twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పీకే' ఫస్ట్ లుక్ చూసి అంతా షాక్(ఫొటో)

    By Srikanya
    |

    ముంబై: బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం 'పీకే' అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ చూసిన వారు షాక్ అవుతున్నారు. రేడియో అడ్డం తప్ప ఒంటిపే ఒక్క నూలు పోగు లేకుండా కనిపించి అమీర్ ఖాన్ అందరినీ ఆశ్చర్యంలో పడేసారు. నగ్నంగా నటిస్తున్నాడు అమీర్ ఖాన్ అంటే ఏమిటో అనుకున్నవారు సైతం ఈ ఫస్ట్ లుక్ చూసాక షాక్ అయ్యారు. క్రిస్మస్ కానుకగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బోమన్ ఇరానీ, సంజయ్ దత్ లు నటిస్తున్నారు.

    ఇక ఈ చిత్రం ముందునుకున్న తేది కంటే వారం రోజుల ముందే విడుదలకు సిద్దమవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

    Aamir Khan's PK Movie 1st Look

    'పీకే' సినిమా విషయానికొస్త.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు. అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు.

    బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్‌ ఇదే అని అంటున్నారు.

    English summary
    Here comes the most awaited sensational poster of Aamir Khan’s PK. The film also starring Anushka Sharma & Sushant Singh Rajput will release on 19th Dec.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X