twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ మరో అరుదైన గౌరవం అందుకోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత బర్క్‌లీ మ్యూజిక్ కాలేజీ ఆయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాలని నిర్ణయించింది. 'స్లమ్ డాగ్ మిలియనీర్', '127 హవర్', 'ఎలిజబెత్:ది గోల్డెన్ ఏజ్' మరియు 'మిలియన్ డాలర్ ఆర్మ్' చిత్రాలకు అద్భుతమైన ఒరిజినల్ స్కోర్, సాంగ్స్ అందించినందుకుగాను ఆయనకు ఈ డాక్టర్ ప్రధానం చేస్తున్నట్లు బర్క్‌లీ కాలేజీ విడుదల చేసిన మీడియా స్టేట్మెంట్లో వెల్లడించింది. అక్టోబర్ 24న జరిగే ఈవెంటులో ఈ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.

    ఈ అవార్డు రావడంపై రహమాన్ స్పందిస్తూ....ప్రపంచ ప్రఖ్యాత సంగీత కళాశాల నుండి నుండి ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, సంగీతమే ప్రపంచంగా జీవించే నేనే దీన్ని ఎంతో గొప్పగా భావిస్తున్నట్లు' వెల్లడించారు. బర్క్‌లీ మ్యూజిక్ కాలేజీ ప్రెసిడెంట్ రోజర్ హెచ్ బ్రౌన్ ఈ సందర్భంగా రహమాన్‌ను అభినందించారు. రహమాన్ తనకు స్నేహితుడి లాంటివాడని, అతన్ని ఈ గౌరవం స్వీకరించడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

    A. R. Rahman to receive honorary doctorate from Berklee

    ఈ గౌరవం తర్వాత రెహహాన్, బర్క్‌లీ కాలేజీ మధ్య కొత్త బంధం ఏర్పడనుంది. రెహహాన్ పేరు మీద ఒక స్కాలర్ షిప్ ఏర్పాటు చేసి ఇండియా నుండి బర్క్‌లీ కాలేజీకి స్టూడెంట్స్‌ రావడానికి సహాయ పడాలని నిర్ణయించింది. అక్టోబర్ 24 తర్వాత ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియనున్నాయి.

    English summary
    In recognition of his two—decades—long musical legacy, the prestigious Berklee College of Music is all set to honour Oscar—winning composer A. R. Rahman with an honorary doctorate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X