సముద్రఖని తక్కువగా తీశారనేది నా ఉద్దేశం కాదు. పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఆడియెన్స్‌కు గొప్ప అనుభూతిని పంచుతుంది. నేను ఇంకా తమిళ వెర్షన్ చూడలేదు. తొలి పది నిమిషాల తర్వాత పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ముగిసేంత వరకు పవన్ కల్యాణ్ కథలో ఉంటాడు అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

    TG Vishwa Prasad Interview about Pawan Kalayns Bro and Sai Dharam Tej

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాస్ కోరుకొన్నా.. ఈ సినిమాలో మెసేజ్ వారిని విశేషంగా ఆకట్టుకొంటుంది. స్ట్రాంగ్ ఎమోషన్స్, బాండింగ్ బాగా వర్కవుట్ అవుతుంది. ఆడియెన్స్ అంచనాలకు మించి బ్రో సినిమా ఉంటుంది. చాలా సినిమాలు ఆయన చేస్తున్నప్పటికీ.. మాకు ఇచ్చిన డేట్స్‌ను పక్కాగా వాడుకొని సినిమాను కంప్లీట్ చేశాం. ప్రతీ సినిమాకు టైమ్ లిమిట్ ఉంటుంది. ఎలాంటి సమస్య లేకుండా దానిని వాడుకొన్నాం అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

    ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఓ సినిమాలో నటిస్తే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. కొన్నిసార్లు అభిమానులు నిరాశపడే ప్రమాదం ఉంది. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి అనుమానాలు, సందేహాలు అక్కర్లేదు. సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ మధ్య ఎమోషన్స్, బాండింగ్ చాలా ఫర్ఫెక్ట్‌గా వర్కవుట్ అయ్యాయి. వాస్తవ జీవితంలో వారి మధ్య ఉండే బాండింగ్ సినిమాకు బాగా వర్క్ అయ్యాయని భావిస్తున్నాను అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

    బ్రో సినిమా రీమేక్ రైట్స్, బడ్జెట్, ఇద్దరు హీరోలను మేనేజ్ చేసే అంశాలు మాకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు. మాకు ఉన్న ప్లాన్ ప్రకారం చక్కగా ఎగ్జిక్యూట్ చేశాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ప్రాఫిట్ తెచ్చే సినిమా బ్రో. ఈ సినిమాతో భాగమైన అందరికి మేలు, లాభాలు చేసే విధంగా బ్రో ఉంటుంది అని నిర్మాత విశ్వ ప్రసాద్ తెలిపారు.

    English summary
    Bro starring Pawan Kalyan and Sai Dharam Tej in the lead roles is the next big Tollywood film coming under the banner People Media Factory, one of the leading production houses in Telugu cinema. The production banner has joined hands with ZEE Studios for Bro which is written and directed by Samuthirakani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X