twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆదర్శ్ బాలకృష్ణతో ఫైట్ చేయబోతున్న రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటుడు ఆదర్శ్ బాలకృష్ణ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. 'హ్యాపీ డేస్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కుర్రాడు ఇప్పటి వరకు నటించిన పలు చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాడు. రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

    ఈ చిత్రంలో తను పోషించిన విలన్ పాత్ర తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ. భారీ తారాగణంతో కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రంలో రామ్ చరణ్ తాత పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్‌కు జోడీగా జయసుధ నటిస్తోంది. మరో నటుడు శ్రీకాంత్ రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో నటిస్తుండగా అతనికి జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నపారు.

     Aadarsh Balakrishna villain role in GAV

    'గోవిందుడు అందరివాడేలే' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ ని కృష్ణ వంశీ పుట్టిన రోజు(జులై 28) సందర్భంగా ఈ రోజు విడుదల చేద్దామనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీలుకాలేదు. దీంతో టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున(ఆగస్టు 22న) విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

    'గోవిందుడు అందరివాడేలే చిత్రం రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. అక్టోబర్ 1న విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్ కావడంతో రామ్ చరణ్ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్‌ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    
 Aadarsh Balakrishna, who will be pitted against Ram Charan in upcoming Telugu film "Govindudu Andarivadele", says he would like to make a mark as a successful baddie in the industry as he strongly feels there's a dearth of young villains.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X